Indira Mahila Shakti Sarees: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేని విధంగా బిజీబిజీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళ శక్తి ద్వారా చీరల పంపిణికి సిద్దం అయ్యింది. అర్డర్లు అన్నీ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తయారు అయ్యి ఇప్పుడు పంపిణీకి సిద్దంగా ఉన్నాయి.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని.. మహిళలకు చీరలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్దం అయ్యింది. రాష్ట్రంలోని సుమారు 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకి ఒకేరకం చీరలని అందించాలని ప్రభుత్వం భావించింది. గత జాతీయ చేనేత దినోత్సవం అగష్టు 7వ రోజున రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులందరికీ.. రెండు చేనేత చీరలు అందజేస్తామని ప్రకటించారు. అయితే గతంలో బీఅర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా ఇచ్చే చీరల ఖరీదు రూ. 350 ఉండగా ఈసారి ఇచ్చే ఇందిరా మహిళ శక్తి చీరెల ధర రూ.480గా నిర్ణయించారు. ఈసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతో పాటుగా హనుమకొండలో ఇందిరా మహిళ శక్తి చీరలకి అర్డర్లు ఇచ్చారు.
సిరిసిల్ల చేనేత కుటుంబాలకి ఇందిరా మహిళా శక్తి చీరల అర్డర్లు కావడంతో.. గత ఫిభ్రవరి నుండి కార్మికులు ఇందిరా మహిళాశక్తి చీరలు తయారీలో బిజీబిజీగా మారారు. ఫిబ్రవరిలో మొదటగా రూ.2.12 కోట్ల మీటర్లకి అర్డర్ ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్.. రెండో విడతలో మరో రూ. 2.12 కోట్ల మీటర్లకు ఎప్రియల్‌లో అర్డర్లు ఇచ్చింది. ఇందిరా మహిళ శక్తి చీరల తయారీకి అయ్యే బట్టల ఉత్పత్తికి వేములవాడలో యారన్(నూలుపోగు) డిపో ఎర్పాటు చేసింది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే నూలుని నేరుగా యాభై కోట్ల కార్పస్ ఫండ్‌ని ప్రభుత్వమే మంజూరు చేసింది. సిరిసిల్ల వస్త్రోత్పత్తి దారులకి 90 శాతం అరువుపై నూలుపోగుని సరఫరా చేసింది.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమని ఆదుకోవడానికి ప్రభుత్వమే నూలుపోగు వస్త్రోత్పత్తి దారులకి.. అరువుగా ఇవ్వడంతో పెట్టుబడి భారం తగ్గింది. పెట్టుబడి భారం తగ్గడంతో వస్త్రోత్పత్తి దారులకి ఎలాంటి భారం మీదపడక పోవడంతో చీరల ఉత్పత్తి లక్ష్యం అనుకున్న సమయానికి నేరవేరబోతుంది. అయితే బతుకమ్మ పండుగ నాటికే చీరల ఉత్పత్తి పూర్తి కావల్సి ఉండగా అర్డర్స్ అలస్యం కావడంతో ఉత్పత్తి కూడా అలస్యం అయ్యింది. ఇప్పుడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా చీరలని రాష్ట్రంలోని ప్రతి మహిళలకి రెండు చీరల చొప్పున దాదాపుగా 65 లక్షల మందికి అందించనుంది. ఇప్పుడు సిరిసిల్ల లోని మరమగ్గాల కార్మీకులకి చేతినిండా పని దొరకడంతో వీరంతా సంతోషంగా ఉన్నారు. అరునెలలుగా చీరెల ఉత్పత్తి చేస్తుండడంతో చీరల పంపిణికి సిద్దం చేసారు. ఇప్పుడు మరమగ్గాల కార్మికులకి ప్రతినెల ఇరవై వేల వరకు కూలి గిట్టుబాటు అయ్యింది.
Also Read: కరీంనగర్ కలెక్టరేట్‌లో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న పోలీసులు
మరో వారంలో చీరల ఉత్పత్తి సేకరణ పూర్తి అయ్యి.. ఇప్పుడు పంపిణీకి సిద్దంగా చీరలు ఉన్నాయని చేనేత కార్మికులకి రేయింబవళ్ళు పని దొరికిందని వారంలో మొత్తం సేకరణ అవుతుందని అధికారులు అంటున్నారు.