E-Paper
Advertisement

WhatsApp:- వాట్సాప్‌లో మరో ప్రైవసీ ఫీచర్.. ‘లాక్డ్ చాట్స్’..

WhatsApp:- వాట్సాప్‌లో మరో ప్రైవసీ ఫీచర్.. ‘లాక్డ్ చాట్స్’..
Advertisement

WhatsApp:- సోషల్ మీడియా యాప్స్ అనేవి ఉపయోగించని వారు ఈరోజుల్లో చాలా తక్కువమంది కనిపిస్తారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియాలోని ఏదో ఒక్క యాప్‌ను కచ్చితంగా ఉపయోగిస్తూనే ఉంటారు. అందుకే సోషల్ మీడియా యాప్స్ కూడా యూజర్ల ప్రైవసీకి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈమధ్య కాలంలో ఈ జాగ్రత్తలు మరింత ఎక్కువయ్యాయి. అందుకే ఎప్పటికప్పుడు యాప్స్‌ను అప్డేట్ చేస్తూ కొత్త ఫీచర్లను యాడ్ చేస్తున్నారు. అందులో వాట్సప్ కూడా ఒకటి.

వాట్సాప్ అనేది మెసేజింగ్ కోసం ఉపయోగించే ఒక యాప్‌లాగా కాకుండా మెసేజింగ్ చేయాలంటే వాట్సాపే బెస్ట్ అనేంత స్థాయికి ఎదిగింది. వాట్సాప్ లాంచ్ అయినప్పుడు కేవలం మెసేజింగ్ యాప్‌లాగానే ప్రారంభం అయ్యింది. కానీ ఇతర సోషల్ మీడియా యాప్స్ నుండి పోటీ ఎక్కువవ్వడంతో వాట్సాప్ కూడా కొత్త కొత్త ఫీచర్లను యాడ్ చేస్తూ యూజర్లను ఆకర్షించడం మొదలుపెట్టింది. ప్రైవసీ విషయంలో కూడా ఇప్పటికే వాట్సాప్ ఎన్నో మార్పులు చేసింది. ఇప్పుడు ‘లాక్డ్ చాట్’ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది.

Advertisement

త్వరలోనే ఆండ్రాయిడ్ షోన్లలో ఉండే వాట్సాప్ వర్షన్‌లకు లాక్డ్ చాట్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ప్రకారం.. గ్రూప్ చాట్‌లో కూడా ప్రైవేట్ సంభాషణలు ఎవరూ చూడకుండా లాక్ పెట్టుకోవచ్చు. అంతే కాకుండా ఇతర వ్యక్తులతో జరిగే ప్రైవేట్ సంభాషణలకు కూడా ఈ ఫీచర్ ద్వారా లాక్ పెట్టుకునే అవకాశం ఇస్తుంది వాట్సాప్. దీని ద్వారా వారి వాట్సాప్‌ను ఇతరులు ఓపెన్ చేసి చూసినా కూడా కొన్ని చాట్స్ మాత్రం వారికి కనిపించకుండా ఉంటాయి. దీని ద్వారా ప్రైవేట్ కాన్వర్జేషన్స్ విషయంలో యూజర్లకు పూర్తి ప్రైవసీ దొరుకుతుంది.

ఒకవేళ పాస్‌వర్డ్ తెలియకపోయినా ఇంకెవరైనా ఈ ప్రైవేట్ చాట్స్‌ను ఓపెన్ చేయాలని ప్రయణిస్తే.. వాట్సాప్ యూజర్లకు వెంటనే సమాచారాన్ని అందిస్తుంది. ఒకవేళ లాక్డ్ చాట్‌లో ఉన్నవారి నుండి ఫోటోలు, వీడియోలు ఏమైనా వస్తే అవి గ్యాలరీలోకి కూడా వెళ్లకుండా ఉండేలా ఈ ఫీచర్ సౌకర్యాన్ని అందిస్తుంది. కేవలం యూజర్ల చేతిలో మాత్రమే ఉండే ఈ లాక్డ్ చాట్ యాక్సెస్ వారి ప్రైవేట్ చాట్స్.. పబ్లిక్ అవ్వకుండా ఉండేలా కాపాడతాయి. ప్రస్తుతం డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్ రిలీజ్ ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ లేదు.

Advertisement

అమెజాన్‌పై ప్రైవసీ కేసు.. అలెక్సానే కారణం..

for more updates follow this link:-Bigtv

Tags

Related News

టాప్ 5 ఏఐ టూల్స్..ఈ ట్రిక్స్ తెలిస్తే వర్క్ చిటికెలో అయిపోతుంది!

బడ్జెట్ ధరలో లగ్జరీ లుక్.. నాయిస్ నుంచి అదిరిపోయే ఉమెన్స్ స్మార్ట్‌వాచ్!

ల్యాప్‌టాప్ వెబ్‌క్యామ్ పక్కన ఈ చిన్న హొల్స్‌ ఎందుకు ఉంటాయో తెలుసా?

యూత్ కోసం నాయిస్ సరికొత్త ప్రయోగం! ఈ ట్రెండీ ఇయర్‌బడ్స్ చూశారా?

గూగుల్ డ్రైవ్‌లో ఫైల్స్ అప్లోడింగ్ చాలా స్లోగా ఉందా? ఈ సింపుల్ ట్రిక్స్ ట్రై చూసి చూడండి!

కొత్త ఫోన్ కొనడానికి ముందు ఈ 5 విషయాలు చూడకపోతే నష్టపోవడం ఖాయం!

ఫోన్ కెమెరాలో HDR ఆన్ చేస్తే ఏమవుతుంది? చాలా మంది చేసే పొరపాటు ఇదే!

ఆన్‌లైన్ మోసాల బారిన పడి డబ్బులు పోయాయా? ఇలా చేస్తే రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది!

Big Stories

Advertisement
×