Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అలాగే ఇప్పుడు హైదరాబాద్‌లో మళ్లీ వర్షం స్టార్ అయ్యింది. ఈ రోజు ఉదయం నుంచి వాతావరణం కాస్త ప్రశాంతంగా ఉండి ఒక్కసారిగా కుంభవృష్ఠి సృష్టించింది. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరిగ్గా భోజనం సమయంలో చాలా మంది బయటకు వెళ్లే సమయంలో వర్షం పడటం వల్ల ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం..
ఉన్నట్టుండి హైదరాబాద్ లో భారీ వర్షం స్టార్ట్ అయ్యింది. మదాపూర్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, కూకట్ పల్లి, యూసఫ్ గూడ, మలక్ పేట్, సరూర్‌నగర్, మీర్‌పేట్, చంద్రాయణగుట్ట, గచ్చబౌలి సీటీ అవుట్ కట్స్ ప్రాంతాల్లో వర్షం కురిసినట్టు సమాచారం.. రాత్రి వేళల్లో మరిన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వారు తెలిపారు. దీంతో ఆఫీసులకు వెళ్లిన వారు, ఇతర కారణాల వల్ల బయటకు వెళ్లిన వారు తొందరగా ఇళ్లలోకి చేరుకోవాలని. లేదంటే ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోతారు అని చెబుతున్నారు.
Also Read: ఏపీ కల్తీ మద్యం స్కామ్.. వెనుకుంది వాళ్లేనా..
మరో నాలుగు రోజులు భారీ వర్షాలు..
అయితే తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నేడు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, మంచిర్యాల, ఖమ్మం, కామారెడ్డి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే ఏపీలో శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి,చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో కూడా వర్షం కురుస్తుందని తెలిపారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు.