BigTV English
Advertisement

RT 76: భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటున్న రవితేజ.. టైటిల్ పోస్టర్ రిలీజ్!

RT 76: భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటున్న రవితేజ.. టైటిల్ పోస్టర్ రిలీజ్!

RT 76: మాస్ మహారాజా రవితేజ(Ravi teja) హీరోగా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా ఈయన మాస్ జాతర(Mass Jathara) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది అయితే సంక్రాంతి బరిలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మాస్ హీరో సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈయన తన 76వ సినిమాని కిషోర్ తిరుమల(Kishore Tirumala) దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజకు జోడిగా ఆశికా రంగనాథ్, డింపుల్ హయతి నటిస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తున్నారు.


భర్త మహాశయులకు విజ్ఞప్తి..

తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు “భర్త మహాశయులకు విజ్ఞప్తి” (Bhartha Mahasayulaku Wignyapthi)అనే టైటిల్ పెట్టబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే చివరికి ఇదే టైటిల్లో ఖరారు చేస్తూ చిత్ర బృందం తాజాగా టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక ఈ సినిమా ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరి మాస్ జాతర సినిమాతో ప్రేక్షకులను మెప్పించ లేకపోయిన రవితేజ “భర్త మహాశయులకు విజ్ఞప్తి” సినిమాతో ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటారు తెలియాల్సి ఉంది. తాజాగా విడుదల చేసిన గ్లింప్ వీడియో చూస్తుంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

సంక్రాంతి బరిలోనే భర్త మహాశయులకు విజ్ఞప్తి..

ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్ వీడియో కనుక చూస్తుంటే ఇద్దరూ అమ్మాయిల మధ్యలో రవితేజ ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారనే విషయాలను ఈ వీడియో ద్వారా చూపించారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య, మురళీధర్ గౌడ్ వంటి తదితరులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని వెల్లడించారు అయితే విడుదల తేదీ గురించి స్పష్టత ఇవ్వాల్సి ఉంది.


డిజిటల్ హక్కుల వారికే..

ఇక ఈ సినిమా సంక్రాంతి బరిలో రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా డిజిటల్ హక్కులకు సంబంధించిన వార్తలు కూడా వైరల్ అవుతున్న ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ సంస్థ జీ గ్రూప్ (ZEE Group) సొంతం చేసుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం, జీ గ్రూప్ మంచి మొత్తంలో డీల్ క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల వ్యవధిలోని డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే విధంగా డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాకు భీమ్స్ సెసిరోలియో సంగీతాన్ని అందించబోతున్న సంగతి తెలిసిందే.

Also Read: Rashmika: లైఫ్ పార్టనర్ లో ఈక్వాలిటీస్ ఉండాల్సిందే… విజయ్ పర్ఫెక్ట్ అంటున్న రష్మిక!

Related News

Actor Dharmendra: నటుడు ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి విషమం…వెంటిలేటర్ పై చికిత్స!

Telugu Producer : బిగ్ స్కాం… ఓటీటీ సంస్థను చీట్ చేసిన తెలుగు నిర్మాత?

Rashmika: లైఫ్ పార్టనర్ లో ఈక్వాలిటీస్ ఉండాల్సిందే… విజయ్ పర్ఫెక్ట్ అంటున్న రష్మిక!

Allu Shirish: మెడలో నగలు.. ట్రోల్స్ పై రియాక్ట్ అయిన శిరీష్.. హర్ట్ అయినట్టున్నాడే?

Rashmika: ఆ డైరెక్టర్లు అయితే డార్క్ సీన్స్ అయినా ఓకే అంటున్న రష్మిక..ఎవరా నలుగురు?

Actor Death: ఆర్థిక సహాయం కోసం ఎదురుచూసి నటుడు మృతి.. ఏమైందంటే?

Film industry: హీరోయిన్లతో నటుడు రాసలీలలు… ఎవరితో నడిపించాడో తెలుసు అంటున్న భార్య

Big Stories

×