ఈ రోజుల్లో ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో భాగం అయ్యింది. ఏం లేకపోయినా ఫర్వాలేదు. కానీ, చేతిలో క్షణం స్మార్ట్ ఫోన్ లేకపోతే అస్సలు ఉండలేకపోతున్నారు జనాలు. సోషల్ మీడియా చూడ్డం. మెసేజ్ లు చేసుకోవడం, కాల్స్ మాట్లాడుకోవడం, ఫోటోలు తీసుకోవడం లాంటి ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కొంత మంది పడుకునే ముందుకు కూడా ఫోన్ చూసి.. చూసి నిద్రపోతారు. అయితే.. పడుకునే ముందుకు ఫోన్ చూసే సమయంలో చాలా మందికి ఎదురయ్యే చిరాకు కలిగించే విషయం, చేతిలో నుంచి జారి ముఖం మీద పడటం. ఒక్కసారిగా అలా పడగానే ముఖం మీద గట్టి దెబ్బ తగిలి విలవిలాడిపోతారు. ఈ సమస్యకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేశారు జపనీస్ సైంటిస్టులు. ఇంతకీ వాళ్లు ఏం చేశారంటే..
రాత్రిపూట పడుకునే ముందు ఫోన్ చూసే సమయంలో ఎప్పుడో ఒకసారి ముఖం మీద పడిన ఎక్స్ పీరియెన్స్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటుంది. ఆ ఘటన నిజంగా ప్రతి ఒక్కరికి బాధ కలిగిస్తుంది. కన్ను, మూతి, ముక్కు మీద పడి గాయాలు కూడా అవుతాయి. ఇకపై అలాంటి సమస్యకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు జపనీస్ పరిశోధకులు. ఫోన్ కింద పడినా ముఖాన్ని రక్షించే హెల్మెట్ ను తయారు చేశారు. రీసెంట్ గా ఈ హెల్మెట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ హెల్మెట్ చేతిలో నుంచి ఫోన్ పడే విషయాన్ని గుర్తించి ముఖాన్ని కవర్ చేస్తుంది. ఫోన్, ఆ హెల్మెట్ కు తగిలి పక్కన పడిపోతుంది. ముఖానికి ఎలాంటి ఇబ్బంది కలగదు.
ఈ హెల్మెట్ అనేది అనేది రెండు 1.5 ఫీట్ల ఎత్తులో పోల్స్ ఉంటాయి. ఈ రెండు ఫోల్స్ మధ్యలో హెల్మెట్ ఉంది. ఫోల్స్ చివరలో సెన్సార్లు ఉంటాయి. చేతిలో ఉన్న ఫోన్ జారిపడగానే ఆ సెన్సార్స్ గుర్తిస్తాయి. వెంటనే తలను హెల్మెట్ కవర్ చేస్తుంది. ఆ ఫోన్ హెల్మెట్ మీద పడిపోతుంది. ఈ హెల్మెట్ కారణంగా ముఖానికి ఎలాంటి గాయాలు కావు. మూతి, ముక్కు లాంటివి పగలవు. సేఫ్ గా ఉండొచ్చు.
Read Also: పండ్లు, కూరగాయల మీద పండించిన రైతుల ఫోటో.. ఎంత మంచి నిర్ణయమో!
ఈ క్రేజీ హెల్మెట్ ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. “ఈ హెల్మెట్ తయారు చేసిన వ్యక్తి ఎన్నిసార్లు ఫోన్ ముఖం మీద పడేసుకుని ఉంటాడో?” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “జపాన్ లో రోజువారీ సమస్యలకు అసాధారణ పరిష్కారం కనుగొనడంలో పరిశోధకులు ముందుంటారు. నిజంగా వాళ్లు గ్రేట్” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. మొత్తంగా ఈ హెల్మెట్ గురించి మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Read Also: వర్షంలో కుప్పకూలిన అమెరికా అమ్మాయికి ఇండియన్ కుర్రాడు సాయం.. నెటిజన్స్ ఫిదా!