BigTV English

Bigg Boss Prerana: ‘బిగ్ బాస్’ ప్రేరణ ప్రేమకథ.. పాపం ఇంత బాధ భరించిందా!

Bigg Boss Prerana: ‘బిగ్ బాస్’ ప్రేరణ ప్రేమకథ.. పాపం ఇంత బాధ భరించిందా!

Bigg Boss Prerana Love Story: బిగ్ బాస్ సీజన్ 8లోకి 14 మంది సెలబ్రిటీస్.. కంటెస్టెంట్స్‌గా ఎంటర్ అయ్యారు. కానీ అందులో చాలామంది గురించి ప్రేక్షకులకు తెలియదు. ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎక్కువమంది సీరియల్ ఆర్టిస్టులే కంటెస్టెంట్స్‌గా వచ్చారని బుల్లితెరను ఫాలో అయ్యే ఆడియన్స్‌కు అర్థమయ్యింది. అలా బిగ్ బాస్ 8లోని కంటెస్టెంట్స్‌లో ఒకరిగా హౌస్‌లోకి ఎంటర్ అయ్యింది ప్రేరణ కంభం. కన్నడలో సీరియల్ ఆర్టిస్ట్‌గా పరిచయమయినా తెలుగులో కూడా ప్రేరణకు మంచి పాపులారిటీ ఉంది. తెలుగులో కంటే ముందు కన్నడ బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లిన ప్రేరణ.. అక్కడ తన లవ్ స్టోరీ చెప్పుకొని బాధపడింది.


వీడియో వైరల్

బిగ్ బాస్ రియాలిటీ షో అనేది కేవలం తెలుగులో మాత్రమే కాదు.. దాదాపు ప్రతీ ఇండియన్ భాషలో ఉంది. కన్నడలో కూడా బిగ్ బాస్ రియాలిటీ షో రన్ అవుతోంది. 2021లో కన్నడలో బిగ్ బాస్‌కు సంబంధించిన ఒక మినీ సీజన్ నడిచింది. అందులో ప్రేరణ కంటెస్టెంట్‌గా ఎంటర్ అయ్యింది. అక్కడ తన తోటి కంటెస్టెంట్స్‌తో తన ప్రేమకథ గురించి చెప్పుకొని చాలా ఎమోషనల్ అయ్యింది. 2023లో ప్రేరణకు పెళ్లి అయిపోయింది. కానీ 2021లో తను తన మునుపటి ప్రేమకథ గురించి చెప్పుకున్న వీడియో మాత్రం ఇన్నాళ్లకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన తన ఫ్యాన్స్.. ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.


Also Read: సోనియా ఆకుల నాలుగు వారాలకు ఎన్ని లక్షలు తీసుకుందంటే..?

బ్రేకప్ తర్వాత డిప్రెషన్

తను బీటెక్‌లో ఉన్నప్పుడే ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డానని, రెండేళ్ల పాటు తననే పిచ్చిగా ప్రేమించానని కన్నడ బిగ్ బాస్‌లో చెప్పుకొచ్చింది ప్రేరణ. ఆ తర్వాత తనకు యాక్టింగ్ ఛాన్సులు వచ్చాయని, ఆ అబ్బాయికి తను యాక్టింగ్ చేయడం ఇష్టం లేక వదిలేయమని చెప్పాడని గుర్తుచేసుకుంది. యాక్టింగ్ వదిలేయను అని తేల్చి చెప్పడంతో తనతో బ్రేకప్ అయ్యింది అని చెప్పింది. బ్రేకప్ అయినా కూడా ఆ అబ్బాయిని మర్చిపోలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని బయటపెట్టింది. ఆ డిప్రెషన్ వల్ల తన తల్లిదండ్రులను దూరం పెట్టడం, వారిపై కోప్పడడం చేశానని చెప్తూ ఎమోషనల్ అయ్యింది. అలా ఒకానొక సందర్భంలో తన తల్లి తన కాళ్లు పట్టుకుందని గుర్తుచేసుకుంటూ ఏడ్చేసింది ప్రేరణ.

మరో ప్రేమ పెళ్లి

మొత్తానికి ఒక ప్రేమకథ నుండి బయటికొచ్చిన ప్రేరణ.. వెంటనే తన ప్రొఫెషనల్ లైఫ్‌పై ఫోకస్ చేసింది. బ్యాక్ టు బ్యాక్ కన్నడ సీరియల్స్‌లో హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకుంది. అంతే కాకుండా పలు సినిమాల్లో కూడా నటించింది. అలా మెల్లగా తెలుగు బుల్లితెరపై కూడా అడుగుపెట్టి ఇక్కడ కూడా సక్సెస్ అయ్యింది ప్రేరణ కంభం. ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కంటెస్టెంట్‌గా కూడా ఛాన్స్ కొట్టేసింది. 2023లో సుందరి శ్రీపాద్ అనే వ్యక్తితో మళ్లీ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది ప్రేరణ. వీరిద్దరి పెళ్లి కేవలం బంధుమిత్రుల సమక్షంలో సింపుల్‌గా జరిగిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా ప్రేరణ ఆటతీరు చాలామందిని ఆకట్టుకుంటోంది.

Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×