Silver Loan: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు ఒక రోజు రైజ్ అయితే .. రెండు రోజులు డౌన్ అవుతోంది. దీంతో మదుపరులు బంగారు, వెండి వైపు మళ్లారు. ఈ క్రమంలో ఆ రెండింటి ధరలు ఆశాకాన్ని తాకాయి. పసిడి విషయం కాసేపు పక్కనబెడదాం. సిల్వర్ ధర అమాంతంగా పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ సిల్వర్ లక్షా 70 వేలు పైమాటే. అంటే గ్రాము 170 రూపాయలు అన్నమాట.
ఇక సిల్వర్‌పై కూడా లోన్లు
బంగారంపై బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. వాటి మాదిరిగానే వెండిపై రుణాలు లభించనున్నాయి. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఆర్బీఐ. ఈ కొత్త మార్గదర్శకాలు వచ్చే ఏడాది అంటే 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు వెండి ఆభరణాలు, కాయిన్స్‌ను తనఖా పెట్టుకుని రుణాలు ఇవ్వవచ్చు.
వెండి కడ్డీలు, ఈటీఎఫ్‌లపై రుణాలు ఇవ్వరాదని తేల్చిచెప్పింది. వినియోగదారులు గరిష్టంగా 10 కేజీల వరకు తాకట్టు పెట్టి రుణం పొందవచ్చు. ఆ లెక్కన రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చన్నమాట. అర కేజీ సిల్వర్ కాయిన్స్ తాకట్టు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది. అయితే రుణం అనేది ప్రస్తుతం మార్కెట్ విలువ ఆధారంగా నిర్ణయించబడుతుంది.
ఆర్బీఐ కీలక నిర్ణయం
ఇటీవల కాలంలో వెండిని ఆభరణాలకు మాత్రమే కాకుండా పారిశ్రామికంగా ఉపయోగిస్తున్నారు. సోలార్ ప్యానెల్స్, విద్యుత్ బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు తదితర రంగాల్లో వినియోగం పెరగడమే దీనికి కారణంగా తెలుస్తోది. దీనికితోడు మార్కెట్లో రోజు రోజుకూ వెండి ధర పెరగడం గమనించిన ఆర్భీఐ, ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ: ఎల్ఐసీ బంపరాఫర్.. రూ.490 కే లక్ష రూపాయల పాలసీ
వినియోగదారులు స్వల్పకాలిక అవసరాలను తీర్చడానికి బంగారం లేదా వెండి ఆభరణాలను తాకట్టు పెడతాయి. వీటి ద్వారా తీసుకున్న రుణాలకు ఏడాది కాల పరిమితి ఉంటుంది. వడ్డీ, అసలు కలిసి చివరిలో చెల్లించాలి. రుణదాతలు తాకట్టు పెట్టిన బంగారం లేదా వెండిని రుణం ముగిసిన వారంలోపు తిరిగి ఇవ్వాలి. ఒకవేళ ఆలస్యం అయితే ఆయా సంస్థలు లేదా బ్యాంకులు రుణగ్రహీతలకు రోజుకు ఐదు వేల వరకు పరిహారం చెల్లించాలి.