BigTV English

Vivo T3 Lite 5G Launch: ప్రైస్ కేక.. వివో నుంచి చీపెస్ట్ డ్యూయల్ 5G స్మార్ట్‌ఫోన్..!

Vivo T3 Lite 5G Launch: ప్రైస్ కేక.. వివో నుంచి చీపెస్ట్ డ్యూయల్ 5G స్మార్ట్‌ఫోన్..!

Vivo Company’s Cheapest Dual 5G Smart Phone T3 Lite Launch on June 27th: చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 27న భారతదేశంలో లాంచ్ చేయనుంది. అయితే ఇది విడుదలవడానికి ముందే స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, కలర్ వేరియంట్స్ లీక్ అయ్యాయి. మార్చిలో Vivo T3, ఏప్రిల్‌లో Vivo T3x లాంచ్ చేసిన తర్వాత Vivo T3 లైనప్‌లో ఇది మూడవ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్‌లో సోనీ కెమెరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై పనిచేస్తుంది. ఇటీవలి ఓ నివేదిక ఫోన్ డిస్‌ప్లే, చిప్‌సెట్ గురించి వెల్లడించింది.


Vivo T3 Lite 5G లీక్ అయిన స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఈ 5G స్మార్ట్‌ఫోన్ 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. దీని బ్రైట్‌నెస్ స్థాయి గురించిన సమాచారం వెల్లడి కాలేదు, అయితే ఇది ‘హై బ్రైట్‌నెస్ డిస్‌ప్లే’ని కలిగి ఉన్నట్లు సూమాచారం. ఇతర బడ్జెట్ ఫోన్‌ల మాదిరిగానే దీని స్క్రీన్ వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌ను కలిగి ఉంటుంది.

Also Read: మరో బాహుబలి.. బడ్జెట్లో గాజు ఫోన్.. రూ.7 వేలకే దక్కించుకోవచ్చు!


ఈ స్మార్ట్‌ఫోన్ 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimension 6300 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ చిప్‌సెట్ బడ్జెట్ సెగ్మెంట్‌లోని రియల్‌మీ నార్జో ఎన్65, రియల్‌మీ సి65 5జి వంటి ఇతర స్మార్ట్‌ఫోన్‌లకు కూడా ఉన్నాయి. ఫోటోగ్రఫీ కోసం రాబోయే Vivo T3 Lite 5G వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి ఉండవచ్చు. ఇందులో 50-మెగాపిక్సెల్ Sony IMX852 AI కెమెరాతో పాటుగా పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీ కోసం 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం, ఫోన్ 8-మెగాపిక్సెల్ HD కెమెరాను చూడొచ్చు.

సేఫ్టీ కోసం ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. డస్ట్, వాటర్ నుంచి ప్రొటక్షన్ కోసం ఫోన్ IP54 రేటింగ్‌తో వస్తుంది. ఫోన్ మందం 8.39 మిమీ, దాని బరువు 185 గ్రాములు కావచ్చు. Vivo ఈ స్మార్ట్‌ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది Android 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా FunTouch OS 14లో రన్ అవుతుంది.

Also Read: ఫ్లిప్‌కార్ట్ కళ్లుచెదిరే ఆఫర్.. రూ. 289కే స్మార్ట్‌ఫోన్!

Vivo T3 Lite 5G ధర గురించి చెప్పాలంటే భారతదేశంలో దీని ధర గురించి ఎటువంటి సమాచారం కంపెనీ వెల్లడించలేదు. ఇది భారతదేశంలో అత్యంత చీపెస్ట్ డ్యూయల్ 5G స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ పేర్కొంది. ఒక నివేదిక ప్రకారం ఫోన్ ధర దేశంలో రూ. 12,000 కంటే తక్కువగా ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ మెజెస్టిక్ బ్లాక్, వైబ్రంట్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో లాంచ్ అవుతుంది. మూడు సంవత్సరాల వరకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లు, భద్రతా ప్యాచ్‌లను కంపెనీ అందిస్తోంది.

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×