BigTV English

Samsung Galaxy S24 5G Price Drop: తగ్గిందోచ్.. శాంసంగ్ ప్రీమియం ఫోన్‌పై రూ.19 వేల భారీ డిస్కౌంట్.. కూపన్ డిస్కౌంట్లు కూడా..!

Samsung Galaxy S24 5G Price Drop: తగ్గిందోచ్.. శాంసంగ్ ప్రీమియం ఫోన్‌పై రూ.19 వేల భారీ డిస్కౌంట్.. కూపన్ డిస్కౌంట్లు కూడా..!

Samsung Galaxy S24 5G: ప్రముఖ దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ దేశీయ మార్కెట్‌లో సత్తా చాటుతోంది. కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేసి అదరగొడుతోంది. ఈ కంపెనీ నుంచి Samsung Galaxy S24 5G స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌లో విడుదల అయింది. కంపెనీ దీనిని అధిక ధరతో రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు దీనిని భారీ డిస్కౌంట్‌తో తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని తగ్గింపులను అందించింది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.


Samsung Galaxy S24 5G స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో రిలీజ్ అయింది. అందులో 8GB + 128GB వేరియంట్ రూ.74,999కి లాంచ్ అయింది. అలాగే 8GB + 256GB వేరియంట్ రూ.79,999లకి వచ్చింది. టాప్ వేరియంట్ 8GB + 512GB రూ.89,999 ధరతో లాంచ్ అయింది. అయితే ఇప్పుడు ఈ మూడు వేరియంట్లపై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తుంది.

128GB వేరియంట్‌పై 26 శాతం అంటే రూ.19,149 భారీ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఇది రూ.55,850లకే పొందొచ్చు. అలాగే 256GB వేరియంట్ పై రూ.12,000 భారీ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఇది రూ.67,999కే లిస్ట్ అయింది. అంతేకాకుండా దీనిపై ఊహించని కూపన్ డిస్కౌంట్ కూడా ఉంది. ఏకంగా రూ.5000 భారీ కూపన్ తగ్గింపు పొందొచ్చు. అప్పుడు మరింత తక్కువకే లభిస్తుంది. 512GB వేరియంట్ పై కూడా రూ.12,000 తగ్గిపు ఉంది. ఈ తగ్గింపుతో దీనిని రూ.77,999కి కొనుక్కోవచ్చు. దీనిపై కూడా కూపన్ డిస్కౌంట్ ఉంది. దాదాపు రూ.5,000 కూపన్ డిస్కౌంట్ పొందొచ్చు. అప్పుడు మరింత తక్కువకే దీన్ని సొంతం చేసుకోవచ్చు.


Also Read:  మరొ కొత్త కలర్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా వేరియంట్.. అద్దిరిపోయిందంతే..!

Specifications

Samsung Galaxy S24 6.2-అంగుళాల పూర్తి HD+ డైనమిక్ AMOLED 2X స్క్రీన్‌తో వస్తుంది. ఇది 120 Hz వరకు రిఫ్రెష్ రేట్, విజన్ బూస్టర్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఇది Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌గా కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో Exynos 2400 SoCతో ప్రారంభించబడింది. Galaxy S24లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 10-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 25 W వైర్డ్ ఛార్జింగ్, 15 W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,000 mAh బ్యాటరీతో వస్తుంది.

Related News

Budget iPhone: దసరా పండగ ఆఫర్‌లో టాప్ 5 బడ్జెట్ ఫోన్లు.. రూ.10 వేల లోపే!

SmartPhone Comparison: ఒప్పో F31 ప్రో ప్లస్ vs నథింగ్ ఫోన్ 3ఏ ప్రో.. ఏది కొనుగోలు చేయాలి?

Galaxy S24 FE: గెలాక్సీ S24 FE పై ఏకంగా రూ.30,000 డిస్కౌంట్.. ఇప్పుడే కొనుగోలు చేయాలా?

Realme P3 5G Launched: రియల్‌ మీ పి3 5జి.. ఫోటోలు, గేమ్స్, బ్యాటరీ అన్నీ సూపర్!

iOS 26 Downgrade: కొత్త iOS 26‌తో ఐఫోన్లలో తీవ్ర సమస్యలు.. పాత iOSకు ఇలా డౌన్‌గ్రేడ్ చేయండి

Google Storage: మీ గూగుల్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా? ఇలా చేస్తే క్షణాల్లో సగం ఖాళీ అవుతుంది!

Flipkart vs Amazon iPhone: ఫ్లిప్‌కార్ట్ vs అమెజాన్ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ ఆఫర్లలో ఏది బెస్ట్?

Jio Keypad 5G: స్మార్ట్‌ఫోన్‌లకు షాక్.. జియో కీప్యాడ్ 5జి కొత్త రికార్డు

Big Stories

×