Dussehra holidays: ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు దసరా సెలవులను ప్రకటించింది. ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు సెలవులను ప్రకటించింది. అంటే దాదాపు 13 రోజులపాటు ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలు సెలవులు ప్రకటించింది. దసరా తర్వాత అనంతరం అక్టోబర్ 4న శనివారం పాఠశాలలను తిరిగి ఓపెన్ కానున్నాయి.
ఆ రోజు ఎలాగూ శనివారం కావడంతో విద్యార్థులు పాఠశాలలకు డుమ్మా కొట్టే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూస్తే దాదాపు రెండువారాలు సెలవులు వచ్చాయి. ఇక ప్రభుత్వం, ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకు 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులను ప్రకటించింది ప్రభుత్వం.
విద్యార్థులు, తల్లిదండ్రులు ఆ షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని తమ తమ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది తెలంగాణ విద్యాశాఖ. జూనియర్ కళాశాలలకు అక్టోబర్ 5 వరకు అంటే ఎనిమిది రోజుల సెలవులు వచ్చాయి. అక్టోబర్ 6న తిరిగి తెరవనున్నారు. నవంబర్ 10 నుండి 15 వరకు విద్యార్థులకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు ఉంటాయి.
సెలవులకు ముందు పాఠశాలలు, కాలేజీలు తమ నిర్మాణాత్మక మూల్యాంకనం పరీక్షలను ముగించాలి. తిరిగి ప్రారంభించిన తర్వాత విద్యార్థులు అక్టోబర్ 24 నుండి 31 వరకు సంగ్రహణాత్మక మూల్యాంకనం-SA- 1 పరీక్షలను రాయాల్సి వుంటుంది. పత్రాల మూల్యాంకనం తర్వాత నవంబర్ 6 నాటికి SA-1 ఫలితాలు ప్రకటిస్తారు.
ALSO READ: తెలంగాణలో టీ-ఫైబర్.. దసరాకు మిస్సయితే, ఓపెనింగ్ ఎప్పుడు?
SA 1 పూర్తయిన తర్వాత బోధన తప్ప నవంబర్ నెలలో ఎలాంటి పరీక్షలు ఉండవు. ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో టూర్ ప్లానింగ్‌లో విద్యార్థులు రెడీ కానున్నారు. దసరా సెలవుల నేపథ్యంలో అయితే బంధువుల ఇళ్లకు, లేకుంటే పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు ప్లాన్ చేయనున్నారు. లాంగ్ టూర్ వెళ్లేవారు మందుగా ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసుకోకుంటే రిగ్రెట్ రావడం ఖాయం.
ప్రభుత్వ దసరా సెలవులు ప్రకటించడంతో బతుకమ్మ, దసరా వేడుకలు మరింత జోష్‌గా జరగనున్నాయి. బతుకమ్మ ముగింపు తర్వాత దసరా శోభాయాత్రలు జరగనున్నాయి. ఆ తర్వాత రావణ దహనం కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం కూడా దసరా సెలవుల విషయంలో ఓ క్లారిటీకి వచ్చింది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఇవ్వనుంది. ఎలా చూసినా ఏపీ కంటే తెలంగాణకు మూడు రోజులు సెలవులు అధికంగా వచ్చాయి.