Rohit Sharma Daughter: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత కెప్టెన్ గా ఎన్నో విజయాలు అందించిన రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. నిన్న ఆస్ట్రేలియా గడ్డపై కూడా రెచ్చిపోయి సెంచరీ చేశాడు రోహిత్ శర్మ. అయితే అలాంటి రోహిత్ శర్మ ఫ్యామిలీకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. తన పిల్లలను పట్టుకొని రితికా సజ్జే ( Ritika Sajdeh ) ముంబై ఏర్పాట్లు మెరిశారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ కూతురు, కొడుకు హాట్ టాపిక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
సిడ్నీ వేదికగా రోహిత్ శర్మ నిన్న రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. దీంతో అందరూ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ చూసి ఎంతో ఆనందపడ్డారు. ఇలాంటి నేపథ్యంలో రోహిత్ శర్మ కుటుంబం ఫోటో అలాగే వీడియోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. నిన్నటి రోజున రోహిత్ శర్మ భార్య రితికా సజ్జే, తన కూతురు, కొడుకును తీసుకొని ఎక్కడికో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబై విమానాశ్రయంలో రోహిత్ శర్మ ఫ్యామిలీ మెరిసింది. ఈ వీడియోలో రోహిత్ శర్మ కొడుకు అహాన్ ( Ahaan) చాలా క్యూట్ గా కనిపించాడు. అచ్చం రోహిత్ శర్మను ( Rohit Sharma ) దించేశాడు చోటా రోహిత్. అటు రోహిత్ శర్మ కూతురు సమైరా ( Samaira) మాత్రం కాస్త కోపంగా కనిపించారు.
పదేపదే తమ ఫ్యామిలీ వీడియో తీస్తున్న నేపథ్యంలో.. కెమెరామెన్ లకు సీరియస్ లుక్ ఇచ్చారు సమైరా. ఎందుకు వీడియోలు తీస్తున్నారు? మీకు కొంచమైన బుద్ధుందా ? అన్న రేంజ్ లో రోహిత్ శర్మ కూతురు ( Rohit Sharma Daughter:) సమైరా ( Samaira ) సీరియస్ గా చూసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన రోహిత్ శర్మ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే, తన తమ్ముడు అహాన్ ( Ahaan) ఫోటోలు, వీడియోలు తీసినందుకు గాను రోహిత్ శర్మ కూతురు సమైరా ( Samaira) సీరియస్ లుక్ ఇచ్చి ఉంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మీడియోలో హైలెట్ కావడం సమైరాకు పెద్దగా ఇష్టం ఉండందని రోహిత్ శర్మ ఫ్యాన్స్ అంటున్నారు.
ఆసీస్ వర్సెస్ టీమిండియా మధ్య నిన్న సిడ్ని వేదికగా జరిగిన వన్డేలో రోహిత్ శర్మ సూపర్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 105 బంతుల్లో సెంచరీ చేసి, దుమ్ములేపాడు. ఈ సెంచరీతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. అటు ఈ సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్ లో 50 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ.
?igsh=eG0wYWh6ajZ1NzZl
Samaira's reaction to paps at Mumbai airport.😭🔥❤️ pic.twitter.com/7NM5jQx1PL
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) October 25, 2025