Xiaomi 17 Pro| చైనా దిగ్గజ టెక్ కంపెనీ షావోమీ ఒక్కసారిగా స్మార్ట్ ఫోన్ మార్కెట్‌ని షేర్ చేసింది. కొత్తగా షావోమీ 17 ప్రో, 17 Pro Max ఫోన్‌లను లాంచ్ చేసింది. చైనాలో ఈ ఫోన్లు బేస్ వేరియంట్ షావోమీ 17 మోడల్‌తో పాటు విడుదలయ్యాయి. ఈ రెండు ఫ్లాగ్‌షిప్‌లు అడ్వాన్స్ Snapdragon 8 Elite Gen 5 చిప్‌తో పనిచేస్తాయి. ఈ ఫోన్ల వెనుక భాగంలో కూడా M10 డిస్‌ప్లే ఉండడం ఒక ప్రత్యేక ఫీచర్. HyperIsland అనేది Xiaomi వెర్షన్ డైనమిక్ ఐలాండ్. ఇది నోటిఫికేషన్‌లను చూడటానికి సహాయపడుతుంది.
17 Pro, 17 Pro Max ఫోన్లో Leica భాగస్వామ్యంతో బెస్ట్ కెమెరాలు అమర్చాయి. Pro మోడల్ ప్రారంభ ధర CNY 4,999(₹57,500).
Pro Max CNY 5,999. కలర్లు: వైట్, బ్లాక్, కోల్డ్ స్మోక్ పర్పుల్, ఫారెస్ట్ గ్రీన్. వివరాలు క్రింద చూడండి.
ధర, అందుబాటు
17 Proకు 12GB+256GB వేరియంట్ CNY 4,999 (₹57,500). 12GB+512GB CNY 5,299 (₹60,900). 16GB+512GB CNY 5,599 (₹64,400). 16GB+1TB CNY 5,999 (₹68,900).
17 Pro Maxకు 12GB+512GB CNY 5,999 (₹68,900). 16GB+512GB CNY 6,299 (₹72,500). 16GB+1TB CNY 6,999 (₹80,500).
చైనా మెయిన్‌ల్యాండ్‌లో మరి కొన్ని రోజుల్లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ప్రీ-బుకింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది. అక్టోబర్ 1 ముందు అందుబాటులోకి ఫోన్లు వస్తాయి. ఇంటర్నేషనల్ లాంచ్ గురించి త్వరలో కంపెనీ ప్రకటించనుంది.
సాఫ్ట్‌వేర్, ప్రత్యేక ఫంక్షన్లు
ఇవి HyperOS 3తో Android 16పై ప్రీ-ఇన్‌స్టాల్ అవుతాయి. HyperIsland సెల్ఫీ కెమెరాతో నోటిఫికేషన్ యానిమేషన్‌లను మార్చుతుంది. మ్యాజిక్ బ్యాక్ స్క్రీన్ 3,500 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుంది.
వెనుక స్క్రీన్‌పై AI పోర్ట్రెయిట్స్ క్రియేట్ చేయవచ్చు. నోట్స్ పిన్ చేయవచ్చు. వెనుక కెమెరాతో సెల్ఫీలు ప్రివ్యూ చూడవచ్చు. అలారం క్లాక్‌గా ఉపయోగించవచ్చు. మీడియా ప్లేబ్యాక్ కంట్రోల్ చేయవచ్చు. ఇది వెనుక స్క్రీన్‌కు మాత్రమే.
డిస్‌ప్లే, బిల్డ్
17 Pro Max 6.9 ఇంచ్ 2K డిస్‌ప్లే ఇస్తుంది. 17 Pro 6.3 ఇంచ్ డిస్‌ప్లే. రెస్పాన్స్ టైమ్ వేగంగా ఉంటుంది. Xiaomi డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ ఫోన్ రఫ్ వినియోగానికి కూడా సరిపోతుంది. 17 Pro Max మందం 8mm, బరువు 192 గ్రాములు. IP66, IP68, IP69 రేటింగ్‌లు ఉన్నాయి. నీరు, ధూళి నుంచి రక్షణ బాగుంది. M10 లూమినెసెన్స్ టెక్నాలజీ 82.1 cd/A ఎఫిషియెన్సీ ఇస్తుంది.
పెర్ఫార్మెన్స్ పవర్
రెండు మోడల్స్ Snapdragon 8 Elite Gen 5 చిప్‌తో పనిచేస్తాయి. 3nm ప్రాసెస్‌తో వేగం గరిష్టం. 16GB RAM వరకు మల్టీటాస్కింగ్ సులభం. 1TB స్టోరేజ్ ఆప్షన్లు. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ సులభంగా అన్‌లాక్ చేస్తుంది.
గేమింగ్, హెవీ టాస్క్‌లకు బెస్ట్.
కెమెరా సెటప్
Leica ట్యూన్డ్ ట్రిపుల్ రియర్ కెమెరాలు. 50MP లైట్ హంటర్ 950L ప్రైమరీ. 50MP అల్ట్రా-వైడ్. 50MP పెరిస్కోప్ టెలిఫోటో 5x ఆప్టికల్ జూమ్. ఫ్రంట్ లో 50MP సెల్ఫీ కెమెరా క్రిస్ప్, వైబ్రెంట్ ఫోటోలు ఇస్తుంది. లోలైట్, డేలైట్‌లో కూడా అద్భుత షాట్స్ తీయవచ్చు.
బ్యాటరీ, కనెక్టివిటీ
17 Pro Maxలో 6,300mAh బ్యాటరీ. 17 Pro ఫోన్ లో 7,500mAh బ్యాటరీ ఉంటాయి. ఛార్జింగ్ విషయంలో Pro ఫోన్‌లో 100W వైర్డ్, 50W వైర్లెస్ చార్జింగ్. 5G, 4G, Wi-Fi, బ్లూటూత్, GPS, NFC, USB Type-C. UWB ప్రిసిషన్ ట్రాకింగ్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ని రోజంతా బ్యాటరీ గురించి భయం లేకుండా ఛార్జ్ చేయవచ్చు. ఈ ఫోన్లు.. ప్రస్తుతం టాప్ రేంజ్ లో ఐఫోన్ 17 కు గట్టి పోటీనిస్తున్నాయి.
Also Read: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే