BigTV English

Vivo V60: మార్కెట్ లోకి కొత్త ఫోన్.. హై రేంజ్ ఫీచర్స్ తో.. ఈ మొబైల్ వెరీ స్పెషల్!

Vivo V60: మార్కెట్ లోకి కొత్త ఫోన్.. హై రేంజ్ ఫీచర్స్ తో.. ఈ మొబైల్ వెరీ స్పెషల్!

Vivo V60: మార్కెట్‌లోకి ఓ కొత్త స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. డిజైన్ చూడగానే కళ్లను తిప్పుకోలేరు, ఫీచర్స్ వినగానే.. ఇది నాదే కావాలని అనిపిస్తుంది. కెమెరా, బ్యాటరీ, పనితీరు.. అన్నీ కొత్త లెవెల్‌లో ఉన్న ఈ ఫోన్ గురించి తెలుసుకుంటే, మీ పాత ఫోన్‌ను వెంటనే మార్చేస్తారేమో. ఇంతకు ఆ మోడల్ ఏమిటి? దాని స్పెషల్ ఫీచర్స్ ఏమిటో తెలుసుకుందాం.


ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పోటీ రోజు రోజుకి పెరుగుతోంది. ఈ పోటీలో తన మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నంలో Vivo మంగళవారం Vivo V60 ను అధికారికంగా లాంచ్ చేసింది. ఫీచర్లు, డిజైన్, కెమెరా సామర్థ్యాలు.. అన్ని విభాగాల్లో కూడా ఈ ఫోన్ ప్రత్యేకంగా నిలవాలని Vivo లక్ష్యంగా పెట్టుకుంది. Snapdragon 7 Gen 4 ప్రాసెసర్, భారీ 6,500mAh బ్యాటరీ, అద్భుతమైన 50MP కెమెరా సెటప్‌తో, ఇది టెక్ లవర్స్‌కి ఒక కొత్త ఆప్షన్ గా రాబోతోంది.

ధర అందుబాటులోనే..
Vivo V60 ధర ఇండియాలో రూ.36,999 నుంచి ప్రారంభమవుతోంది (8GB + 128GB మోడల్). 8GB + 256GB వెర్షన్ ధర రూ. 38,999, 12GB + 256GB మోడల్ రూ. 40,999. అత్యధిక 16GB + 512GB వేరియంట్ ధర రూ.45,999గా పలుకుతోంది.


ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. Auspicious Gold, Mist Grey, Moonlit Blue. ఆగస్టు 19 నుంచి Vivo ఇండియా ఇ-స్టోర్, ప్రముఖ ఈ-కామర్స్ సైట్లు, అలాగే ఎంచుకున్న ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో విక్రయానికి వస్తుంది.

డిజైన్.. డిస్‌ప్లే అంతా లగ్జరీ లుక్..
Vivo V60 లో 6.77 అంగుళాల 1.5K AMOLED క్వాడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లే ఉంది. 1,080×2,392 పిక్సెల్స్ రిజల్యూషన్ తో పాటు, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. దీని వల్ల ఎండలోనూ స్క్రీన్ స్పష్టంగా కనపడుతుంది. కర్వ్‌డ్ ఎడ్జెస్ డిజైన్ ఫోన్‌ను ప్రీమియమ్ ఫీల్ ఇస్తుంది. మూడు కలర్ వేరియంట్లు తమతమ ప్రత్యేకత కలిగి ఉన్నాయి. Mist Grey లైట్ లుక్ ఇస్తే, Auspicious Gold లగ్జరీ టచ్ ఇస్తుంది, Moonlit Blue కాస్త ఎలిగెంట్‌గా కనిపిస్తుంది.

పెర్ఫార్మెన్స్.. Snapdragon 7 Gen 4 పవర్
Vivo V60 లోని 4nm ఆర్కిటెక్చర్ ఆధారిత Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ పనితీరు పరంగా బలంగా ఉంటుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్, హై-ఎండ్ యాప్‌ల రన్.. అన్నింటినీ సాఫీగా హ్యాండిల్ చేస్తుంది. 8GB నుంచి 16GB వరకు LPDDR4x RAM ఆప్షన్లు, 128GB నుంచి 512GB వరకు UFS 2.2 స్టోరేజ్ లభిస్తుంది. Android 15 ఆధారిత Funtouch OS 15 తో వస్తున్న ఈ ఫోన్‌కు నాలుగేళ్ల మెజర్ OS అప్‌డేట్స్, ఆరు ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ ను కంపెనీ హామీ ఇస్తోంది.

Also Read: Minimum Balance Account: బ్యాంకు మినిమమ్ బ్యాలెన్స్ కొత్త నియమాలు.. పెనాల్టీ తప్పదా?

AI ఫీచర్లు.. స్మార్ట్ యూజ్ కోసం
Vivo V60 లో AI ఆధారిత అనేక ఫీచర్లు ఉన్నాయి. AI Image Expander (ఫోటోలను విస్తరించడం), AI Smart Call Assistant, AI Captions, అలాగే AI-backed Block Spam Call Tool. ఇవి యూజర్ అనుభవాన్ని మరింత స్మార్ట్‌గా, సమయాన్ని ఆదా చేసేలా చేస్తాయి.

కెమెరా.. Zeiss టచ్ తో ప్రొఫెషనల్ లుక్
కెమెరా విషయంలో Vivo ఎప్పటిలాగే ప్రత్యేకంగా ఉంటుంది. V60 లో Zeiss భాగస్వామ్యంతో రూపొందించిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP Sony IMX766 ప్రైమరీ సెన్సార్ ఉండగా, కచ్చితమైన డీటైల్, నేచురల్ కలర్స్ లో ఫోటోలు లభిస్తాయి. 50MP Sony IMX882 టెలిఫోటో లెన్స్ మొబైల్ ఫీచర్ ఉండగా, జూమ్‌లో కూడా క్వాలిటీ తగ్గదట. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 50MP సెన్సార్ ఉంది. ఫ్రంట్, రియర్ రెండూ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తాయి. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ మోడల్ అనేస్తున్నారు.

బ్యాటరీ 6,500mAh పవర్ హౌస్
Vivo V60 లోని 6,500mAh బ్యాటరీ సాధారణ వాడుకలో 2 రోజుల పాటు సులభంగా నడుస్తుంది. 90W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ తో తక్కువ సమయంలో ఎక్కువ ఛార్జ్ అవుతుంది. ఫుల్ డే యూజ్ కోసం ఉదయం చార్జ్ చేస్తే రాత్రివరకు బ్యాటరీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఈ ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్స్ కలిగి ఉండటం వల్ల, నీరు, ధూళి నుంచి పూర్తి రక్షణ కలుగుతుంది. అంటే వర్షంలోనూ, బీచ్ వద్దనూ, సాధారణ వాటర్ స్ప్లాష్‌లలోనూ భయపడాల్సిన అవసరం లేదట.

ఇతర ఫీచర్లు
Wi-Fi, Bluetooth 5.4, GPS, NFC, USB Type-C అన్నీ అందుబాటులో ఉన్నాయి. అదనంగా ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ సౌకర్యం ఉంది.

సైజు.. బరువు
Mist Grey వేరియంట్ – 163.53×76.96×7.53mm, బరువు 192 గ్రాములుగా మోడల్ మార్కెట్ లో లభిస్తుంది. Gold మోడల్ – 200 గ్రాములు, 7.65mm, Blue మోడల్ – 201 గ్రాములు, 7.75mm. ఫోన్ చేతిలో హ్యాండిల్ చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుంది.

మొత్తం మీద Vivo V60 మిడ్‌రేంజ్‌లో ప్రీమియమ్ లుక్, పవర్‌ఫుల్ పనితీరు, అద్భుతమైన కెమెరా, భారీ బ్యాటరీతో కూడిన ప్యాకేజ్. Android 15, AI ఫీచర్లు దీన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. రూ. 36,999 ప్రారంభ ధరతో ఈ ఫోన్, మిడ్‌రేంజ్‌లో ప్రీమియమ్ అనుభవం కోరుకునే వారికి మంచి ఆప్షన్.

Related News

Smartphone market: సూపర్ షాట్ కొట్టిన స్మార్ట్ ఫోన్ ఏది? ఈ జాబితాలో మీ ఫోన్ ర్యాంక్ ఎంత?

Zoom Meeting: జూమ్ మీటింగ్‌లో టీచర్లు మాట్లాడుతుండగా… అశ్లీల వీడియోలు ప్లే చేశారు, చివరకు?

HTC Wildfire E4 Plus: రూ.10000లోపు ధరలో 50MP కెమెరా, 5000 mAh బ్యాటరీ.. HTC వైల్డ్‌ఫైర్ E4 ప్లస్ స్మార్ట్ ఫోన్ లాంచ్

Flipkart Freedom Sale: ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ మళ్లీ ప్రారంభం .. త్వరపడండి నాలుగు రోజులే

Samsung Galaxy Z Fold 6: గెలాక్సీ Z ఫోల్డ్ 6 పై రూ.52000 భారీ తగ్గింపు.. ఫోల్డెబుల్ ఫోన్ కొనాలనుకుంటే ఇదే సరైన సమయం

Big Stories

×