Rains Updates: దేశవ్యాప్తంగా నైరుతి ఋతు పవనాలు తిరోగమనం దిశగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం, బుధవారాల్లో ఏపీ-తెలంగాణలకు భారీ వర్షాలు పడనున్నాయి. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు పలు జిల్లాలను అలర్ట్ చేసింది.
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
నైరుతి ఋతు పవనాలు తిరోగమనం నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అక్టోబర్ 14 నుంచి 18 వరకు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ-తెలంగాణ రాష్ట్రాలలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్య -తూర్పు భారత్ నుండి రుతుపవనాలు వెనక్కి తగ్గినప్పటికీ, ఈ ప్రాంతాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశముంది.
తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ సూచన ప్రకారం నైరుతి బంగాళాఖాతం, దక్షిణ తమిళనాడు ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీని కారణంగా రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి.
హైదరాబాద్లో పలు ప్రాంతాలకు
దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు, జనగాం వంటి జిల్లాలు ముప్పు పొంచివుంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇక హైదరాబాద్ సిటీలో ఉదయం వేళ వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. అయితే సాయంత్రం నాటికి వాతావరణం చల్లబడుతుందని వెల్లడించింది. రాత్రి వేళ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని భావిస్తోంది.
ALSO READ: జూబ్లీహిల్స్ బైపోల్.. భర్తను తలచుకుని ఏడ్చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ మార్పులు భారీగా ఉండవచ్చని అంచనా వేసింది వాతావరణ కేంద్రం. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, దాని పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ ఏరియాలోని ఒకటి రెండు ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశం ఉంది.
ఎల్లో అలర్ట్: కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం..
రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
దీంతో కాసేపట్లో HYD, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి… pic.twitter.com/MASC43gteW— BIG TV Breaking News (@bigtvtelugu) October 14, 2025