BigTV English
Advertisement

Perplexity Browser: ఇక ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ కామెట్ బ్రౌజర్.. గూగుల్‌కు చెమటలు పట్టిస్తోన్న పర్‌ ప్లెక్సిటీ!

Perplexity Browser: ఇక ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ కామెట్ బ్రౌజర్.. గూగుల్‌కు చెమటలు పట్టిస్తోన్న పర్‌ ప్లెక్సిటీ!

అమెరికాకు చెందిన AI స్టార్టప్‌ పర్‌ ప్లెక్సిటీ.. ఆర్టిఫీషియల్ రంగంలో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో విండోస్, మాక్ డెస్క్ టాప్ వెర్షన్ కు సంబంధించిన కామెట్ బ్రౌజర్ ను అందుబాటులోకి తీసుకురాగా, ఇప్పుడు ఆండ్రాయిడ్ వెర్షెన్ ను పరిచయం చేయబోతోంది. ఇప్పటికే పర్‌ ప్లెక్సిటీ  AI తన ఆండ్రాయిడ్ వెర్షన్ బ్రౌజర్ కు సంబంధించి ఇన్విటేషన్స్ పంపడం ప్రారంభించింది. త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది.


పర్‌ ప్లెక్సిటీ ఆండ్రాయిడ్ బ్రౌజర్ వారికే ఫస్ట్!    

పర్‌ ప్లెక్సిటీ వ్యవస్థాపకుడు అరవింద్ శ్రీనివాస్ ఆండ్రాయిడ్ వెర్షన్ కామెంట్ బ్రౌజర్ కు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. ఈ బ్రౌజర్ కు సంబంధించి కొంత మందికి ఇన్విటేషన్లు పంపించినట్లు తెలిపారు. ప్రస్తుతం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. AI-ఆధారిత బ్రౌజర్ కోసం ఆసక్తి ఉన్న వినియోగదారులు Google Play స్టోర్ లేదంటే కామెట్ బ్రౌజర్ వెబ్‌ సైట్‌ కు వెళ్లవచ్చన్నారు. కామెట్ బ్రౌజర్ కు సంబంధించిన ప్రయోజనాలను పర్‌ ప్లెక్సిటీకి డబ్బులు చెల్లించే కస్టమర్లు తొలుత పొందుతారని శ్రీనివాస్ వెల్లడించారు. “కామెట్ ఆండ్రాయిడ్ వెర్షన్ కు సంబంధించి ముందస్తు ఆహ్వానాలు వస్తున్నాయి. మరిన్ని ఆహ్వానాలు త్వరలో ప్రారంభం అవుతాయి” అని శ్రీనివాస్ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

గూగుల్ ఆధిపత్యానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా..  

​ప్రస్తుతం PC మార్కెట్‌ తో పాటు ఆండ్రాయిడ్ బ్రౌజర్ మార్కెట్‌ లో కూడా గూగుల్ క్రోమ్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. సిమిలర్‌ వెబ్ డేటా ప్రకారం.. మొబైల్ బ్రౌజర్ మార్కెట్‌ లో క్రోమ్ 60.45% మార్కెట్ వాటాను కలిగి ఉంది. తర్వాత సఫారీ 31.22%, శామ్‌ సంగ్ ఇంటర్నెట్ 4.98%, ఒపెరా 1.13%, ఫైర్‌ ఫాక్స్ 0.38% ఉన్నాయి. అయితే, పర్‌ ప్లెక్సిటీ AI ప్రధాన విభాగాలలో గూగుల్ ఆధిపత్యాన్ని కట్టడి చేయాలని ప్రయత్నిస్తోంది. కంపెనీ ఇప్పటికే గూగుల్ సెర్చ్‌ తో నేరుగా పోటీపడే AI ఆధారిత సెర్చ్ అసిస్టెంట్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు కామెట్ బ్రౌజర్‌ తో, పర్‌ ప్లెక్సిటీ AI శక్తిని ఉపయోగించి వినియోగదారులను క్రోమ్ నుంచి తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.


పర్‌ ప్లెక్సిటీ AI బ్రౌజర్ గురించి..

కామెట్ అనేది ఒక ఏజెంట్ AI బ్రౌజర్. ఇది వినియోగదారులకు సంబందించిన కంటెంట్‌ ను సేకరించడం, మీటింగ్స్ ను బుక్ చేయడం, ఇమెయిల్స్ పంపడం, ప్రొడక్టులను  పోల్చడం, ఫారమ్‌ లను ఫిల్ చేయడం, హోటళ్లను బుక్ చేయడం లాంటి మల్టీ టాస్క్ లను చేస్తుంది.

పర్‌ ప్లెక్సిటీ ఏజెంట్ AI  బ్రౌజర్ తో సమస్యలు

​పర్‌ ప్లెక్సిటీ AI బ్రౌజర్‌ తో కలిగే లాభాలను ప్రచారం చేసుకుంటుండగా, ప్రత్యర్థి బ్రౌజర్ బ్రేవ్ పరిశోధకులు ఏజెంట్ AI బ్రౌజర్‌ తో కలిగే భద్రతా లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ AI బ్రౌజర్‌ ఇంజెక్షన్ దాడులను ప్రాంప్ట్ చేసే అవకాశం ఉందని వెల్లడించింది. హ్యాకర్లు వెబ్‌ పేజీలో కనిపించని టెక్స్ట్‌ లో ఆదేశాలను దాచే అవకాశం ఉందన్నారు. ఇమెయిల్స్ ను పంపడం, వినియోగదారు బ్యాంక్ ఖాతాను యాక్సెస్ చేయడం, ఇతర సున్నితమైన వివరాలను యాక్సెస్ చేయడం లాంటివి కొనసాగే అవకాశం ఉందన్నారు.

Read Also: ముఖం మీద ఫోన్ పడేసుకుంటున్నారా? ఇదిగో జపాన్ గ్యాడ్జెట్, మీ ఫేస్ ఇక భద్రం!

Related News

Dark Earth: రాసి పెట్టుకోండి.. ఆ రోజు భూమి మొత్తం చీకటైపోతుంది, ఇంకెతో టైమ్ లేదు!

Money saving tips: ఖర్చులు తగ్గించుకుని, డబ్బులు ఆదా చేయాలా? ఈ యాప్స్ మీ కోసమే, ట్రై చేయండి!

Motorola Edge 60 5G Sale: అమేజింగ్ ఆఫర్స్ తమ్ముడూ.. మోటరోలా 5G ఫోన్‌ కొనడానికి ఇదే బెస్ట్ ఛాన్స్!

Elon Musk Photo To Video: ఒక్క క్లిక్‌తో ఫోటోను వీడియోగా మార్చేసే ట్రిక్.. ఎలాన్ మస్క్ ట్విట్ వైరల్

Emojis: ఎప్పుడైనా ఆలోచించారా.. ఎమోజీలు పసుపు రంగులోనే ఎందుకుంటాయో?

Japanese Helmet: ముఖం మీద ఫోన్ పడేసుకుంటున్నారా? ఇదిగో జపాన్ గ్యాడ్జెట్, మీ ఫేస్ ఇక భద్రం!

APK Files: ఏదైనా లింక్ చివరన apk అని ఉంటే.. అస్సలు ఓపెన్ చేయొద్దు, పొరపాటున అలా చేశారో..

Big Stories

×