భారతీయ రైల్వేలోకి సెమీ హైస్పీడ్ రైలుగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ అందుబాటులోకి వచ్చింది. 160 కిలో మీటర్ల వేగంగా దేశంలోని నగరాల మధ్య వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తోంది. మొదటి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఫిబ్రవరి 15, 2019న ప్రారంభమైంది. న్యూఢిల్లీ-కాన్పూర్-అలహాబాద్-వారణాసి మార్గంలో నడిచే ఈ రైలుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఇది దేశంలోనే తొలి సెమీ-హై-స్పీడ్ రైలు. వందేభారత్ రైలు మరింత సౌకర్యవంతమైన, ప్రీమియం ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. ప్రస్తుతం, దేశ వ్యాప్తంగా 150 కి పైగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లుసేవలు నడుస్తున్నాయి.
దేశంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే వందే భారత్ ఎక్స్ ప్రెస్ మహారాష్ట్రలో నడుస్తుంది. ఇది అజ్ని-పూణేను కనెక్ట్ చేస్తుంది. ఇతర పొడవైన వందే భారత్ మార్గాలలో వారణాసి–న్యూఢిల్లీ, చెన్నై ఎగ్మోర్–నాగర్ కోయిల్, విశాఖపట్నం–సికింద్రాబాద్, రాణి కమలపతి–హజ్రత్ నిజాముద్దీన్, అజ్మీర్–చండీగఢ్, సికింద్రాబాద్–తిరుపతి, హజ్రత్ నిజాముద్దీన్–ఖజురహో, న్యూఢిల్లీ–శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, మరియు చెన్నై ఎగ్మోర్–తిరునెల్వేలి ఉన్నాయి.
ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అజ్ని-పూణే-అజ్ని(26102/26101)మధ్య రాకపోకలు కొనసాగిస్తుంది. మొత్తం 881 కిలో మీటర్ల మేర ప్రయాణిస్తుంది. ఈ రైలు వార్ధా, బద్నేరా, అకోలా, భుసావల్, జల్గావ్, మన్మాడ్, కోపర్ గావ్, అహ్మద్ నగర్, DDCCలో ఆగుతుంది.
వారణాసి-న్యూ ఢిల్లీ-వారణాసి వందేభారత్ (22435/22436) ఎక్స్ ప్రెస్ రైలు 759 కిలో మీటర్ల మేర ప్రయాణిస్తుంది. ఈ రైలు వారణాసి, ప్రయాగ్ రాజ్, కాన్పూర్, న్యూఢిల్లీలో ఆగుతుంది.
చెన్నై ఎగ్మోర్-నాగర్‌కోయిల్-చెన్నై ఎగ్మోర్ వందేభారత్ (20627/20628) ఎక్స్ ప్రెస్ రైలు 726 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. చెన్నై ఎగ్మోర్, తాంబరం, విల్లుపురం, తిరుచ్చి, మద్రాయ్, నాగర్ కోయిల్ లో ఆగుతుంది.
విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ (20833/20834) ఎక్స్ ప్రెస్ విశాఖపట్నం, సికింద్రాబాద్ మధ్య రాకపోకలు కొనసాగిస్తుంది. మొత్తం 703 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. ఈ రైలు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్ లో ఆగుతుంది.
రాణి కమలాపతి-హజ్రత్ నిజాముద్దీన్- రాణి కమలాపతి వందేభారత్(20171/20172) రైలు 699 కి.మీ ప్రయాణిస్తుంది. ఈ రైలు రాణి కమలాపతి, విరంగన లక్ష్మీబాయి ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా కాంట్, నిజాముద్దీన్ స్టేషన్లలో ఆగుతుంది.
అజ్మీర్-చండీగఢ్-అజ్మీర్ వందేభారత్(20977/20978) రైలు 675 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. ఈ రైలు అజ్మీర్, జైపూర్, అల్వార్, గుర్గావ్, ఢిల్లీ కాంట్ లో ఆగుతుంది.
ఇక సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ (20701/20702) మొత్తంగా 661 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. ఈ రైలు మార్గం మధ్యలో తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, నల్లగొండ, సికింద్రాబాద్ లో ఆగుతుంది.
హజ్రత్ నిజాముద్దీన్-ఖజురహో-హజ్రత్ నిజాముద్దీన్ వందేభారత్( 22470/22469 658) 658 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. మార్గం మధ్యలో హజ్రత్ నిజాముద్దీన్, పల్వాల్, గ్వాలియర్, VGL ఝాన్సీ, తికమ్ గఢ్, ఖజురహోలో ఆగుతుంది.
న్యూఢిల్లీ-శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా-న్యూ ఢిల్లీ వందేభారత్(22439/22440) రైలు 655 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. ఈ రైలు న్యూఢిల్లీ, అంబాలా, లూథియానా, జమ్ము తావి, కత్రాలో నడుస్తుంది.
న్యూ ఢిల్లీ-శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా-న్యూ ఢిల్లీ వందేభారత్ రైలు(22477/22478) 655 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. ఈ రైలు న్యూఢిల్లీ, అంబాలా, లూథియానా, జమ్ము తావి, కత్రాలో ఆగుతుంది.
Read Also: దీపావళి కోసం స్పెషల్ వందేభారత రైళ్లు, ఏ రూట్లో నడుస్తాయంటే?