E-Paper
Advertisement

హైదరాబాద్ వాసులకు వాన గండం.. కనిపించని మాన్సూన్ యాక్షన్ ప్లాన్..!

హైదరాబాద్ వాసులకు వాన గండం.. కనిపించని మాన్సూన్ యాక్షన్ ప్లాన్..!
Advertisement

Hyderabad Monsoon: స్వేచ్ఛ బ్యూరో: ఈ వేసవిలో కాస్త ముందుగానే మండిపోతున్న ఎండల తరహాలోనే ఈ సారి నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని కాస్త ముందుగానే ప్రవేశించి, వర్షాలు కూడా ముందుగానే దంచికొట్టే అవకాశముందంటూ వాతావరణ నిపుణలు చేస్తున్న హెచ్చరికల ప్రకారం కోర్ అర్బన్ రీజియన్ లోని ప్రజలకు వచ్చే వర్షాకాలం కూడా మునక తప్పేట్టు లేదు. ముఖ్యంగా నగరంలోని లోతట్టు, నాలా పరివాహాక ప్రాంతాలు, చెరువులకు దిగువ ఉన్న ప్రాంతాల ప్రజలు ముందస్తు వర్షాల కారణంగా మునక భయటంతో బిక్కుబిక్కుమంటున్నారు. ప్రతి సంవత్సరం వేసవి కాలం మధ్యలో జీహెచ్ఎంసీ వానాకాలం కష్టాలను తగ్గించేందుకు ఏర్పాట్లు చేసి, అధికారికంగా ప్రకటించేది. కానీ ఈ సారి వర్షాకాలం సమీపించేందుకు ఇంక నెల రోజుల సమయం కూడా లేదు. కానీ ఇప్పటి వరకు కోర్ అర్బర్ రీజియన్ పరిధిలోని మూడు కార్పొరేషన్లు ఎలాంటి మాన్సూన్ యాక్షన్ ప్లాన్ ను సిద్దం చేయలేదు.

మాన్సూన్ యాక్షన్ ప్లాన్ పై..

గ్రేటర్ వాసుల దాహర్తిని తీర్చే జలమండలి సైతం మాన్సూన్ యాక్షన్ ప్లాన్ పై ఇంకా దృష్టి సారించలేదు. వర్షాకాలం కష్టాలను తగ్గించేందుకు చేస్తున్న ఏర్పాట్లపై మూడు కార్పొరేషన్లు కూడా మౌనంగానే ఉన్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ప్రతి వర్షాకాలానికి ముందు ఎమర్జెన్సీ బృందాలు, సహాయం కోసం కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి వివరాలను ప్రజలకు తెలియచేసేది. కానీ ఈ సారి మూడు కార్పొరేషన్ల పరిధిలో కూడా మాన్సూన్ యాక్షన్ ప్లాన్ పై ఎలాంటి ప్రస్తావన లేదు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని నాలా పూడికతీత పనుల్లో తరుచూ అక్రమాలు బయట పడటంతో ఆ బాధ్యతను సర్కారు సంవత్సరం క్రితం పూడికతీత పనుల బాధ్యతను జీహెచ్ఎంసీ నుంచి తప్పించి, హైడ్రాకు అప్పగించిన సంగతి తెల్సిందే.

ఆరు జోన్ల పరిధిలో..

Advertisement

నాలా పూడికతీత పనులను వినియోగించే వాహానాల టెండర్లలోనూ అక్రమాలు వెలుగుచూడటంతో పూడికతీత పనుల బాధ్యతలను సర్కారు హైడ్రాకు అప్పగించిన నాటి నుంచి జీహెచ్ఎంసీ వర్షం సంబంధిత చర్యలకు దూరంగా ఉంటుంది. దీంతో అకాల వర్షాలు కురిసినా, నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత భారీ వర్షాలు కురిసినా ప్రజలకు కష్టాలు తప్పేట్టు లేవు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్ల పరిధిలో చిన్న పాటి వర్షానికే మునకకు గురవుతున్న ప్రాంతాలను గుర్తించి, సుమారు రూ.254 కోట్ల వ్యయంతో స్ట్రాటెజిక్ నాలా డెవలప్ మెంట్ (ఎస్ఎన్ డీపీ) పనులను దాదాపు పదకొండు ప్రాంతాల్లో చేపట్టారు.

Also Read: గూగుల్ నుంచి బిగ్ లీక్.. Pixel 11లో ఈ ‘పిక్సెల్ గ్లో’ ఫీచర్ చూస్తే ఫ్యూజులు అవుట్!

ఈ సారి మళ్లీ మునక్క తప్పదా..

Advertisement

చాలా ప్రాంతాల్లో వరద నీరు సక్రమంగా ప్రవహించేందుకు వీలుగా నాలాల ఆధునీకరణ, బాక్స్ డ్రెయిన్ల నిర్మాణంతో పాటు వరద నీటి కాలువలను ఆధునీకరించి నిర్మిస్తున్నారు. వీటితో పాటు ఓపెన్ డ్రెయిన్లు, రిటైనింగ్ వాల్, వంటి నిర్మాణాలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో చెరువుల మధ్య వరదనీటి కాలువలు వంటివి నిర్మిస్తున్నారు. వీటిలో చాలా వరకు వనులు మధ్య స్థాయిలో ఉండటంతో కనీసం వర్షాకాలం ప్రారంభానికి ముందే ఈ పనులు పూర్తయ్యే అవకాశాల్లేకపోవటంతో ఆయా ప్రాంతాలకు ఈ సారి మళ్లీ మునక తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతుంది.

పూడికతీత పనులపై హైడ్రా ఫోకస్..

గత సంవత్సరం నుంచి నాలాల్లో పూడికతీత పనులను హైడ్రాకు అప్పగించటంతో హైడ్రా ఇందుకు కావల్సిన మిషనరీ, మ్యాన్ పవర్ ను సమకూర్చుకుని పూడికతీత పనులను శాస్త్రీయంగా నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు హైడ్రా సిటీలోని నాలాల్లోని పూడికను సుమారు 80 శాతం నుంచి 90 శాతం వరకు తొలగించినట్లు విశ్వసనీయ సమాచారం. హైడ్రా కమిషనర్ రంగనాధ్ క్షేత్ర స్థాయిలో పర్యటించి, ఎక్కువగా మునక, ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లోని అసలు కారణాలను అన్వేషించి, నాలాలను ఆధునీకరించటంతో పాటు నాలాల్లోని పూడికను పూర్తి గా తొలగించే పనులపై స్పెషల్ గా ఫోకస్ చేయటంతో అమీర్ పేట మధురానగర్ వంటి ప్రాంతాలకు మునక ప్రభావం తగ్గిందని చెప్పవచ్చు. దీంతో పాటు ప్యాట్నీలో కూడా ముంపు ముప్పుు నివారణకు హైడ్రా చర్యలు చేపట్టిన సంగతి తెల్సిందే.

గుణపాఠాలు నేర్వని జీహెచ్ఎంసీ ..

గడిచిన దశాబ్దాలుగా చిన్న పాటి వర్షానికే పలు ప్రాంతాలు నీట మునుగుతున్నా, జీహెచ్ఎంసీ గుణ పాఠాలు నేర్వటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో పలు ప్రాంతాల్లో చిన్న పాటి వర్షానికే పలు ప్రాంతాలు నీట మునిగి, ఇళ్లలోకి వరద నీరు చేరిన సోమాజీ గూడ సమీపంలోని రాజీవ్ నగర్ వంటి బస్తీలు మళ్లీ మునక భయటంతో వణికిపోతున్నాయి. జీహెచ్ఎంసీ ప్రతి వర్షాకాలం తాత్కాలిక సహాయక చర్యలు మాత్రమే చేపడుతుందని, అసలు మునకకు కారణాన్ని అన్వేషించి, శాశ్వత పరిష్కారాన్ని సమకూర్చటంలో విఫలమవుతుందని లోతట్టు ప్రాంతాల ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. వర్షాకాలం శిథిలావస్థలోనున్న పాత కాలపు భవనాలు కూలి, ప్రాణ నష్టాలు జరిగినా, వర్షాకాలాన్ని ముందే కనీసం ఇలాంటి గుర్తించే పనిని కూడా జీహెచ్ఎంసీ చేపట్టకపోవటం నిర్లక్ష్యానికి నిదర్శనమన్న వాదనలున్నాయి.

Also Read: హైదరాబాద్‌లో మొదలైన ఎన్నికల జాతర.. మేయర్ సీటుకు ఫైరవీలు స్టాట్..?

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×