BigTV English

War 2: థియేటర్లలో బొక్కబోర్లా.. ఓటీటీలో రికార్డు సృష్టించిన వార్ 2!

War 2: థియేటర్లలో బొక్కబోర్లా.. ఓటీటీలో రికార్డు సృష్టించిన వార్ 2!

War 2:యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR ) బాలీవుడ్ తొలి పరిచయంలో వచ్చిన చిత్రం వార్ 2. హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా, కియారా అద్వానీ (Kiara advani) హీరోయిన్గా తెరకెక్కిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్, స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన ఈ ఫ్రాంఛైజీలో భాగంగా ఆగస్టు 14వ తేదీన థియేటర్లలో విడుదలైంది. అదే రోజు రజనీకాంత్ , లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘కూలీ’ సినిమా కూడా విడుదలైన విషయం తెలిసిందే. కథ కంటెంట్ ఏ చిత్రానికి బాగుంటే.. ఆ చిత్రానికే ప్రజలు ఓటేస్తారన్న విషయం అందరికీ తెలిసింది. అలా భారీ నిర్మాణ సంస్థలు అయినా కూడా పెద్దగా ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.


ఓటీటీలో రికార్డు సృష్టించిన వార్ 2..

అటు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ కి.. ఈ సినిమా ఏ మాత్రం కలిసి రాలేదని చెప్పాలి. ముఖ్యంగా చిరంజీవి, రామ్ చరణ్ , ఎన్టీఆర్ ఇలా ముగ్గురు కూడా బాలీవుడ్లో తొలి ప్రయత్నం చేసి బొక్క బోర్ల పడ్డారని అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. ఇకపోతే థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది ఈ సినిమా.

అత్యధిక వీక్షణల జాబితాలో..

అందులో భాగంగానే తాజాగా ప్రముఖ మీడియా సంస్థ అయిన ఆర్మాక్స్ అత్యధిక వీక్షణలు సొంతం చేసుకున్న చిత్రాల జాబితాలో వార్ 2 ఉన్నట్లు తెలిపింది. అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 12 వరకు వచ్చిన వీక్షణలను ఆధారంగా ఈ విషయం వెల్లడించినట్లు సమాచారం. ఇప్పటివరకు అత్యధికంగా 3.5 మిలియన్ వీక్షణలు వచ్చినట్లు ప్రకటించింది. దీంతో గతవారం ఇండియాలోనే ఎక్కువ మంది చూసిన సినిమాగా కూడా ఈ సినిమా నిలిచింది. మొత్తానికైతే థియేటర్లలో బొక్కబోర్ల పడ్డ ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకోవడం గమనార్హం.


కూలీ మూవీను పక్కకు నెడుతూ..

వార్ 2 సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాకి పోటీగా కూలీ విడుదలయ్యింది. రెండు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా పోటీ పడ్డాయి.. అయితే ఇక్కడ ఓటీటీ లో కూడా ఈ చిత్రాలు పోటీ పడుతున్నాయని చెప్పవచ్చు. తాజాగా కూలీ హిందీ వెర్షన్ కూడా గతవారం ఓటీటీలో విడుదల అవ్వగా.. హిందీలో కూలీని వార్ 2 అధిగమించింది. అక్టోబర్ 9వ తేదీ నుంచి వార్ 2 హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 300 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓటీటీలో మాత్రం ఈ సినిమా సత్తా చాటి అభిమానులను ఆనందానికి గురి చేసిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అటు ఎన్టీఆర్ అభిమానులు, హృతిక్ రోషన్ అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు

ALSO READ:Bigg Boss 9 Promo: మొదలైన నామినేషన్స్ రచ్చ.. ఎలిమినేషన్ వారి చేతుల్లోనే!

Related News

OG: ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న ఓజీ .. ఎప్పుడు? ఎక్కడంటే?

OTT Movie : 2 గంటల 11 నిమిషాల మలయాళం మూవీ… IMDbలో 9.4 రేటింగ్… క్షణక్షణం ఉత్కంఠ రేపే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : మేనమామ చావుకు రివేంజ్… ఓటీటీని షేక్ చేస్తున్న కొరియన్ సిరీస్… యాక్షన్ ప్రియులకు పండగే

OTT Movie : డివోర్స్ కావాలంటే ప్రాణాలు తీసే దెయ్యం… హర్రర్ సీన్లతో తడిపించే స్టోరీ… ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : మొగుడు పోగానే క్యూ కట్టే కేటుగాళ్ళు… డబ్బు కోసం అంతమందితో… అలాంటి సీన్లున్న సినిమానే

OTT Movie : రాత్రికి రాత్రే యవ్వనంగా మారిపోయే భార్య… ఒక్క సిప్ తో అమరత్వం ఇచ్చే అమృతం… భర్తకు దబిడి దిబిడే

Malayalam Movies on OTT : క్రైమ్ నుంచి కామెడీ వరకు… ఈ వారం ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ మలయాళం సినిమాలు ఇవే

Big Stories

×