Emojis: ప్రస్తుత జనరేషన్ వాళ్లకి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ గురించి తెలిసే ఉంటుంది. ఎవరితోనైనా చాట్ చేస్తున్నప్పుడు.. మన భావోద్వేగాలను తెలియజేయటానికి కొన్నిసార్లు పదాలకు బదులుగా ఎమోజీలనే ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అయితే, ఎమోజీలు ఎందుకు పసుపు రంగులోనే ఉంటాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వాట్సాప్‌లో 800 కంటే ఎక్కువ ఎమోజీలు ఉన్నాయి. ఇవి విభిన్న భావోద్వేగాలకు సంబంధించినవి. ఎమోజీలు పసుపు రంగులోనే ఎందుకుంటాయో ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.
ఎమోజీలు అంటే.. మన భావాలను వ్యక్తపరిచేందుకు ఉపయోగించే ముఖాలు. మొట్టమొదటి సారిగా.. పసుపు రంగుతో ఉన్న స్మైలీ ఫేస్ 1960లో తయారు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రంగు కొనసాగుతోంది. అయితే, ఎల్లో కలర్‌లోనే కొనసాగించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. పసుపు రంగు చూస్తే మనకో మంచి ఫీల్ వస్తుంది. ఇది సంతోషాన్ని, ఉత్సాహాన్ని సూచించే రంగు. అందుకే ఎమోజీల్లో ఈ రంగును ఎక్కువగా వాడుతారు.
సోషల్ మీడియాలో వాడే ఎమోజీలు అన్ని వయసుల వారికి అర్థమయ్యేలా ఉండాలి. పసుపు రంగు న్యూట్రల్‌గా ఉంటుంది. ఇది ఎవరినీ ప్రత్యేకంగా చూపదు. అందుకే
ఈ రంగును సెలెక్ట్ చేశారట. ఎమోజీలు మన ముఖ భావాలను చూపించాలి కానీ, నేరుగా చర్మం రంగును సూచించకూడదు. అందుకే పసుపు రంగు ఎంపిక చేశారు.. ఇది నిజానికి ఎవరి స్కిన్ టోన్‌కి సంబంధం లేని రంగు. ఇక ఎల్లో కలర్ స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్ స్క్రీన్‌లపై చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి.. అన్ని డివైస్‌లలోనూ ఎమోజీలు చక్కగా కనిపించేందుకు ఇదే రంగు ఉపయోగిస్తున్నారు.
ఒకరితో ఒకరు పంచుకునే ఎమోజీలు చిన్నవైనా మన భావాలను పెద్దగా చెప్పగలిగే పటాలు. ఈ ఎమోజీస్ ఎలాంటి మాటలు లేకుండానే మన భావోద్వేగాలను వ్యక్తపరిచే సాధనాలుగా మారిపోయాయి. ఇకపై మీరు ఏదైనా పసుపు రంగు స్మైలీ ఉపయోగించినప్పుడు.. దాని వెనుక ఉన్న చిన్న కథను గుర్తు చేసుకుంటే.. మీ మొహం మీద చిన్న నవ్వు కనిపిస్తుంది.