Army Truck Accident : జమ్ము కశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వ్యాన్ ప్రమాదానికి గురైంది. యాంటీ టెరరిస్ట్ ఆపరేషన్ ముగించుకుని వస్తున్న క్రమంలో ఆర్మీ ట్రక్ లోయలో పడిపోయంది. దీంతో.. అందులో ప్రయాణిస్తున్న జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటి వరకు ఐదుగురు జవాన్లు చనిపోయినట్లు తెలుస్తోంది. కాగా.. మిగతా వారిని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు.
పూంచ్ సెక్టార్ లో విధులు నిర్వహిస్తున్న “వైట్ నైట్ కార్ప్స్” బృందానికి చెందిన సభ్యులు.. ప్రమాదంలో చిక్కుకోగా… విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇంకా.. రెస్కూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రమాద ఘటనపై తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేసిన “వైట్ నైట్ కార్ప్స్” అమరులైన జవాన్లకు నివాళులు అర్పించింది.