Bigg Boss 9 Telugu : టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ కు రోజు రోజుకి డిమాండ్ పెరుగుతూ వస్తుంది. మిగిలిన భాషల్లో ఎక్కువ సీజన్ లో పూర్తి చేసుకుంది. కానీ తెలుగులో మాత్రం తొమ్మిదవ సీజన్ ప్రసారమవుతుంది. ప్రస్తుతం ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ఈవారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారా అని జనాలు ఆసక్తిగా ఎదురుచూశారు. అనారోగ్యం కారణంగా మిడ్ వీక్ లో ఆయేషా బయటకు వచ్చేసింది. అయితే ఈ వారం ఎలిమినేషన్ లేదనే పూకార్లు కూడా వినిపించాయి. కానీ రమ్య మోక్ష హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. పచ్చళ్ళ పాపగా బాగా పేరు తెచ్చుకునే ఈ అమ్మడు హౌస్ లో తన ఆట తీరు కనబరచలేకపోయింది. దాంతో రెండు వారాలకి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. మరి ఈమె రెండు వారాలకు గాను ఎంత రెమ్యూనరేషన్ను తీసుకుందో ఒకసారి తెలుసుకుందాం..
ఐదో వారం వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లలో అలేఖ్య చిట్టి పీకేల్స్ తో బాగా ఫేమస్ అయినా రమ్య మోక్ష హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. ఈ అమ్మడు హౌస్ లోకి వచ్చి రాగానే అందరిపై నోరు పారేసుకుంటూ విరుచుకు పడింది. అదే ఆమెకు మైనస్ అయిందని చెప్పాలి. ఇక టాస్కులలో పాప పర్ఫామెన్స్ సరిగ్గా లేదని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఇక ఎవ్వరు ఊహించిన విధంగా రెండు వారాలకి ఈమె హౌస్ నుంచి బయటకు వచ్చేసిందని తెలుస్తుంది. శని,ఆదివారాలకు సంబంధించిన ఎపిసోడ్స్ ని శనివారం రోజునే షూటింగ్ చేస్తారు అనే విషయం తెలిసిందే. రమ్య మోక్ష ఎలిమినేషన్ పూర్తి అయ్యి, తర్వాత ఎపిసోడ్ షూటింగు కూడా పూర్తి చేసుకుందని సమాచారం. ఏది ఏమైనా కూడా ఈమె ఆట తీరు సరిగా లేకపోవడం వల్లే ఎలిమినేట్ అయిందని బయట టాక్ వినిపిస్తుంది. ఇకపోతే ఈమె రెండు వారాలకు 3 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్.. ఇక ఎనిమిదవ వారం అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కావడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్న ప్రశ్నలు ఇప్పటినుంచే మొదలవుతున్నాయి..
Also Read : ప్రదీప్ రంగనాథన్ – మహేష్ కాంబోలో మూవీ.. మెంటలెక్కించే ట్విస్ట్..
వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన మరొకరు దువ్వాడ మాధురి.. ఈమె హౌస్ లోకి వచ్చి రాగానే చేసిన రచ్చ అంతా కాదు. కంటెస్టెంట్ల పై విరుచుకు పడడంతో ఈమెకు నోటి దూల ఎక్కువగా ఉందని మొదటివారంకే హౌస్ నుంచి బయటకు వెళుతుందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ రాను రాను ఈమె తీరు మారడంతో జనాలు ఓట్లతో ఆమెను హౌస్ లో ఉండనిస్తున్నారని తెలుస్తుంది.. శనివారం ఎపిసోడ్లో నాగార్జున అందరికీ క్లాసు పీకుతాడన్న విషయం తెలిసిందే.. ప్రతి ఒక్కరికి నాగార్జున దిమ్మ తిరిగిపోయే క్లాసు ఇచ్చాడు. క్రమంలో దువ్వాడ మాధురికి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.. మాధురి బయట మీరు తోపు అయితే బయట చూసుకోండి. బిగ్ బాస్ హౌస్ లో కాదు. ఇలాంటి కఠినమైన పదాలు వాడొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు నాగ్.. దీని తర్వాత అయినా ఆమె మాట తీరు.. ఆట తీరు మారుతుందేమో చూడాలి.. ఇక ఎనిమిదవ వారం నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి..