Iphone Crash Detecton| ఒక 16 ఏళ్ల అమ్మాయి ఒక పెద్ద కారు ప్రమాదానికి గురైంది. అయితే ఆమె ఉపయోగించే ఐఫోన్ కారణంగా ఈ ప్రమాదం నుండి తప్పించుకుంది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో 16 ఏళ్ల లిండ్సే లెస్కోవాక్ కొన్ని రోజుల క్రితం తన పికప్ ట్రక్‌లో ఇంటికి వెళ్తూ నిద్రమత్తులో ఉండగా, ఆమె వాహనం స్తంభాలు, చెట్లను బలంగా ఢీకొట్టి సరస్సులొ పడింది. ఆమె ట్రక్‌లో చిక్కుకుపోయి సహాయం కోసం కాల్ చేయలేకపోయింది. కానీ ఆమె ఉపయోగించే ఐఫోన్ 14లోని క్రాష్ డిటెక్షన్ ఫీచర్ ఈ ప్రమాద సమయంలో ఆమె ప్రాణాలు కాపాడింది. ఆ ఐఫోన్ ఆటోమేటిక్‌గా ఎమర్జెన్సీ సర్వీస్ కు కాల్ చేసి, ఆమె లొకేషన్ రెస్క్యూ టీమ్ కు పంపింది.
ఐఫోన్ లో క్రాష్ డిటెక్షన్ ఎలా పనిచేసింది?
ప్రమాదం జరిగిన వెంటనే.. లిండ్సే ఐఫోన్ ప్రమాదాన్ని గుర్తించి, 911కి ఆటోమేటిక్‌గా కాల్ చేసింది. ఆమె అపస్మారక స్థితిలో ఉండగా, డిస్పాచర్ ఆమెను మేల్కొల్పేందుకు ఫోన్ ద్వారా మాట్లాడారు. ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత, 22 నిమిషాల పాటు డిస్పాచర్‌తో మాట్లాడింది, దీని వల్ల రెస్క్యూ టీమ్ ఆమెను సులభంగా కనుగొనగలిగింది. ఐఫోన్ లో ఈ ఫీచర్ లేకపోతే, లిండ్సే బతికి ఉండేది కాదేమో.
ఐఫోన్ వల్లే నా కూతురు బతికి ఉంది: లిండ్సే తల్లి
లిండ్సే తల్లి లారా మీడియాతో మాట్లాడుతూ.. తన కూతురు బతికి ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపింది. “రెస్క్యూ టీమ్ నాకు చెప్పింది, లిండ్సే ఫోన్ ఆటోమేటిక్ గా 911కి కాల్ చేసింది. ఈ ఫీచర్ లేకపోతే నా కూతురు చనిపోయేది! టెక్నాలజీ నా కూతురిని కాపాడింది,” అని ఆమె అన్నారు. ఐఫోన్ లో ఈ ఫీచర్ అందరూ ఆన్ చేయాలని ఆమె అందరు ఐఫోన్ వినియోగదారులకు సూచించింది.
ప్రమాదంలో లిండ్సే కు గాయాలు
ప్రమాదంలో లిండ్సేకు తీవ్రమైన గాయాలయ్యాయి. పెల్విస్, హిప్, సర్వైకల్ స్పైన్‌లో (వెనెముక) ఫ్రాక్చర్లు సంభవించాయి. ఆమె కోలుకోవడానికి సమయం పడుతుంది, అయితే లిండ్సే బతికి ఉన్నందుకు ఆమె కుటుంబం సంతోషిస్తున్నారు. ఐఫోన్ సత్వర చర్యలే ఈ ఫలితాన్ని సాధ్యం చేసింది.
ఈ ఫీచర్ ఎందుకు ముఖ్యం?
క్రాష్ డిటెక్షన్ ఫీచర్ ఇంతకు ముందు కూడా అనేక మంది ప్రాణాలను కాపాడింది. మీరు సహాయం కోసం కాల్ చేయలేని సమయంలో, ఈ ఫీచర్ వేగంగా అత్యవసర సేవలకు సమాచారం అందిస్తుంది. ప్రతి ఐఫోన్ వినియోగదారుడు ఈ ఫీచర్‌ను ఆన్ చేసి ఉంచడం చాలా ముఖ్యం. ఇది ప్రాణాపాయ స్థితిలో ఉపయోగపడుతుంది.
క్రాష్ డిటెక్షన్‌ను ఎలా ఆన్ చేయాలి?
క్రాష్ డిటెక్షన్‌ను ఆన్ చేయడం సులభం. ఈ నాలుగు స్టెప్స్ అనుసరించండి:
ప్రమాదం నుంచి నేర్చుకోవాల్సిన భద్రతా పాఠాలు
లిండ్సే కు జరిగిన ప్రమాదం.. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్రపోవడం ఎంత ప్రమాదకరమో చూపిస్తుంది. ఈ సంఘటన టెక్నాలజీ ఎలా ప్రాణాలను కాపాడగలదో నిరూపించింది. క్రాష్ డిటెక్షన్ ఫీచర్ మీ భద్రత కోసం ఒక ముఖ్యమైన సాధనం.
Also Read: యూట్యూబ్‌లో యాడ్స్ తో విసిగిపోయారా?.. ఈ సింపుల్ ట్రిక్ తో ఉచితంగా యాడ్స్ బ్లాక్ చేయండి