దేశీ మార్కెట్లో ఇయర్ బడ్స్ కు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా రూ. 1000 లోపు ఇయర్ బడ్స్ కు మార్కెట్ లో గట్టి పోటీ ఉంది. boAt, Boult, pTron, Noise, Realme లాంటి సంస్థలు తక్కువ ధరలోనే అద్భుతమైన ఇయర్ బడ్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. మంచి బ్యాటరీ లైఫ్, బ్లూటూత్ 5.0+ కనెక్టివిటీ, IPX4 వాటర్ రెసిస్టెన్స్, ENC మైకుల లాంటి ఫీచర్లతో ఈ ఇయర్ బడ్స్ అందుబాటులోకి ఉన్నాయి. తాజా రివ్యూలు, యూజర్ రేటింగ్స్, స్పెసిఫికేషన్ల ఆధారంగా రూ. 1000 లోపు టాప్ 5 ఇయర్ బడ్స్ ఏంటనేవి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ప్రస్తుతం మార్కెట్ లో రూ. 1000 లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ ఇయర్ బడ్స్ Boult Audio Z60. దీని ధర రూ. 799. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 30 గంటల పాటు పని చేస్తుంది. 10mm డ్రైవర్స్, డీప్ బేస్, బ్లూటూత్ 5.3, IPX5 వాటర్ ప్రూఫ్, ENC మైక్, లో లేటెన్సీ గేమింగ్ మోడ్ ను కలిగి ఉంటుంది. 4.2/5 రేటింగ్ కలిగి ఉంది.
తక్కువ ధర కలిగిన బెస్ట్ ఇయర్ బడ్స్ లో pTron Bassbuds Duo ఒకటి. కేవలం రూ. 699కే అందుబాటులో ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 20 గంటలు పని చేస్తుంది. 13mm డ్రైవర్స్, పాసివ్ నాయిజ్ క్యాన్సలేషన్, Bluetooth 5.0, టచ్ కంట్రోల్స్, IPX4 ను కలిగి ఉంటుంది. 4.1/5 రేటింగ్ కలిగి ఉంది.
రూ.1000లోపు బెస్ట్ ఇయర్ బడ్స్ లో ఇది కూడా ఒకటి. ధర రూ. 899 ఉంటుంది. ఒక ఛార్జ్ తో 42 గంటలు పని చేస్తుంది. 8mm డ్రైవర్‌లు, ENx టెక్ (నాయిజ్ క్యాన్సలేషన్), Bluetooth 5.1, IPX4, లో లేటెన్సీని కలిగి ఉంటుంది. 4.0/5 రేటింగ్ కలిగి ఉంటుంది.
ఈ ఇయర్ బర్డ్స్ రూ. 799లో లభిస్తాయి. 13mm డ్రైవర్స్, బేస్ బూస్ట్, Bluetooth 5.2, IPX5, ఫాస్ట్ చార్జింగ్ సదుపాయాన్ని కలిగి ఉన్నాయి. ఒక్క ఛార్జ్ తో 40 గంటలు పని చేస్తుంది. 4.1/5 రేటింగ్ కలిగి ఉంది.
ఈ ఇయర్ బర్డ్స్ ఒక్క ఛార్జ్ తో 40 గంటలు పని చేస్తుంది. 12.4mm టైటానియం డ్రైవర్స్, 30dB ANC, Bluetooth 5.3, IP55, 50ms లో లేటెన్సీని కలిగి ఉంటుంది. 4.3/5 రేటింగ్ కలిగి ఉంటుంది.
⦿ సౌండ్ క్వాలిటీ: బేస్ హెవీ ట్యూనింగ్, క్లియర్ వోకల్స్ ను కలిగి ఉంటుంది.
⦿ బ్యాటరీ & చార్జింగ్: చాలా మోడల్స్ లో 30+ గంటల ప్లేబ్యాక్, ఫాస్ట్ చార్జ్ అవకాశం ఉంది.
⦿ ఎక్స్ ట్రా ఫీచర్లు: గేమింగ్ కోసం లో లేటెన్సీ (40-50ms), స్వెట్ ప్రూఫ్ డిజైన్ ఉంది.
Read Also: 7,000mAh బ్యాటరీ, 200 మెగాపిక్సెల్ కెమెరా, కళ్లు చెదిరే రియల్ మీ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది!