BigTV English

Whats App Caste Certificates : ఇకపై వాట్సాప్ లో Caste, income సర్టిఫికేట్లు

Whats App Caste Certificates : ఇకపై వాట్సాప్ లో Caste, income సర్టిఫికేట్లు

Whats App Caste Certificates : ఏపీ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. విద్యార్థులు, నిరుద్యోగులతో పాటు సామాన్యులకు సైతం గుడ్ న్యూస్ చెప్పేసింది. ప్రముఖ టెక్‌ దిగ్గజం Meta తో కీలక ఒప్పందం (MoU) కుదుర్చుకున్నామని .. ఇకపై Caste, income సర్టిఫికేట్లతో పాటు నీటి పన్ను, ఇంటి పన్ను తరహా పలు సర్టిఫికేషన్‌లు వాట్సాప్ లో పొందే అవకాశం ఉందని తెలిపింది.


ఇకపై ఏపీ ప్రజలు Caste, income సర్టిఫికేట్లతో పాటు అనేక రకాల సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టు తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే తేలికగా కావల్సిన సర్టిఫికేట్లు పొందొచ్చు. ఎలా అంటే.. తాజాగా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ మెటా అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో భుత్వ సేవలు అన్నీ వాట్సాప్‌ బిజినెస్‌ ద్వారా అందించేందుకు మెటాతో చర్చలు జరిపారు. త్వరలోనే (AP Govt MoU with Meta) అందుబాటులోకి రానుందన్నారు. మెటా సైతం ఈ విషయం ముందుకు వచ్చినట్లు.. ఇకపై సేవలన్నీ వాట్సాప్ లో పొందవచ్చని ఎక్స్ వేదికగా తెలిపారు.

వాట్సాప్ తో సర్టిఫికేట్‌లు –


ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో వాట్సాప్‌ ద్వారా సర్టిఫికేట్‌లను అందిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని.. సర్టిఫికేట్‌లు తేలికగా పొందగలిగే డిజిటల్‌ వ్యవస్థ త్వరలో అందుబాటులోకి వస్తుందని… ఇక సర్టిఫికేట్లు అందించేందుకు వాట్సాప్ అప్లికేషన్‌ ప్రొగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఉంటుందని మెటా సైతం తెలిపింది.

ఎప్పటినుంచి –

ఇక ఈ సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయన్న విషయంపై పూర్తి క్లారిటీ రావల్సి ఉంది. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం, మెటా సంస్థలు ఇంకా వెల్లడించలేదు. త్వరలో వాట్సాప్‌ ద్వారా అన్ని రకాల సర్టిఫికేట్‌లు, ఇతర సేవలు పొందే అవకాశం ఉందని మాత్రం తెలుస్తుంది. దీనిపై త్వరలోనే కీలక ప్రకటన విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది.

ALSO READ :  బెంగుళూరు టెకీ వినూత్న ఆలోచన.. రోడ్లపై గుంతలకో యాప్

లోకేష్ ట్వీట్ –

విద్యార్ధులకు, నిరుద్యోగులకు ఇచ్చిన మాటను ఏపీ ప్రభుత్వం నిలబెట్టుకున్నట్లు తెలుస్తుంది. నేరుగా స్మార్ట్‌ఫోన్‌ ద్వారానే సర్టిఫికేట్‌లు అందించేందుకు మెటా ముందుకు వచ్చిందని తెలిపారు. రాబోయే కాలంలో మరింత సులభంగా, పారదర్శకంగా ఆన్‌లైన్‌ ద్వారా మరిన్ని సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని లోకేష్ తెలిపారు.

 

మెటా ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ –

ఏపీ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తామని… మెటా డిజిటల్‌ టెక్నాలజీని వినియోగించుకొని వాట్సాప్‌ ద్వారా మెరుగైన సేవలు అందిస్తామని మెటా ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ సంధ్యా దేవనాథన్‌ తెలిపారు. AI ఆధారంగా సేవలు కొనసాగుతాయని.. ఏపీ ప్రభుత్వంతో ఈ ఒప్పందం కుదుర్చుకోవడం  చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం –

ఇక మెటా సంస్థతో గత నెలలో తెలంగాణ ప్రభుత్వం సైతం ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ శాఖ మెటాతో చేసుకున్న ఈ ఒప్పందంలో భాగంగా Meta తెలంగాణ ప్రభుత్వ ఇ-గవర్నెన్స్‌ పోర్టల్స్ తో పాటు పలు ప్రభుత్వ రంగాలకు చెందిన సేవలను సైతం అందిస్తుంది.

Related News

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×