Gautam Gambhir: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా వన్డే సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. 3 వన్డేల సిరీస్ ను 2-0 తేడాతో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై దారుణంగా విమర్శలు చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల టీమిండియా ఓడిపోయిందని అభిమానులందరూ ఫైర్ అవుతున్నారు. అనవసరమైన ప్రయోగాలు చేసి, టీమిండియా జట్టును నాశనం చేస్తున్నాడని గౌతమ్ గంభీర్ పై మండిపడుతున్నారు. అయితే టీమిండియా ఓడిపోయిన నేపథ్యంలో తన పైన నెగెటివిటీ రాకుండా గౌతమ్ గంభీర్ జాగ్రత్తగా పడుతున్నాడట.
ఇందుకోసం తన పీఆర్ టీంను యాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది. తాను హెడ్ కోచ్ గా మారిన తర్వాత టీమ్ ఇండియా స్వరూపం మారిపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికోసం గౌతమ్ గంభీర్ కూడా భారీగానే ఖర్చులు పెడుతున్నారట. తనకు సపోర్ట్ గా ఓ పీఆర్ టీం ను మెయింటైన్ చేస్తున్న గౌతమ్ గంభీర్, దాదాపు 49 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. టీమిండియా ఓడితే, కెప్టెన్ గిల్, ప్లేయర్లపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడట.
టీమిండియా దారుణంగా ఓడిపోయిన నేపథ్యంలో తనపై నెగిటివ్ ప్రచారం జరగకుండా గౌతమ్ గంభీర్ చాలా జాగ్రత్త పడుతున్నాడు. తాను వచ్చాకే టీమిండియా బాగుపడిందని ప్రచారం చేసుకుంటున్నాడు. అదే సమయంలో రాహుల్ ద్రావిడ్ తో పాటు రవిశాస్త్రిలను టార్గెట్ చేసి తన పిఆర్ టీంతో పోస్టులు పెట్టిస్తున్నాడు. వాళ్ళిద్దరూ కోచ్‌లుగా ఉన్నప్పుడు టీమిండియా పెద్దగా రాణించలేదని చెప్పే ప్రయత్నం చేయిస్తున్నాడు. తన సారధ్యంలోనే టీమిండియా అద్భుతంగా విజయాలు అందుకుంటుందని పోస్టులు పెట్టిస్తున్నాడు. ఇక ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఓడిపోయిన నేపథ్యంలో గిల్ కెప్టెన్సీ సరిగ్గా చేయలేదని ఇప్పుడు సీన్ రివర్స్ చేశాడు. విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ బాగా ఆడితే టీమిండియా కచ్చితంగా గెలిచేదని అర్థం వచ్చేలా పోస్టులు పెట్టిస్తున్నాడు.
వాస్తవంగా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత టీమిండియాకు పెద్ద బొక్కే పడింది. అతడి సారథ్యంలోనే ఏకంగా ఐదు సిరీస్ లు కోల్పోయింది టీమిండియా. సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయింది టీమిండియా. అలాగే శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ కూడా కోల్పోవడం జరిగింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో కూడా 4-1 తేడాతో చిత్తుచిత్తుగా ఓడిపోయింది టీమిండియా. ఇక మొన్న గిల్ కు కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ డ్రాగా ముగించుకుంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ కూడా కోల్పోయింది టీమిండియా.
🚨 BIG BREAKING:
According to close sources, Gautam Gambhir reportedly spent ₹49 lakh on PR after the series loss in Australia. Out of that, ₹36 lakh was spent only on Twitter for paid tweets, as per JIT reports.The same guy who used to cry about others doing PR…is now… pic.twitter.com/ZA9k2ZpdQq
— Jyran (@Jyran45) October 24, 2025