BigTV English

WhatsApp Tricks: వాట్సప్‌లో కొత్త ఫీచర్స్.. తెలుసుకోకపోతే చాలా మిస్సవుతారు !

WhatsApp Tricks: వాట్సప్‌లో కొత్త ఫీచర్స్.. తెలుసుకోకపోతే చాలా మిస్సవుతారు !


WhatsApp Tricks: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రతిరోజూ వాట్సాప్ వాడుతున్నారు. ఈ మెసేజింగ్ యాప్‌లో పర్సనల్ చాట్‌తో బిజినెస్ చాట్ ఆప్షన్ కూడా ఉంటుంది. కానీ దీనిలో దాగి ఉన్న అనేక ఫీచర్ల గురించి చాలా మందికి తెలియదు. రెండు బిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న వాట్సాప్, కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంటుంది. వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాట్సాప్ వాడే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన 15 ప్రత్యేకమైన సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం.

1. చాట్‌లను లాక్ చేయండి:


మీరు కొన్ని ప్రత్యేకమైన, ముఖ్యమైన చాట్‌లను పాస్‌కోడ్, వేలిముద్ర లేదా ఫేస్ ఐడీతో రక్షించుకోవచ్చు. దీని వల్ల ప్రయోజనం ఏటంటే ఎవరైనా మీ ఫోన్‌ను యాక్సెస్ చేసినా.. మీ ప్రైవేట్ చాట్ ఓపెన్ చేయలేరు. ఇలా మీ చాట్ సురక్షితంగా ఉంటుంది.

2. డ్యూయల్ అకౌంట్ సపోర్ట్ (డ్యూయల్ వాట్సాప్ అకౌంట్స్):

ఇప్పుడు మీరు ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను కూడా ఉపయోగించవచ్చు. మీరు మీ ఆఫీస్ లేదా బిజినెస్ అకౌంట్ లతో పాటు , పర్సనల్ అకౌంట్ లను వేరు వేరుగా ఒకే ఫోన్‌లో వాడవచ్చు. వీటి కోసం రెండు ఫోన్లు వాడాల్సిన అవసరం లేదు.

3. మెటా AI ఇంటిగ్రేషన్:

ఇప్పుడు వాట్సాప్‌లో మెటా AI ఇంటిగ్రేట్ చేశారు కాబట్టి ఇది మీ ప్రశ్నలకు తక్షణ సమాధానాలను పొందడానికి, అంతే కాకుండా సరదాగా చాట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు గూగుల్ లో సెర్చ్ చేయకుండాలనే ఎలాంటి విషయం గురించిన సమాచారం అయినా మెటా ద్వారా తెలుసుకోవచ్చు.

4. కస్టమ్ స్టిక్కర్లు:

ఇప్పుడు మీరు మీ ఫోటో లేదా ఏదైనా చిత్రాన్ని స్టిక్కర్‌గా మార్చవచ్చు. మీరు AI సహాయంతో కొత్త, ప్రత్యేకమైన స్టిక్కర్‌లను కూడా సృష్టించవచ్చు.

5. పంపిన మెసేజ్ ఎడిట్ చేయండి:

మీరు పొరపాటున అక్షర దోషాలు ఉన్న మెసేజ్ పంపినా లేదా తప్పుడు సమాచారం పంపినా, ఆ మెసేజ్‌ను డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. పంపిన మెసేజ్‌ను లాంగ్ ప్రెస్ చేసి, దానిని నేరుగా ఎడిట్ చేయవచ్చు.

4. అన్‌డూ ఫీచర్:

మీరు ఒక మెసేజ్‌ను డిలీట్ ఫర్ ఎవ్రీవన్‌ చేయాలనుకుని పొరపాటున డిలీట్ ఫర్ మీ అని నొక్కితే కంగారు పడకండి. ఆ సమయంలో స్క్రీన్ కింద కనిపించే అన్‌డూ ఆప్షన్‌ను నొక్కడం ద్వారా మెసేజ్‌ను తిరిగి పొందవచ్చు.

5. చాట్ బ్యాకప్:

మీ పాత మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు పోకుండా ఉండాలంటే.. చాట్ బ్యాకప్ ఫీచర్‌ను ఆన్ చేసుకోండి. ఇది మీ మొత్తం డేటాను క్లౌడ్‌లో సేఫ్ చేస్తుంది. ఫోన్ మారినా లేదా యాప్ డిలీట్ అయినా మీ డేటా సురక్షితంగా ఉంటుంది.

Also Read: ఐఫోన్‌లో రహస్య ఫీచర్లు.. విద్యార్థులకు ప్రత్యేకం.. ఇవి తెలుసా?

6. యానిమేటెడ్ ఎమోజీలు:

సాధారణ ఎమోజీలకు బదులుగా.. ఇప్పుడు మీరు యానిమేటెడ్ ఎమోజీలను పంపవచ్చు. ఇవి మీ చాటింగ్‌ను మరింత సరదాగా మారుస్తాయి.

7. HD క్వాలిటీ ఫోటో-వీడియో షేరింగ్:

ఇప్పుడు మీరు వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలు పంపేటప్పుడు వాటి క్వాలిటీ తగ్గదు. మీరు వాటిని HD ఆప్షన్ ద్వారా పంపించవచ్చు.

8. ముఖ్యమైన మెసేజ్‌లను పిన్ చేయండి:

ఒక చాట్‌లో ముఖ్యమైన మెసేజ్ (ఉదా. వైఫై పాస్‌వర్డ్, మీటింగ్ టైం) ఉంటే దానిని పిన్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఆ మెసేజ్ ఎప్పుడూ చాట్ పైన కనిపిస్తుంది.

Related News

iPhone 15 Pro Max: ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఫై భారీ తగ్గింపు.. ఏకంగా ₹45,000 డిస్కౌంట్

Huawei Mate XTs: 10.2 అంగుళాల భారీ స్క్రీన్‌.. అద్భుత కెమెరాలతో ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ లాంచ్

Students iPhone: ఐఫోన్‌లో రహస్య ఫీచర్లు.. విద్యార్థులకు ప్రత్యేకం.. ఇవి తెలుసా?

Lava Yuva Smart 2: రూ. 6000కే 5000mAh బ్యాటరీ ఫోన్.. లావా యువ స్మార్ట్ 2 లాంచ్

Speed Of Earth: బద్దకంగా తిరుగుతోన్న భూమి.. గాల్లో పెరుగుతోన్న ఆక్సిజన్ శాతం.. లాభమా? నష్టమా?

Big Stories

×