E-Paper
Advertisement

ఇల్లు ఊడ్చే ఓపిక లేదా ? మీ పని క్షణాల్లోనే.. చేసే రోబోటిక్ క్లీనర్స్

ఇల్లు ఊడ్చే ఓపిక లేదా ? మీ పని క్షణాల్లోనే.. చేసే రోబోటిక్ క్లీనర్స్
Advertisement

Smart Robotic Vacuum Cleaners: ఈ రోజుల్లో మెట్రో సిటీస్ లేదా రోడ్ పక్కన ఉండే ఇళ్లలో పెద్ద సమస్య ఏంటంటే.. ఎంత క్లీన్ చేసినా త్వరగా మళ్లీ దుమ్ము వచ్చేస్తుంది. రోజుకు నాలుగైదు సార్లు ఇల్లు ఊడవడం, తుడవడం ఎవరికైనా విసుగు తెప్పిస్తుంది. రోజంతా.. ఆఫీస్ పనులు, ఇంటి పనులతో.. బిజీగా ఉండే వారికి ఇదొక పెద్ద తలనొప్పి. మరి దీనికి సొల్యూషన్ లేదా? అంటే.. ఖచ్చితంగా ఉంది. అదే ‘స్మార్ట్ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్’. మీరు ఆఫీసులో ఉన్నా.. నిద్ర పోతున్నా మీ ఇల్లు అద్దంలా మెరిసి పోయేలా చేసే.. 5 బెస్ట్ రోబోటిక్ క్లీనర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గంటగంటకూ దుమ్ము పట్టే.. ఇళ్లకు సూపర్ స్మార్ట్ రోబోటిక్ క్లీనర్స్:

Advertisement

దేశంలో ఇళ్ల డిజైన్, వాతావరణం బట్టి దుమ్ము.. చాలా త్వరగా చేరుతుంది. అందుకే.. కేవలం వాక్యూమ్ చేయడమే కాకుండా, మాప్ కూడా చేయగల స్మార్ట్ రోబోలు మనకు అవసరం. మార్కెట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న ఆ 5 రోబోటిక్ క్లీనర్స్ ఇవే..

1. Xiaomi Robot Vacuum-Mop:
బడ్జెట్‌లో బెస్ట్ ఆప్షన్ కావాలనుకునే.. వారికి షియోమి మొదటి ఛాయిస్. ఇది పవర్‌ఫుల్ సక్షన్ సామర్థ్యంతో వస్తుంది. అంటే నేలపై ఉండే.. సన్నటి దుమ్ము కణాలను కూడా ఇది ఈజీగా లాగేస్తుంది. ఇందులో ‘2-ఇన్-1’ స్వీపింగ్ అండ్ మోపింగ్ ఫీచర్ ఉంది. దీని LDS నావిగేషన్ సిస్టమ్ వల్ల ఇల్లంతా పర్ఫెక్ట్‌గా మ్యాపింగ్ చేసుకుని, ఏ మూల వదలకుండా క్లీన్ చేస్తుంది.

Advertisement

2. ECOVACS Deebot (ఎకోవాక్స్ డీబోట్ సిరీస్):
ఎక్కువ దుమ్ము వచ్చే ఇళ్లకు ఎకోవాక్స్ డీబోట్ చాలా పవర్‌ఫుల్ సొల్యూషన్. ఇందులో.. ఉండే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కార్పెట్లపై ఉండే దుమ్మును, సోఫాల కింద ఉండే మురికిని కూడా చాలా ఈజీగా క్లీన్ చేస్తుంది. దీని ప్రత్యేకత.. ఏంటంటే.. దీనికి ‘ఆటో-ఎంప్టీ స్టేషన్’ ఉంటుంది. అంటే.. రోబో క్లీన్ చేశాక, అందులోని దుమ్మునంతటినీ బేస్ స్టేషన్‌లోని బ్యాగ్‌లోకి అదే ట్రాన్స్‌ఫర్ చేసుకుంటుంది. మీరు నెల రోజుల వరకు క్లీన్ చేయాల్సిన అవసరమే ఉండదు.

3. iRobot Roomba (ఐరోబోట్ రూంబా):
రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్లలో ‘ఐరోబోట్’ ఒక లెజెండ్ అని చెప్పొచ్చు. ఒక వేళ మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే.. వాటి వెంట్రుకలు, సన్నటి ధూళిని క్లీన్ చేయడానికి రూంబా సిరీస్ అద్భుతంగా పని చేస్తుంది. దీని ‘డ్యూయల్ మల్టీ-సర్ఫేస్ రబ్బర్ బ్రషెస్’ వెంట్రుకలు చిక్కు పడకుండా చూస్తాయి. ఇంట్లో.. ఎక్కువ దుమ్ము ఉండే ఏరియాలను ఇది స్వయంగా గుర్తించి , అక్కడ ఎక్కువ సేపు క్లీన్ చేస్తుంది.

4. RoboRock (రోబోరాక్ సిరీస్):
ప్రీమియం లుక్, హై-ఎండ్ ఫీచర్లు కోరుకునే వారికి రోబోరాక్ బెస్ట్ ఆప్షన్. దీని మోపింగ్.. టెక్నాలజీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నేలపై ఉండే జిడ్డు మరకలను కూడా ఇది గట్టిగా ప్రెస్ చేస్తూ తుడుస్తుంది. దీని వల్ల చేత్తో తుడిచినట్లే.. నీట్‌గా అవుతుంది. అడ్వాన్స్‌డ్ అబ్స్టాకల్ అవాన్డెన్స్ ఉండటం వల్ల ఇంట్లో.. ఉండే వైర్లు, చెప్పులను గుర్తించి వాటి పక్క నుంచి తప్పుకుంటూ వెళ్తుంది.

5. Eureka Forbes Robo L10S:
ఇండియన్ ఇళ్లకు అనుగుణంగా యూరేకా ఫోర్బ్స్ ఈ మోడల్‌ను తెచ్చింది. దీని ధర కూడా అందుబాటులోనే ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా దీనికి టైమర్ సెట్ చేయవచ్చు. ఉదాహరణకు.. మీ ఇంట్లో ప్రతి 3 గంటలకు దుమ్ము వస్తుంది అనుకుంటే.. రోజుకు 3 లేదా 4 సార్లు ఆటోమేటిక్‌గా క్లీన్ చేసేలా షెడ్యూల్ సెట్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో లేకపోయినా ఇది తన పని తాను చేసుకు పోతుంది.

Also Read: వ్యాపారమైనా, ఇల్లయినా నో టెన్షన్.. తక్కువ కరెంట్‌తో ఎక్కువ కూలింగ్ ఇచ్చే డీప్ ఫ్రీజర్స్

స్మార్ట్ రోబోల వల్ల లాభాలేంటి?
యాప్ కంట్రోల్: ఆఫీస్ లేదా బయట ఎక్కడో.. ఉండి కూడా ఫోన్ యాప్ ద్వారా ఫ్రిజ్ కింద లేదా హాల్‌లో క్లీన్ చేయమని కమాండ్ ఇవ్వొచ్చు.

వాయిస్ అసిస్టెంట్: అలెక్సా లేదా గూగుల్ అసిస్టెంట్‌తో “కనెక్ట్” చేసి, కేవలం నోటి మాటతో క్లీనింగ్ స్టార్ట్ చేయించవచ్చు.

నో-గో జోన్స్: పూజా గది లేదా పిల్లలు ఆడుకునే చోటికి రోబో వెళ్లకుండా యాప్‌లో వర్చువల్ గోడలు క్రియేట్ చేయవచ్చు.

ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్‌లో స్మార్ట్ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ అనేది లగ్జరీ కాదు. ఒక అవసరం. గంటగంటకూ వచ్చే దుమ్ముతో.. విసిగిపోయిన వారికి ఇవి బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. మీ బడ్జెట్ , ఇంటి సైజ్ బట్టి పైన పేర్కొన్న వాటిలో ఒకదాన్ని ఎంచుకుంటే.. ఇల్లు ఎప్పుడూ నీట్‌గా, హెల్తీగా ఉంటుంది.

Related News

హాట్‌స్టార్ బంపరాఫర్.. రూపాయికే ప్రీమియం సబ్ స్క్రిప్షన్.. ఓటీటీ లవర్స్‌కి పండగే!

వచ్చేస్తోంది iPhone 18 Pro సిరీస్.. లాంచ్ డేట్ ఫిక్స్ అయింది కానీ, ఈ ఫోన్ రేటును తట్టుకోవడమే కష్టమే!

ఐఫోన్ 17, శాంసంగ్ S25పై భారీ ఆఫర్లు.. ఆ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ షురూ!

యాపిల్ లవర్స్‌కి బంపర్ ఆఫర్.. Amazon Freedom Saleలో ఐఫోన్ ధరలు ఎంత తగ్గాయో తెలుసా?

జేబులో పట్టేంత చిన్నగా.. బ్యాటరీ నింపేంత పవర్‌ఫుల్‌గా !

ప్రీమియమ్ లుక్, బడ్జెట్ ప్రైస్! ఫ్యాషనబుల్ ఫైర్-బోల్ట్ స్మార్ట్‌వాచ్‌లపై సూపర్ డీల్స్

బిజినెస్‌కైనా, ఇంటికైనా పర్ఫెక్ట్! టాప్ డీప్ ఫ్రీజర్ల లిస్ట్ మీ కోసం

టాప్ లోడ్‌కి గుడ్‌బై.. ఫ్రంట్ లోడ్‌కి వెల్‌కమ్! మీ మొదటి అప్‌గ్రేడ్‌కి బెస్ట్ ఆప్షన్స్

Big Stories

Advertisement
×