BigTV English

Ghaati Movie Review : ఘాటీ రివ్యూ – ఇదో భారమైన ఘాట్ రోడ్

Ghaati Movie Review : ఘాటీ రివ్యూ – ఇదో భారమైన ఘాట్ రోడ్

Ghaati Movie Review : సైజ్ జీరో తర్వాత అనుష్క పరిస్థితి మొత్తం మారిపోయింది. చాలా రోజులు కెమెరా ముందుకు కూడా రాలేకపోయింది. ఇప్పుడు ఏదో మ్యానేజ్ చేస్తూ కొన్ని సినిమాలు చేస్తుంది. ఇప్పుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఘాటీ అనే యాక్షన్ మూవీ చేసింది. యాక్షన్ ఎపిసోడ్స్‌ అంటే అనుష్క ఎప్పుడో ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు మరో యాక్షన్ మూవీ అంటే హైప్ పెరిగిపోయింది. అనుష్క ఎలా చేసిందో… అనే ఆసక్తి ఉంది. మరి ఎలా ఉందో చూద్దామా…


కథ :

ఆంధ్ర – ఒరిస్సా బోర్డర్ దగ్గర ఉన్న తూర్పు కనుముల్లో కొంత మంది ఘాటీలు గంజాయిని సాగు చేసి.. కాష్ఠాల నాయుడు (రవీంద్ర విజయ్), కుందల నాయుడు (చైతన్య రావు)కి ఇస్తారు. వీళ్లు అక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్ చేస్తారు. అయితే అక్కడ ఉండే ఘాటీలకు శీలవతి అనే మేలైన గంజాయిని సాగు చేయనివ్వరు. ఎవరైనా సాగు చేస్తే వారిని చంపేస్తారు.

అక్కడే ఘాటీలుగా ఉన్న శీలవతి (అనుష్క), దేశీ రాజు (విక్రమ్ ప్రభు) గంజాయిని మోసే పని వదులకుని ల్యాబ్ టెక్నిషియన్‌గా దేశి రాజు, బస్ కండెక్టర్‌గా శీలవతి మారుతారు. అలా ప్రశాంతగా ఉంటున్న శీలవతి, దేశిరాజు జీవితంలోకి కాష్ఠాల నాయుడు, కుందల నాయుడు ఎందుకు వచ్చారు ? లిక్విడ్ గంజాయికి శీలవతి, దేశిరాజులకు ఉన్న సంబంధం ఏంటి ? మహావీర్ (జిష్షు సేన్) అనే పెద్ద బిజినెస్ మ్యాన్ ఏం చేశాడు ? పోలీసు అధికారి విశ్వదీప్ రావత్ (జగపతి బాబు) పాత్ర ఏంటి ? అనేవి తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే.


విశ్లేషణ :

డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడిపై ఆడియన్స్ ఓ ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. కారణం ఆయన చేసిన సినిమాలు. అలాగే, ఈ మధ్య వచ్చిన హరి హర వీరమల్లు మూవీ టైంలో జరిగిన పరిణామాల వల్ల ఈయనకు కాస్త సింపతీ కూడా వచ్చింది. ఈ సింపతీ పక్కన పెడితే, క్రిష్ ఓ సీన్ ను తెరపై నిండుగా ప్రేక్షకుడు సాటిస్ఫై అయ్యేలా చూపిస్తాడు. కానీ, అది ఈ ఘాటీ సినిమాలో కనిపించదు. సినిమా మొత్తంలో అలాంటి సీన్ కనిపించలేదు.

రెగ్యూలర్ రివేంజ్ స్టోరీ అని కాకుండా, కథను బాగానే రాసుకున్నారు. కానీ, కథనం విషయంలో మాత్రం తడబడ్డారు. సినిమా స్టార్ట్ అవ్వడం ఇంట్రెస్టింగ్‌గానే స్టార్ట్ అవుతుంది. కారణం… ఆ ఆంధ్ర – ఒరిస్సా బోర్డర్ లోకేషన్స్ వల్ల అయి ఉండొచ్చు. తర్వాత పోను.. పోను… కథనం నీరుగారిపోతుంది. నత్తనడకలా అనిపిస్తుంది.

కథ కూడా ప్రిడక్టబులే. అలాంటి కథ ఉన్న టైంలో కథనం కట్టిపడేయ్యాలి. వచ్చే సీన్‌ను ఆడియన్స్ ముందే పసిగట్టినా… కథనంతో వాళ్లను లాక్ చేయాలి. కానీ, అలాంటి ప్రయత్నం డైరెక్టర్ నుంచి రాలేదు. సినిమా మొత్తం ఘాట్ రోడ్డులా ఉంటుంది. చూడటానికి బానే ఉన్నా.. ఎక్కువ సేపు ప్రయాణించలేం కదా.

ఫస్ట్ హాఫ్‌లో హీరో – హీరోయిన్ ఇద్దరు ఉంటారు. కథను నడిపిస్తారు. ఇంటర్వెల్ తర్వాత ఓ ట్విస్ట్ ఇచ్చినట్టు ఇచ్చి… సెకండాఫ్‌కి తీసుకెళ్తారు. అక్కడ హీరోయిన్ ఒకరే ఉంటారు. అనుష్క యాక్షన్ సీన్స్‌కి కొదవల లేదు. అయినా… ఎక్కడా కూడా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఉండదు. ఆ యాక్షన్ సీన్స్ అన్నీ చూసిన తర్వాత… కాష్ఠాల నాయుడు, కుందల నాయుడు లాంటి బలమైన వ్యక్తులకు ఓ అమ్మాయి ఒంటరిగా పోరాటం చేస్తుందా ? అంతలా ఫైట్ చేస్తుందా ? అనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమా విషయంలో లిబర్టీస్ తీసుకోవచ్చు. కానీ, అవి ఇక్కడ కాస్త మితిమీరాయని అనిపిస్తుంది.

అలాగే హీరోయిన్ అప్పటి వరకు కూల్‌గా ఉండి… వెంటనే అంత వయోలెంట్‌గా మారడం… పది ఇరవై మంది వచ్చినా.. కొట్టిపడేయ్యడం ఎక్కడా కూడా కన్విన్సింగ్‌గా లేదు. లీడ్ యాక్టర్ భారీ భారీ ఫైట్ సీన్స్ చేయడంతో పాటు… కాస్త తెలవితేటలతో కూడా సమస్యలను సాల్వ్ చేసేలా కొన్ని సీన్స్ పెడితే, సెట్ అయ్యేదేమో.

ఇక జిష్షు సేన్, నీరాలి పాత్రలను మొదట్లో చాలా పవర్‌ఫుల్‌గా చూపించాడు. తర్వాత అసలు ఆ పాత్రలు ఎందుకో అర్థం కాదు. అలాగే ఈ పాత్రలకు ఎండింగ్ కూడా సరిగ్గా ఇవ్వలేదు. ఈ పాత్రలే కాదు.. సినిమాలో ఇంకా చాలా అలాంటి పాత్రలు ఉన్నాయి. జగపతి బాబు… పాత్ర వచ్చినప్పుడల్లా… ఓ ఇరిటేషన్ ఫీల్ వస్తుంది. పాజిటివ్ రోల్ అయినా… ఆయన చెప్పే డైలాగ్స్, పాటలు, బాడీ లాంగ్వేజ్ అలాంటి ఫీల్‌నను తెప్పిస్తాయి. అంటే, స్టార్ కాస్ట్ ఉన్నా… వారిని సరిగ్గా వాడుకోవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడని అనిపిస్తుంది.

ఇక ఫర్ఫామెన్స్ అంటే… అనుష్కకు వంక పెట్టలేం. ఎమోషనల్ సీన్స్ అయినా… యాక్సన్ సీన్స్ అయినా… అదరగొట్టింది అనొచ్చు. ఒక మాటలో వన్ ఉమెన్ షో. విక్రమ్ ప్రభు పర్లేదు. ఆయనకు అంతకు మించి చేయడానికి స్కోప్ లేదు. రవీంద్ర విజయ్ కూడా పర్లేదు. కానీ, విలన్ పాత్ర చేసిన చైతన్య రావు మాత్రం బాగా చేశాడు. ఫేస్‌లో విలనిజాన్ని ఫర్ఫెక్ట్‌గా చూపించాడు. విలన్‌గా మరిన్ని సినిమాలు చేయొచ్చు ఆయన.

ఇక టెక్నికాలిటీస్ గురించి అంటే… కెమెరామెన్‌ను మెచ్చుకోవచ్చు. ఆ కొండలను అద్భుతంగా చూపించాడు. డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ అసలేం పెద్దగా పేలలేవు. కొన్ని డైలాగ్స్ మాత్రమే బటర్‌గా ఉన్నాయి. కానీ, అవి ఆయన రేంజ్ కాదు. ఎడిటింగ్‌కి మరింత పని చెప్పాల్సింది. మ్యూజిక్ ఓకే కానీ, సినిమాను లేపేంతగా ఏం లేదు. నిర్మాణ విలువలు బానే ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

అనుష్క
యాక్షన్ ఎపిసోడ్స్
లోకేషన్స్

మైనస్ పాయింట్స్ :

ల్యాగ్ సీన్స్
సెకండాఫ్
కథనం
ప్రెడిక్టబుల్ స్టోరీ

మొత్తంగా… చాలా లెన్తీగా ఫీల్ అయ్యే ఘాట్ రోడ్డే ఈ ఘాటీ

Ghaati Telugu Movie Rating : 2/5

Related News

Baaghi 4 Review : ‘బాఘీ 4’ మూవీ రివ్యూ… దుమ్మురేపే యాక్షన్, కానీ అసలు కథ మిస్

The Conjuring: Last Rites Review : ‘ది కాంజ్యూరింగ్: లాస్ట్ రైట్స్’ రివ్యూ… లొరైన్ దంపతులకు పర్ఫెక్ట్ సెండాఫ్

Madharaasi Movie Review : ‘మదరాసి’ మూవీ రివ్యూ: ‘తుపాకీ’ స్టైల్లో ఉన్న డమ్మీ గన్

Madharaasi Twitter Review: మదరాసి ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ

Ghaati Twitter Review: ‘ఘాటీ’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Big Stories

×