Hyderabad: దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న భారీ కుట్రను ఆదివారం నాడు గుజరాత్ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) భగ్నం చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఒకరు రాజేంద్రనగర్‌లో డాక్టర్ గా చలామణీ కావడం కలకలం రేపింది. అరెస్టయిన ముగ్గురినీ గుజరాత్ పోలీసులు అహ్మదాబాద్‌కు తరలించారు. స్థానిక కోర్టు సయ్యద్‌ను నవంబర్ 17 వరకు ATS కస్టడీకి పంపింది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడు రాజేంద్రనగర్ పరిధిలోని ఫోర్ట్ వ్యూ కాలనీకి చెందిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్‌గా గుర్తించారు. చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన మొహియుద్దీన్, పెద్ద మొత్తంలో విధ్వంసం సృష్టించేందుకు రైసిన్ అనే విష పదార్థాన్ని తయారుచేసినట్లు సమాచారం. ఆముదం గింజలను ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థాల నుంచి రైసిన్ను తయారుచేసి, దాన్ని ప్రజలపై ప్రయోగించేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO: New Aadhaar App: కొత్త ఆధార్ యాప్ వచ్చేసిందోచ్.. ఇకపై అన్నీ అందులోనే, ఆ భయం అవసరం లేదు
ప్రమాదకరమైన రైసీన్ ను ఎక్కవు మొత్తంలో పీల్చినా, ఆహారం లేదా నీటి ద్వారా తీసుకున్నా ప్రాణాలు పోయే ప్రమాదముంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పదార్థాన్ని తీసుకున్నా, పీల్చినా లేదా ఇంజెక్ట్ చేసినా దానికి విరుగుడు ఉండదు. చర్మ సంరక్షణ, వివిధ వాణిజ్య ఉత్పత్తులలో ఉపయోగించే ఆముదం నూనెలో ఈ విషం ఉండదని పేర్కొన్నారు.
మొహియినుద్దీన్ నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌కేపీ (ISKP) సభ్యులతో టెలిగ్రామ్ యాప్ ద్వారా నిరంతరం సంబంధాలు కొనసాగిస్తున్నట్లు ఏటీఎస్ దర్యాప్తులో వెల్లడైంది.మొహియుద్దీన్ అరెస్ట్ తరువాత షామ్లికి చెందిన దర్జీ ఆజాద్ సులేమాన్ షేక్ (20), లఖింపూర్ ఖేరికి చెందిన విద్యార్థి మహ్మద్ సుహైల్ మొహమ్మద్ సలీమ్ ఖాన్ (23) లను ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.