Virat Kohli Restaurant: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ( ViratKohli ) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అద్భుతమైన ఆట తీరుతో టీమ్ ఇండియాకు ఎన్నో విజయాలను అందించాడు. ఒకానొక సమయంలో కోహ్లీ కెప్టెన్ గా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం కోహ్లీ టెస్టులు, t20 లకు రిటైర్మెంట్ ప్రకటించారు. కేవలం వన్డేలు, ఐపీఎల్ మ్యాచ్లను మాత్రమే ఆడనున్నారు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్ లో ( London) తన ఫ్యామిలీతో కలిసి సెటిల్ అయ్యారు. మ్యాచ్ లు ఉన్న సమయంలో తిరిగి వచ్చి, మ్యాచ్ పూర్తయిన అనంతరం తిరిగి మళ్లీ లండన్ కు బయలుదేరుతున్నారు. కోహ్లీ పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తారు. అంతే కాకుండా యాడ్ షూట్స్ లలోను యాక్టివ్ గా పాల్గొంటారు. కోహ్లీ గోవాలో రెస్టారెంట్ ను ఓపెన్ చేసినట్లుగా ఓ వార్త వైరల్ గా మారింది.
Also Read: IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్, ఐపీఎల్ 2026 రిటెన్షన్ ఎప్పుడంటే?
కోహ్లీకి వన్ 8 కమ్యూన్ పేరుతో రెస్టారెంట్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెస్టారెంట్లను కోహ్లీ హైదరాబాద్, బెంగళూరు, ముంబై లాంటి ప్రముఖ నగరాలలో నిర్వహిస్తున్నారు. ఇక తాజాగా కోహ్లీ వన్ 8 కమ్యూన్ పేరుతో రెస్టారెంట్ ను గోవాలో కూడా ప్రారంభించాడు. నవంబర్ 5వ తేదీనే గోవాలో రెస్టారెంట్ ఓపెన్ చేశాడు కోహ్లీ. గోవాలోని శియోలిమ్ సమీపంలోని చపోరా నది ఒడ్డిన ఈ రెస్టారెంట్ ఓపెన్ చేశాడు కోహ్లీ. ఇక కోహ్లీకి చెందిన వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్ లో వంటకాల ధరలు భారీగా ఉంటాయి. ఇందులో భోజనం చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. అయితే గతంలో ఈ రెస్టారెంట్లో అత్యధికంగా ధరలు ఉన్నాయని ఓ వార్త కూడా హాట్ టాపిక్ గానే మారింది. ఇప్పుడు గోవాలో కోహ్లీ హోటల్ పెట్టేశారు. మరి గోవాలో హోటల్ ధరలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్ లో ( one8 commune restaurant) డబల్ బెడ్ రూమ్ ధర ఒక రోజుకు RS. 1500గా ఉంది. త్రీ బెడ్ రూమ్ ధర RS. 2500 ఒక రోజుకు పెట్టారు. వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్ లో ( one8 commune restaurant Prices) వంటకాల ధరలు సాధారణంగానే ఉన్నాయి. తందూరి రోటి ధర 118 రూపాయలు, స్టీమ్డ్ రైస్ 318 రూపాయలు, సాల్టెడ్ రైస్ 348 రూపాయలు, దం లాంబ్ బిర్యానీ 978 రూపాయల పైనే ఉంది. లాంబ్ షాంక్ ధర RS. 2,318 రూపాయలుగా నిర్వహించారు. ఇక తాజాగా గోవాలో ప్రారంభించిన హోటల్ కం రెస్టారెంట్ లో కూడా ఇవే ధరలు కొనసాగనున్నాయి.