Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఎంతవరకు వచ్చింది? ప్రధాన పార్టీల నుంచి స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగేశారా? టీడీపీ-జనసేన పార్టీల మాటేంటి? ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నాయి? లేకుంటే తటస్థంగా ఉంటాయా? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బీజేపీ తరపున ప్రచారంలో పాల్గొనే అవకాశముందా? అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు.
వేడెక్కిన జూబ్లీహిల్స్ బైపోల్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం వేడెక్కింది. విజయం సాధించేందుకు ప్రధాన పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగేశారు. ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అభివృద్ధి తాము చేస్తామంటే తాము చేస్తామని చెబుతున్నాయి. విపక్ష బీఆర్ఎస్ మాత్రం గతంలో చేసిన అభివృద్ధి చెప్పే ప్రయత్నం చేస్తోంది.
జూబ్లీహిల్స్ బైపోల్‌లో గెలిచిన పార్టీ.. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించడం ఈజీ అవుతుందని భావిస్తున్నాయి పార్టీలు. ఈ గెలుపు ప్రభావం దానిపై పడుతుందని అంటున్నాయి. అందుకే బైపోల్‌ని అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఇక ప్రచారానికి కేవలం రెండువారాలు మాత్రమే మిగిలివుంది.
ప్రచారంలోకి స్టార్ క్యాంపెయినర్లు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో టీడీపీ-జనసేన పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో సెటిలర్స్ ఓట్లు కీలకంగా మారింది. ఈ క్రమంలో ఏపీ బీజేపీ మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేనల మద్దతుపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వచ్చారని అన్నారు.
ALSO READ: చెప్పుతో కొట్టండి.. పోచారం స్వరం మారుతుందా?
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ప్రచారానికి వచ్చే ఛాన్స్ ఉందని మనసులోని మాట బయటపెట్టారు సదరు మంత్రి. ఆ నేతల ప్రభావం బైపోల్‌పై ఉంటుందన్నారు. తెలంగాణలో ఆ రెండు పార్టీలు యాక్టివ్‌గా ఉండలేకపోవచ్చుకానీ, ఆ నేతలిద్దరి చరిష్మా పని చేస్తుందన్నారు. వారిద్దరు ప్రచారం చేస్తే బీజేపీకి అనుకూలంగా మారుతుందని, పార్టీ హైకమాండ్ ఆ దిశగా చర్యలు చేపట్టవచ్చని అంటున్నారు.
ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి సత్యకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం తెలియగానే తెలంగాణ బీజేపీ నేతలు ఫుల్‌ఖుషీ అవుతున్నారు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం ప్రచారానికి దిగితే మా విజయం ఈజీ అవుతుందని నేతలు భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.