BigTV English

Whatsapp Updates 2024: వాట్సాప్ లో ఈ అప్డేట్స్ తెలుసా.. నెంబర్ సేవ్ చేయకుండానే సందేశాలు పంపేయండిలా!

Whatsapp Updates 2024: వాట్సాప్ లో ఈ అప్డేట్స్ తెలుసా.. నెంబర్ సేవ్ చేయకుండానే సందేశాలు పంపేయండిలా!

Whatsapp Updates 2024: సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు యూజర్స్ కోసం ప్రత్యేక ఫీచర్స్ ను తీసుకొస్తూ ఉంటుంది. లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు అదిరిపోయే టెక్నాలజీని సైతం అందుబాటులో ఉంచుతుంది. ఈ అప్డేట్స్ యాప్ వినియోగాన్ని మెరుగుపరచడమే కాకుండా యూజర్ అనుభవాన్ని సైతం మెరుగుపరుస్తాయి. ఇక వాట్సాప్ ను రెగ్యులర్ గా వాడే యూజర్స్ కు సైతం తెలియని ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. వాట్సాప్ లో కాంటాక్ట్ ను సేవ్ చేయకుండా మెసేజ్ ను పంపించంటం, డిలీట్ అయిపోయిన చాట్ ను రీస్టోర్ చేయటం చాలా ఈజీ.


వాట్సాప్ లో లేటెస్ట్ అప్డేట్స్ ఎన్ని వస్తున్నా ఎవరికైనా మెసేజ్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ను సేవ్ చేయాల్సిందే. కొత్తవారికి సందేశాలు పంపించాలంటే కాంటాక్ట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ఓ స్పెషల్ అప్డేట్ తో కాంటాక్ట్ లేకపోయినా ఏ నెంబర్ కైనా తేలిగ్గా మెసేజ్లు పంపించే అవకాశం ఉంది.

కాంటాక్ట్స్ సేవ్ చేయకుండానే మెసేజ్ పంపాలంటే –
వాట్సాప్ ను ఓపెన్ చేయాలి
ఐఫోన్ యూజర్స్ పైన ప్లస్ సింబల్ ను క్లిక్ చేయాలి
ఆండ్రాయిడ్ యూజర్స్ కింద ఉన్న ప్లస్ ను క్లిక్ చేయాలి
మెసేజ్ చేయాలనుకునే మొబైల్ నంబర్‌ను కాపీ చేయాలి
సర్చ్ కాంటాక్ట్‌పై క్లిక్ చేసి నంబర్‌ని పేస్ట్ చేయాలి
ఆ నంబర్‌ కు వాట్సప్ అకౌంట్ ఉంటే చాట్ ఆప్షన్ కనిపిస్తుంది
క్లిక్ చేసి ఫైల్స్, ఫొటోలు తదితర సమాచారాన్ని షేర్ చేసుకోవచ్చు


వాట్సాప్ బ్రౌజర్ ను సైతం ఉపయోగించి నెంబర్ సేవ్ చేయకుండా సందేశాలు పంపే అవకాశం ఉంటుంది. వాట్సాప్ లింక్ ను అడ్రస్ బార్‌లో కాపీ చేసి పేస్ట్ చేయాలి. సందేశాన్ని మెుబైల్ నెంబర్ తో జోడించి.. నెంబర్ ముందు లింక్ ను యాడ్ చేయాలి. ఎంటర్  పై క్లిక్ చేసి చాటింగ్ ప్రారంభించవచ్చు.

ALSO READ : వాచ్ ఏంటి భయ్యా ఇంత ఉంది.. ఫీచర్స్ మాత్రం అదుర్స్.. రేట్ ఎంత అంటే?

వాట్సాప్ లో డిలీటెడ్ మెసేజ్లు తిరిగి పొందాలంటే –
డివైజ్ లో సెట్టింగ్స్ కి వెళ్లి స్క్రోల్ చేసి యాప్స్ అండ్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి
నోటిఫికేషన్ ఆప్షన్ను క్లిక్ చేయాలి
ఆప్షన్ కింద నోటిఫికేషన్ హిస్టరీ పై టాప్ చేయాలి
యూజ్ నోటిఫికేషన్ హిస్టరీ పక్కన ఉన్న బటన్ ను టోగుల్ చేయాలి
ఆపై నోటిఫికేషన్ హిస్టరీని ఆన్ చేస్తే డిలీట్ అయిపోయిన మెసేజ్లను సైతం చదవచ్చు

సాధారణంగా వాట్సప్ డేటాను ఎప్పటికప్పుడు బ్యాకప్ చేస్తూ ఉండటం వల్ల చాట్ తిరిగి పొందొచ్చు. వాట్సప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి చాట్ క్లిక్ చేసి చాట్ బ్యాక్ అప్ లోకి వెళ్లి డిలీట్ అయిన మెసేజ్లను తిరిగి పొందేందుకు ప్రయత్నించవచ్చు. ఇక యాప్ ను డిలీట్ చేసి మళ్ళీ లాగిన్ చేస్తే బ్యాకప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో థర్డ్ పార్టీ ఆప్షన్స్ సేఫ్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది.  ఈ ఆప్షన్ ఆండ్రాయిడ్ వాడే యూజర్స్ కు మాత్రమే ఉంటుంది. ఐఫోన్ వాడే యూజర్స్ కు ప్రత్యేక పర్మిషన్స్ ఉండటంతో చాలా వరకూ ఆప్డేట్స్ పై రిస్ట్రిక్షన్స్ ఉంటాయి.

Related News

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Big Stories

×