BigTV English

Ravanasura : థియేటర్లలో రావణాసుర సందడి.. సినిమాపై ట్విట్టర్ టాక్..

Ravanasura : థియేటర్లలో రావణాసుర సందడి.. సినిమాపై ట్విట్టర్ టాక్..

Ravanasura : మాస్‌ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం రావణాసుర భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్‌, సాంగ్స్ ఈ మూవీపై ఆసక్తిని పెంచేశాయి. సుధీర్‌ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్లు అను ఇమ్మాన్యూయేల్, మేఘా ఆకాష్ , ఫరియా అబ్దుల్లా , దక్షా నగార్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హీరో సుశాంత్ కీలక పాత్రో పోషించడం ఆసక్తిని రేపింది. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చ‌ర్స్, ఆర్‌టీ టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా నిర్మించారు.


గుడ్ ఫ్రైడే రోజు థియేటర్లలోకి వచ్చిన రావణాసుర ప్రేక్షకులను మెప్పించాడా? సోషల్ మీడియాలో సినీఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ఈ మూవీపై ఎలాంటి కామెంట్లు చేస్తున్నారు? ట్విట్టర్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం.

“రావణాసుర‌ థ్రిల్లర్‌ మూవీ. రవితేజ ఫ్యాన్స్‌తో పాటు జనరల్‌ ఆడియన్స్‌ ను కూడా అలరిస్తుంది. రవితేజను గతంలో ఎప్పుడూ చూడని పాత్రలో చూశాం. స్టోరీ, ఇంటర్వెల్‌ సీన్‌, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగుందంటూ” ఓ నెటిజన్‌ 4 స్టార్స్‌ ఇచ్చాడు.


ఫస్ట్ హాఫ్ డీసెంట్‌. ఇంటర్వెల్ బ్యాంగ్ మైండ్ బ్లోయింగ్. సెకండ్ హాఫ్ సూపర్. హీరోయిన్స్ రోల్స్ ఇంప్రెసివ్ గా లేవు. ఓవరాల్‌గా సినిమా బ్లాక్‌ బస్టర్‌ అంటూ మూడున్నర స్టార్‌ ఇచ్చాడు మరో నెటిజన్‌.

సెకండాఫ్‌లో మంచి ట్విస్టులు ఉంటాయి. క్లైమాక్స్‌, బీజీఎం బాగుంది. లాయర్‌ క్రిమినల్‌ అయితే ఎలా ఉంటుందో మాస్‌ మహారాజా బాగా చూపించాడు. ఓవరాల్‌గా సినిమా హిట్‌ అని ఇంకో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.

ప్లీజ్‌ ఇలాంటి సినిమాలు చేయకు. నిప్పు, ఖిలాడీ చూసిన ఫీలింగ్‌ కలుగుతోంది అని ఓ నెటిజన్‌ నెగిటివ్ గా కామెంట్స్ చేశాడు. మొత్తంమీద చూస్తే సినిమాకు మంచి టాకే వచ్చింది. ఎక్కువ మంది పాజిటివ్ గానే కామెంట్ చేస్తున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×