BigTV English
Advertisement

Prabhas : పాపం ప్రభాస్ ఫ్యాన్స్… హర్ట్ అయ్యారు

Prabhas : పాపం ప్రభాస్ ఫ్యాన్స్… హర్ట్ అయ్యారు

Prabhas Upcoming Movies : పేరుకే పాన్ ఇండియా స్టార్. పైగా చేతి నిండా సినిమాలు. కానీ, ఏం చేస్తాం బర్త్ డే రోజు అభిమానులు హర్ట్ అయిపోయారు. డార్లింగ్ బర్త్ డే కోసం ఇన్నాళ్లు వెయిట్ చేసిన ఫ్యాన్స్‌కు ఆ సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది. దీని కోసమా… ఇన్ని రోజులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూసింది అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ ఇలా హర్ట్ అవ్వడానికి రీజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.


అక్టోబర్ 23… రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ బర్త్ డే ఇది. దీనికి ఆయన అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే… ఆయన నటించే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఆ రోజు వస్తాయి. ఎప్పటి లానే.. ఈ ఏడాది అక్టోబర్ 23 తేదీ కోసం కూడా అభిమానులు ఎదురుచూశారు.

ఫైనల్ ఆ రోజు వచ్చింది. ఎర్లీ మార్నింగ్ నుంచి మొదలెడితే… రాత్రి వరకు ప్రభాస్ నామస్మరణ మార్మోగిపోతుందని అనుకున్నారు. తీరా చూస్తే… ఇండస్ట్రీ సైలెంట్‌గానే ఉంది.


ఫ్యాన్స్ హర్ట్…

ప్రభాస్ చేతిలో ప్రస్తుతం 5 సినిమాలు ఉన్నాయి. ఈ 5 సినిమాల నుంచి వరుసగా అప్డేట్స్ వస్తాయని అనుకున్నారు. ది రాజా సాబ్, ఫౌజీ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. స్పిరిట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుంది. అలాగే, సలార్ 2, కల్కి 2 కూడా త్వరలోనే షూటింగ్ సెట్స్‌పైకి రాబోతున్నాయి. వీటి అన్నింటి నుంచి ఏదో ఒక అప్డేట్ ఉంటుందని నమ్మిన ఫ్యాన్స్.. ఇప్పుడు హర్ట్ అయిపోయారు.

ది రాజా సాబ్…

ది రాజా సాబ్ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. కాబట్టి.. ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ ఎక్స్‌పెక్ట్ చేశారు. ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాకపోయినా… ఎట్ లీస్ట్ వచ్చే డేట్ అండ్ టైం అయినా చెబుతారేమో అనుకున్నారు. కానీ, ఓ సాధాసీద పోస్టర్ రిలీజ్ చేసి పండగ చేసుకోమ్మని అన్నారు. పైగా ఆ పోస్టర్‌లో వచ్చిన లుక్ ఇప్పటికే లీక్ అయి… అందరూ చేసేశారు.

ఫౌజీ…

ప్రభాస్ ప్రస్తుతం షూటింగ్‌లో పాల్గొంటున్న సినిమా ఇది. చాలా వరకు షూటింగ్ కూడా అయిపోయిందంట. అలాంటి సినిమా నుంచి అభిమానులు సాలిడ్ అప్డేట్ ఎక్స్‌పెక్ట్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ, ఎప్పటో నుంచే ప్రచారంలో ఉన్న టైటిల్‌నే ఓ పోస్టర్ పెట్టి రిలీజ్ చేశారు. టైటిల్ పోస్టర్ కాకుండా… ప్రభాస్ విజువల్‌గా కనిపించేలా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసినా… ఫ్యాన్స్ కొంత వరకు హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్లు.

కల్కి 2 – సలార్ 2..

నిజానికి ప్రభాస్ అభిమానులు ఈ కల్కి 2, సలార్ 2 సినిమాల కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు సెకండ్ పార్ట్‌లో ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్ ఉంది. అయితే, ఈ సినిమాల షూటింగ్ ఇప్పుడే స్టార్ట్ అవ్వలేదు. కానీ, డార్లింగ్ బర్త్ డే రోజు కనీసం ఈ రెండు సినిమాల షూటింగ్ డేట్.. లేదా మంత్ అయినా అనౌన్స్ చేస్తారని అనుకున్నారు. కానీ, జస్ట్ నార్మల్ బర్త్ డే విసెష్ పోస్టర్లతోనే సరిపెట్టారు.

స్పిరిట్…

గుడ్డిలో మెల్ల బెటర్.. అన్నట్టు స్పిరిట్ అప్డేట్‌తో డార్లింగ్ ఫ్యాన్స్ కొంత మేర ఒకే అని ఫీల్ అయ్యారు. ప్రభాస్ కనిపించకపోయినా.. ఆయన వాయిస్ వినిపించింది. అలాగే ప్రభాస్ IAS ఆఫీసర్‌గా చేస్తున్నాడని, ఆయన జైలు శిక్ష అనుభవించే ఖైదీ అని, సందీప్ రెడ్డి వంగ అన్నీ సినిమాల్లానే దీంట్లో కూడా హీరో పాత్ర డామినేట్‌గా ఉంటుందని తెలిసింది. ఇది ఫ్యాన్స్ కాస్త కిక్క్ ఇచ్చింది.

స్పిరిట్ AI రూమర్..

స్పిరిట్ అప్డేట్‌తో ఇలా ఖుషి అయ్యారో లేదో… అప్పుడే ఈ స్పిరిట్ అప్డేట్‌పై ట్రోల్స్ వచ్చాయి. ఇందులో ఉన్నది ప్రభాస్ వాయిస్ కాదు అని.. అది AI తో చేశారు అంటూ వార్తలు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో స్పిరిట్ కిక్క్ ఎక్కువ సేపు కూడా లేకుండా పోయింది.

Related News

Baahubali The Epic Trailer : బాహుబలి తిరిగి వచ్చాడు, మైండ్ చెదిరిపోయే ట్రైలర్ కట్

Sukumar: కొత్త బ్యానర్ స్టార్ట్ చేసిన సుకుమార్ వైఫ్, కుమారి 22 F తో మొదలు

NTR Dragon : ఆఫ్రికాకు ప్రయాణమవుతున్న ప్రశాంత్ నీల్, డ్రాగన్ పరిస్థితి ఏంటి?

Sachin Sanghvi: మహిళపై లైంగిక వేధింపులు .. పోలీసుల అదుపులో ప్రముఖ సింగర్

Megastar Chiranjeevi : 2026 లో మూడు సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసిన మెగాస్టార్

Upasana: ఉపాసన సీమంతపు వేడుకలలో కనిపించని అల్లు ఫ్యామిలీ.. మళ్ళీ దూరం పెరిగిందా?

Sharwanand: శర్వానంద్ షాకింగ్ లుక్, మరి ఇలా అయిపోయావ్ ఏంటి అన్న.?

Shiva Re release: శివ రీ రిలీజ్..రంగంలోకి పుష్ప రాజ్ .. స్పెషల్ స్పీచ్ ఇవ్వనున్న బన్నీ!

Big Stories

×