Rohit Sharma Captaincy: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. వన్డే కెప్టెన్సీ నుంచి అతన్ని తప్పించడంతో, టీమిండియా అభిమానులు చాలా బాధపడుతున్నారు. అతడు జట్టులో లేకపోతే అసలు మ్యాచ్ చూడాలని అనిపించదని పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. ఇందులో చాలా దీనంగా, డిప్రెషన్ లోకి వెళ్లినట్లు రోహిత్ శర్మ స్పష్టంగా కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య త్వరలో జరగబోతున్న వన్డే క్రికెట్ కు సెలెక్ట్ అయిన రోహిత్ శర్మ కెప్టెన్సీ ని తొలగించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. రోహిత్ శర్మను పక్కకు పెట్టి గిల్ కు అప్పగించారు. ఈ వార్త బయటకు రాగానే టీమిండియా అభిమానులు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏంటి ఇలా చేశారు? ODI వరల్డ్ కప్ 2027 టోర్నమెంటు వరకు రోహిత్ శర్మ ఆడతాడు అనుకుంటే… కెప్టెన్సీ లేకుండా చేశారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది.
విమానాశ్రయంలో దిగిన రోహిత్ శర్మ చాలా దీనంగా కనిపించాడు. డిప్రెషన్ లోకి వెళ్లినట్లు స్పష్టమవుతోంది. కెప్టెన్సీ తొలగించడంతో అతను చాలా బాధపడుతున్నట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అయితే రోహిత్ శర్మ కనిపించగానే విలేకరులు అతని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య సిరీస్ కోసం ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారు? కెప్టెన్సీ కోల్పోవడం పై మీ రియాక్షన్ ఏంటి? అని పలువురు జర్నలిస్టులు ప్రశ్నించారు. అయితే వాటికి సమాధానం ఇవ్వకుండా కాస్త ఆందోళన చెందుతూ వెళ్ళిపోయాడు రోహిత్ శర్మ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
— Out Of Context Cricket (@GemsOfCricket) October 7, 2025