Student Suicide: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి గురుకుల పాఠశాలలో.. విద్యార్ధినీ ఆత్మహత్య కలకలం రేపుతోంది. 10వ తరగతికి చెందిన శ్రీవర్షిని(15) అనే విద్యార్థిని హాస్టల్ డార్మెటరీ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే.. హుజరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన వర్షిని.. బీమదేవరపల్లి మండలం గురుకుల పాఠశాలలో 10 వ తరగతి చదువుతుంది. ఇటీవల దీపావళి సందర్భంగా గురుకులానికి సెలవులు ఇవ్వడంతో.. వర్షిణి తన స్వగ్రామానికి వెళ్లింది. నిన్న సాయంత్రం తిరిగి హాస్టల్‌కి చేరింది. శుక్రవారం తెల్లవారుజామున డార్మెటరీ గదిలో సూసైడ్ చేసుకుంది. వెంటనే హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనా స్థలానికి చేరుకుని.. మృత దాహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Also Read: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే వర్షిని ఆత్మహత్యకు ముందు ఎటువంటి సుసైడ్ నోట్ రాయలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. తమ కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వర్షిని మృతికి ప్రేమ వ్యవహారమా.. లేక చదువులో ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకుందా లేదా ఎవరైనా వేధింపులకు గురి చేశారా అన్నకోణంలో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.