Elon Musk Photo To AI Video Grok4| బిజెనెస్, టెక్నాలజీ రంగాల్లో తరుచూ సంచలన ట్వీట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు ప్రపంచంలోనే అత్యంత ధనికుడు ఎలాన్ మస్క్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన చేసిన ఒక ట్వీట్ బాగా వైరల్ అవుతోంది. ఆ ట్వీట్ లో ఆయన ఒక ఫొటోను వీడియోగా మార్చేసే సింపుల్ ట్రిక్ ను చూపించాడు. అది కూడా మస్క్ కు చెందిన గ్రోక్ ఏఐతో తయారు చేసిందని ట్వీట్ లో తెలిపారు.
ఎలాన్ మస్క్ ఇటీవల ఒక అద్భుతమైన AI ఫీచర్‌ను పరిచయం చేశాడు. ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం Xలో ఈ విషయాన్ని ప్రకటించాడు. ఈ ఫీచర్‌తో ఏ ఫోటోనైనా ఒక్క ప్రాంప్ట్‌తో వీడియోగా మార్చవచ్చు. ఏ విషయాన్నైనా వివరిస్తూ ఒక వీడియో తయారు చేయవచ్చు. టెస్లా ఓనర్ అయిన మస్క్ ఈ వీకెండ్‌లోనే ఈ ఫీచర్‌ను ఎక్స్ ద్వారా ప్రపంచానికి షేర్ చేసి.. ఇది సూపర్ సింపుల్ అని చెప్పాడు.
చాలా సులభం. ఏ ఫోటో మీదైనా లాంగ్ ప్రెస్ చేయండి. తర్వాత ఒక చిన్న ప్రాంప్ట్ రాయండి. వీడియోలో ఏమి చూపించాలో చెప్పండి. AI అక్కడి నుంచి పని మొదలుపెడుతుంది. మీరు రాసిన ప్రాంప్ట్ ప్రకారం ఫోటోను యానిమేటెడ్ వీడియోగా మారుస్తుంది. ఫలితం మీ ఊహకు మించినది ఉంటుంది. అంటే మీరు ఆశ్చర్య పోవడం ఖాయమని చెబుతూ.. ఎలాన్ మస్క్ స్వయంగా దీని డెమో చేశాడు.
మస్క్ తన డెమోలో ఒక జంట ఫోటో తీసుకున్నాడు. “ఈ జంటను మప్పెట్స్‌గా మార్చు” అని ప్రాంప్ట్ ఇచ్చాడు. AI ఆ ఫోటోను మప్పెట్స్ స్టైల్‌లో యానిమేటెడ్ వీడియోగా మార్చింది. ఆ వీడియో క్లిప్‌ను Xలో పోస్ట్ చేశాడు. క్షణాల్లోనే అది వైరల్ అయింది. AI ఎంత శక్తివంతంగా ఉందో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. స్థిరంగా ఉన్న ఒక చిత్రాన్ని డైనమిక్ వీడియోగా మార్చడం అద్భుతంగా ఉంటుందని మస్క్ చూపించాడు.
గ్రోక్ AIలోని ఒక పవర్ ఫీచర్ ద్వారా ఇది సాధ్యమైంది. గ్రోక్ అనేది మస్క్ కంపెనీ xAI తయారు చేసిన సాఫ్ట్‌వేర్. ఇది ఫోటోను విశ్లేషిస్తుంది. తర్వాత యానిమేషన్ జోడించి, సజీవంగా కదిలే వీడియోను సృష్టిస్తుంది. గ్రోక్ కొత్త వెర్షన్ గ్రోక్ 4 లో వస్తున్న కొత్త క్రియేటివ్ ఫీచర్లలో ఇది ఒకటి. గ్రోక్ ఇప్పుడు మరిన్ని క్రియేటివ్ టూల్స్‌ను అందిస్తోంది.
గ్రోక్‌లో ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. రాయడంలో సహాయం చేస్తుంది. కొత్త ఇమేజ్‌లు జనరేట్ చేస్తుంది. రియల్ టైమ్ డేటా అందిస్తుంది. వీటన్నింటితో వివిధ రకాల కంటెంట్ సృష్టించవచ్చు. గ్రోక్ ఒక పూర్తి క్రియేటివ్ అసిస్టెంట్‌లా పనిచేస్తుంది. మీ ఆలోచనలను సజీవం చేస్తుంది.
మరో విషయమేమిటంటే.. గ్రోక్ 1 ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉచితం! X ప్లాట్‌ఫాం ద్వారా ఉపయోగించవచ్చు. ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్‌లు కూడా ఉన్నాయి. భారతదేశంలోని వినియోగదారులు కూడా ఈ సేవను ఉపయోగించవచ్చు.
గ్రోక్ 4 కొత్త టూల్‌తో ఫోటోలకు జీవం పోయవచ్చు. స్నేహితులతో షేర్ చేసుకోవడం, కంటెంట్ క్రియేట్ చేయడం సరదాగా మారుతుంది. ఎలాన్ మస్క్ షేర్ చేసిన ఈ మ్యాజిక్ ట్రిక్‌ను మీరూ ప్రయత్నించండి. Xలో గ్రోక్‌ను ఓపెన్ చేసి, ఒక ఫోటో మీద లాంగ్ ప్రెస్ చేయండి. మీ ఐడియాను ప్రాంప్ట్‌లో రాయండి. సెకన్లలో మీకు కావల్సిన వీడియో రెడీ!
Also Read: ఉద్యోగం కోసం మంచి రెజ్యూం కావాలా.. ఈ ఫ్రీ ఏఐ టూల్స్‌తో తయారు చేయడం ఈజీ