WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు తన యూజర్స్ కోసం లేటెస్ట్ ఫీచర్స్ ను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో సెక్యూరిటీని పెంచడమే కాకుండా యూజర్స్ సౌకర్యవంతంగా వాడుకునే విధంగా ఎన్నో అధునాతన ఫీచర్స్ ను సైతం అందించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ప్లాట్ఫామ్ మరొక కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. నేరుగా వాట్సాప్ లోనే డాక్యుమెంట్ స్కాన్ చేసే స్కానర్ ను పరిచయం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వాడుతున్న సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సప్. ఈ యాప్ ఎప్పటికప్పుడు తన యూజర్స్ వెసులుబాటుతో పనిచేస్తూ లేటెస్ట్ ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పుడు తాజాగా మెసేజెస్ కోసమే కాదు.. ముఖ్యమైన డాక్యుమెంట్స్ ను పంపించేందుకు సరికొత్త ఫీచర్ ను తెచ్చింది. సాధారణంగా డాక్యుమెంట్స్ స్కాన్ చేయాలంటే క్రోమ్ లో కనిపించే ఇతర టూల్స్ లేదా అప్లికేషన్స్ పై ఆధారపడాల్సిందే లేదా ప్లే స్టోర్ లో వచ్చేసినా ఎదో ఒక స్కానింగ్ యాప్స్ ను ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది.
అయితే ఇకపై ఇలాంటి ఇబ్బంది లేకుండా వాట్సాప్ లోనే నేరుగా స్కాన్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ప్లే స్టోర్లో ఉపయోగించే స్కాన్ యాప్స్ తో స్కాన్ చేసి డాక్యుమెంట్ సైజ్, క్వాలిటీ ఎంచుకొని సేవ్ చేసి వాటిని ఒక పద్ధతిలో సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల ఎక్కువ సమయం వృథా అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే వాట్సప్ కొత్త డాక్యుమెంట్ స్కానింగ్ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో థర్డ్ పార్టీ యాప్స్ పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
ఇక ఈ ఫీచర్ పై స్పందించిన వాబిటా ఇన్ఫో యూజర్స్ డాక్యుమెంట్స్ ను తేలిగ్గా స్కాన్ చేసేందుకే ఈ ఫీచర్ ను తీసుకొచ్చినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ సైతం పంచుకుంది. లేటెస్ట్ వెర్షన్ యాపిల్ యూజర్లకు ఈ ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో ఉంటుందని తెలిపింది. త్వరలోనే మిగిలిన యూజర్స్ కు అందుబాటులో తీసుకువస్తామని చెప్పుకొచ్చింది. డాక్యుమెంట్ షేరింగ్ మెనూ లో కొత్తగా ఈ స్కానింగ్ ఆప్షన్ కనిపించనుందని.. దీని సాయంతో కావాల్సిన డాక్యుమెంట్స్ ను స్కాన్ చేసే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చింది.
ఇక వెంటనే వాట్సప్ లో కెమెరా ఉపయోగించిన ఫోటో తీసిన అంత తేలికగా డాక్యుమెంట్స్ లో స్కాన్ చేసి పంపించవచ్చని వాబిటా తెలిపింది. ఇందులో ప్రివ్యూ ఆప్షన్స్ కూడా ఉందని తెలిపింది. ఎమర్జెన్సీ సమయంలో ఈ డాక్యుమెంట్ స్కాన్ ఎంతో ఉపయోగపడుతుందని.. సమయం వృథా కాదని తెలిపింది. అయితే ఈ ఫీచర్ ఎంతో భద్రతతో కూడుకున్న విషయమని.. ఇందులో ఎండ్ టు ఎండ్ ఎన్స్కిఫ్షన్ సైతం ఉంటుందని, డేటా భద్రంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక ఏది ఏమైనా మారుతున్న టెక్నాలజీ తో పాటు యూజర్స్ కు మరింత వెసులుబాటు కల్పిస్తూ.. మెటా తీసుకొస్తున్న ఈ ఫీచర్స్ యూజర్స్ ను కచ్చితంగా ఆకట్టుకుంటాయనే చెప్పాలి.
ALSO READ : వీవో ఏముంది భయ్యా! 50MP కెమెరా, 5500mAh బ్యాటరీ.. ఇంకా ఎన్నో ఫీచర్స్!