Final Meeting on Cine Workers Strike: తుది దశకు చేరుకున్నట్టు కనిపిస్తోంది. వేతనాల పెంపు కోసం గత తొమ్మిది రోజులు సినీ కార్మికుల సమ్మె (Cine Workers Strike) చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమస్యను తీర్చే దిశగా ఇప్పటి వరకు ఎన్నో మీటింగ్స్ అయ్యాయి. కానీ అవన్ని కూడా విఫలం అయ్యాయి. ఇటూ నిర్మాతలు, అటూ ఫెడరేషన్ సభ్యులు, యూనియన్ లీడర్లు తగ్గేదే లే అంటున్నారు. వేతనాలు పెంచాల్సిందేనని ఫిల్మ్ ఫేడరేషన్.. పెంచడం కుదరదని నిర్మాతలు మొండిగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహరంలో ఎంతో కలుగజేసుకుని సమస్య పరిష్కరించే దిశగా చర్చలు జరిగిన అవి విఫలం అయ్యాయి.
మంత్రి ఎంట్రీ..
చివరకు ఈ విషయంలో ప్రభుత్వం కలుగజేసుకునే పరిస్థితి వచ్చింది. సోమవారం సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఫెడరేషన్ సభ్యులతో పాటు ఇతర సినిమా సింఘాల ప్రతినిధులతో సమావేశమై.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై ఆయన ఫెడరేషన్కు, నిర్మాతలకు మధ్య సంధి కుదిర్చే ప్రయత్నం చేశారు. సమ్మే చేయడం కరెక్ట్ కాదని, వేతనాల పెంపు విషయంలో నిర్మాతలు కాస్తా తగ్గాలని ఇరువురికి సూచించారు. ఈ క్రమంలో ఫల్మ్ ఫెడరేషన్, నిర్మాతలు మరోసారి సమావేశానికి సిద్దమయ్యారు. ఇవాళ ఫెడరేషన్ సభ్యులు నిర్మాతల మండలికికు లేఖ రాశారు. ఈ మేరకు ఫేడరేషన్ లేఖపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందిస్తూ.. మరోసారి చర్చకు తాము సిద్ధమేనని స్పష్టం చేసింది.
కోలిక్కి వస్తున్న సమస్య
ఫెడరేషన్ పిలుపు మేరకు రేపు ఆగష్టు 13న మధ్యాహ్నం 3 గంటలకు ఫిలింనగర్లోని ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో జరిగే సమావేశానికి ఫేడరేషన్ సభ్యులు, సినిమా సంఘాల నేతలు హాజరుకావాలని ఫిల్మ్ ఛాంబర్ లేఖలో పేర్కొంది. ఈ సందర్భంగా ఫేడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మీడియాతో మాట్లాడారు. ‘వేతన పెంపు కు కోసం తొమ్మిది రోజు చిత్రీకరణ ఆపాము. రేపు మూడు గంటలకు సమావేశం ఉండనుంది. అంతిమంగా రేపు అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. చిన్న నిర్మాతల గురించి , వర్కింగ్ కండీషన్స్ పై కూడా రేపు మాట్లాడతాము. అంతా పాజిటివ్ గా అయిపోతుందని నమ్ముతున్నాం. కోమటిరెడ్డి గారు మాతో ఓ మాట అన్నారు. రేవంత్ రెడ్డి గారు హైదరాబాదు ను సినిమా హబ్ గా మార్చలానుకుంటున్నారన్నారు. ఇలాంటి టైమ్ లో సమ్మె మంచిదికాదన్నారు. చర్చల ద్వారా పరిష్కరించుకోమన్నారు‘ అని పేర్కొన్నారు.
Also Read: Upasana: ఉప్సీ ఫోన్‌లో చరణ్ పేరు ఏం ఉంటుందో తెలుసా ? ఆ 200 వెనక పెద్ద కథే ఉంది
కాగా ఏడాదికి 10 శాతంగా మూడేళ్లకు 30 శాతం వేతనాలను పెంచాలని ఫెడరేషన్ సభ్యులు నిర్మాతలను డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీ నష్టాల్లో ఉందని, వేతనాలను పెంచడం కుదరదని నిర్మాతలు తేల్చడంతో ఫెడరేషన్ రాత్రికి రాత్రే సమ్మెకు సైరన్ మోగించింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండ సడెన్ గా సమ్మెకు దిగడంపై నిర్మాతల మండల ఫెడరేషన్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. తమ డిమాండ్ల మేరకు వేతనాలను పెంచడం కుదరదని, కావాలంటే పది, పదిహేను శాతం పెంచుతామని సూచించాయి. నిర్మాతల నిర్ణయాన్ని తొసిపుచ్చిన ఫెడరేషన్ తొమ్మిది రోజులు సమ్మెను కొససాగిస్తూనే ఉన్నారు. దీనికి మీడియం, చిన్న సినిమాలు షూటింగ్ ఆగిపోయి నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.