E-Paper
Advertisement

సోలార్ స్మార్ట్ గొడుగు.. ఎండ నుంచి రక్షణే కాదు.. ఫోన్‌కి ఛార్జింగ్ కూడా..!

సోలార్ స్మార్ట్ గొడుగు.. ఎండ నుంచి రక్షణే కాదు.. ఫోన్‌కి ఛార్జింగ్ కూడా..!
Advertisement

Solar Umbrella: విద్యార్థుల ప్రతిభకు, సృజనాత్మకతకు అద్దం పట్టేలా ఒక అద్భుతమైన ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. ఎండ తీవ్రత నుంచి రక్షణనిచ్చే గొడుగును మొబైల్ ఛార్జింగ్ డివైజ్‌గా మార్చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఒక విద్యార్థి. సాంకేతికతను సామాన్యుడికి ఉపయోగపడేలా మలిచిన ఈ ‘సోలార్ పవర్డ్ అంబ్రెల్లా’ (సౌరశక్తి గొడుగు) ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వినూత్న ఆవిష్కరణకు సంబంధించి పూర్తి వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

వివరాల్లోకి వెళ్తే..

మెక్సికోకు చెందిన విక్టోరియా గార్సియా మోరెనో.. సౌరశక్తితో నడిచే ఈ స్మార్ట్ గొడుగును ఆవిష్కరించాడు. యూనివర్శిడాడ్ కాసా బ్లాంకాలో చదువుతున్న అతడు.. ఒక సాధారణ గొడుగును అసాధారణంగా మార్చాడు. ఇందులో భాగంగా తొలుత గొడుగు పైభాగంలో తేలికపాటి ఫ్లెక్సిబుల్ సోలార్ ప్యానెల్స్‌ను అమర్చారు. ఈ గొడుగు ఎండ తగలకుండా వ్యక్తిని కాపాడుతూనే.. సూర్యరశ్మిని సోలార్ ప్యానెల్స్ ద్వారా గ్రహిస్తుంది. అనంతరం దానిని గొడుగు హ్యాండిల్ వద్ద అమర్చిన ఒక చిన్నపాటి పవర్ బ్యాంక్ తరహా బ్యాటరీలో భద్ర పరుస్తుంది.

మెుబైల్ ఛార్జింగ్..

Advertisement

ఈ గొడుగును మెుబైల్ కు ఛార్జింగ్ పెట్టుకునేందుకు వీలుగా మెక్సికో విద్యార్థి తీర్చిదిద్దాడు. బ్యాటరీ అమర్చిన గొడుగు హ్యాండిల్ వద్ద USB ఛార్జింగ్ పోర్ట్‌ ను విద్యార్థి ఏర్పాటు చేశాడు. సూర్యరశ్మి ద్వారా సేకరించిన సోలార్ పవర్ ను.. USB పోర్ట్ సాయంతో మెుబైల్ కు ఛార్జింగ్ పెట్టేందుకు వీలుగా విద్యార్థి తీర్చిదిద్దారు. తద్వారా ఎక్కడికి వెళ్లినా మెుబైల్ ఛార్జింగ్ సమస్య ఉండదని పేర్కొన్నారు. జేమ్స్ డైసన్ అవార్డ్ ఆడిషన్స్ కోసం సదరు విద్యార్థి ఈ గొడుగును రూపొందించడం విశేషం. ప్రస్తుతం ఇది ప్రయోగదశలోనే ఉందని.. సరైన ప్రోత్సాహం లభిస్తే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొస్తానని మెక్సికో విద్యార్థి ధీమా వ్యక్తం చేశారు.

గొడుగుతో ఎన్ని లాభాలో?

ఈ సోలార్ గొడుగు అందుబాటులోకి వస్తే అనేక ప్రయోజనాలు సామాన్యులకు కలుగనున్నాయి. ఎక్కువగా ప్రయాణాలు చేసే వారికి ముఖ్యంగా పవర్‌బ్యాంక్ మర్చిపోయే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ఎండలో రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునే వారికి మొబైల్ ఛార్జింగ్‌తో పాటు చిన్న ఎల్‌ఈడీ (LED) లైట్ లేదా చిన్న ఫ్యాన్ కనెక్ట్ చేసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఇది పూర్తిగా సౌరశక్తి (గ్రీన్ ఎనర్జీ)తో పనిచేయడం వల్ల పర్యావరణానికి కూడా మేలు చేస్తుందని చెప్పవచ్చు.

Advertisement

Also Read: Tirupati Sabha: ఈ కూటమికి తిరుగుండదు, తిరుపతి కూటమి సభ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

విద్యార్థిపై ప్రశంసల జల్లు

విద్యార్థి చేసిన ఈ వినూత్న ప్రయోగంపై సోషల్ మీడియా వైరల్ లో కావడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. తక్కువ ఖర్చుతో నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యకు పరిష్కారం చూపిస్తూ చేసిన ఈ ఆవిష్కరణపై నెటిజన్లు సైతం అభినందనలు తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి చేసి మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తే సామాన్యుల పెద్ద ఎత్తున మేలు చేసినవాళ్లు అవుతారని అంటున్నారు. మెుత్తం మీద ‘మనిషి అవసరమే ఆవిష్కరణలకు మూలం’ అనే మాటను ఈ విద్యార్థి నిజం చేసి చూపించడం విశేషం.

Also Read: రీఛార్జ్ ధరలు పెరగట్లేదా? బయటి ప్రచారం ఉత్తిత్తిదేనా.. ఫుల్లు క్లారిటీ వచ్చిందోచ్!

Related News

వివో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. రూ.13,000 ఆదా చేసుకునే ఛాన్స్, ఆఫర్ లిమిటెడ్!

తక్కువ ధరలో అదుర్స్ అనిపించే వాచ్ కావాలా? ఈ స్మార్ట్‌వాచ్ మిస్ కావద్దు!

80ల్లో ఫోన్ కాల్.. త్వరగా మాట్లాడకపోతే జేబు ఖాళీ, ఇంట్లో ల్యాండ్‌లైన్ ఉంటే.. అదో స్టేటస్

రూ.30వేలలోపు బెస్ట్..కూకా Y74 ప్లస్ 55 ఇంచుల టీవీ రివ్యూ!

తక్కువ ధరలో బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్.. రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ ఇంట్లోనే

అంతరిక్షం అడుగుపెట్టి.. సొంత శాటిలైట్లతో సత్తా చాటి.. 80ల్లో ISRO అంటే ఫ్లవర్ కాదు ఫైర్!

ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక Passkeysను ఇలా ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు!

తక్కువ ధరలో మైండ్ బ్లోయింగ్ క్వాలిటీ..కొంటే ఇలాంటి టీవీ కొనాలి !

Big Stories

Advertisement
×