Nuvvu Nenu Prema Web Series Glimpse: నిజ జీవిత సంఘటన అధారంగా ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు మంచి ఆదరణ పొందాయి. అయితే ఇప్పుడు రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఓ తెలుగు వెబ్ సరీస్ సిద్ధమవుతుంది. అదే నువ్వు నేను ప్రేమ. యూట్యూబ్ వీడియోలు వెబ్ సిరీస్‌తో ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకున్న విరాజిత ప్రధాన పాత్రలో లవ్ అండ్ క్రైం డ్రామ రాబోతోంది. ఇప్పటికే సిద్దు దివాకర్తో ఆమె చేసిన వెబ్ సరీస్ సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరు నువ్వు నేను ప్రేమ అనే వెబ్ సరీస్తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యారు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది.
శ్రీవిష్ణు సినిమాలా సరదగా సాగిపోయే నా జీవితం.. ఇప్పుడోక క్రైం థ్రిల్లర్‌గా మారబోతోంది. దానికి కారణం ఆఫీసులో ఒక అమ్మాయి.. తన పేరు భాగ్య’ సిద్దు దివాకర్ ఇండక్షన్‌తో మొదలైంది. ఆ తర్వాత నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? అని విరాజిత అమాకంగా అడిగిన ఈ సీన్ ఆకట్టుకుంటుంది. ‘మన ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఉండాలి కానీ, ఎటువంటి ఫిజికల్ బాండ్ మాత్రం అస్సలు ఉండకూడదు’ అంటూ హీరోకి హీరోయిన్ కండిషన్ పెడుతుంది. ఈ డైలాగ్ యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. అదే సమయంలో వచ్చిన సీన్స్ ఆకట్టుకుంటాయి. ‘లైఫ్‌లో తొందరపడితే కెరీర్ పోతుందేమో.. కానీ లవ్‌లో తొందరపడితే లైఫే పోతుంది’ అనే డైలాగ్ గ్లింప్స్‌లో హైలెట్‌గా నిలిచింది. అదే సమయంలో లీడ్ రోల్స్ మధ్య గొడవలు, హీరోయిన్ ప్రెగ్నెంట్ అవ్వడం, ఇద్దరి మధ్య గొడవలు కాస్తా క్రైంకి దారిసినట్టుగా ఈ గ్లింప్స్‌లో చూపించారు.
గ్లింప్స్ చివరిలో విరాజిత ప్రియుడిని చంపి.. శవాన్ని డ్రమ్‌లో దాచడం చూపించారు. మొత్తానికి ఒక రొమాంటిక్ లవ్, క్రైం డ్రామా ‘నువ్వు నేను ప్రేమ’ వెబ్ సిరీస్ ఉండనుందని ఈ గ్లింప్స్ చూస్తే అర్థమైపోతుంది. ప్రస్తుత జీవితంలో జరుగుతున్న సంఘటనలను.. యూత్‌కి కనెక్ట్ అయ్యేలా ఈ వెబ్ సిరీస్‌ని తెరకెక్కించారు. పెళ్లికి ముందే ప్రేమికులిద్దరు కలిసి ఉంటే వారిమధ్య నెలకొనే పరిణామాలు, విభేదాలను ఈ గ్లింప్స్‌లో చూపించారు. యూత్‌కి మంచి మెసేజ్ ఇచ్చేలా ఉంది ఈ వెబ్ సిరీస్. ఎప్పటిలాగే విరాజిత తనదైన నటన, అమాకత్వం, విలనిజంతో ఆకట్టుకుంది. మొత్తానికి నువ్వు నేను ప్రేమ గ్లింప్స్ ఈ వెబ్ సిరీస్ ఆసక్తి పెంచుతోంది.
నటి విరాజిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు వెబ్ సరీస్‌లో నటించి మంచి గుర్తింపు పొందింది. ముఖ్యంగా తనదైన నటన, అమాకత్వంతో విరాజితకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించు కుంది. యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ప్లూయేన్సర్గా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. సిద్ధు దివాకర్, విరాజిత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఇన్ఫినిటమ్ నెట్వర్క్ సోల్యుషన్పై వందన బండారు నిర్మించిన ఈ వెబ్ సిరీస్ లవ్ అండ్ క్రైం థ్రిల్లర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ వెబ్ సిరీస్ చూస్తుంటే రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓ మర్డర్ కేసుని తలపిస్తోంది. ఇటీవల కాలంలో తెలంగాణలో భర్తను చంపి శవాన్ని డ్రమ్ లో ఉంచిన కేసు ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. అలాంటి క్రైంని తలపించేలా నువ్వు నేను ప్రేమ వెబ్ సిరీస్‌ని తెరకెక్కించారని అనిపిస్తోంది.
Also Read: OG Movie: ‘ఓజీ‘ కోసం రంగంలోకి 117 మంది సంగీత కళాకారులు.. తమన్ క్రేజీ అప్డేట్