BigTV English

Xiaomi Mix Fold 4 & Mix Flip Foldable: శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్‌తో షియోమి కొత్త ఫోన్లు.. కలర్ వేరియంట్స్ లీక్.. మీరే ఓ లుక్కేయండి!

Xiaomi Mix Fold 4 & Mix Flip Foldable: శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్‌తో షియోమి కొత్త ఫోన్లు.. కలర్ వేరియంట్స్ లీక్.. మీరే ఓ లుక్కేయండి!

Xiaomi Mix Fold 4 and Mix Flip Foldable Phones Launching July 19th: ప్రముఖ చైనీస్ టెక్ బ్రాండ్ షియోమి దేశీయ మార్కెట్‌లో తన ఆదిపత్యాన్ని కొనసాగించేందుకు కొత్త కొత్త మోడల్ ఫోన్లను రిలీజ్ చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ వారంలో మరో మూడు ఫోన్లను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. Xiaomi తన మూడు కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను జూలైలో విడుదల చేసే అవకాశం ఉంది. అందులో Redmi K70 Ultra కాకుండా, కంపెనీకి చెందిన మరో రెండు ఫోన్‌లు ఉన్నాయి.


అవి Xiaomi Mix Fold 4 అండ్ Mix Flip ఫోల్డబుల్ ఫొన్లు. అయితే Redmi K70 Ultra డిజైన్, ప్రధాన స్పెసిఫికేషన్‌లు ఇటీవల వెల్లడయ్యాయి. కానీ ఫోల్డబుల్ ఫోన్‌ల గురించి ఎటువంటి సమాచారం అందలేదు. అయితే ఇప్పుడు లాంచ్‌కు ముందు ఈ రెండు ఫోల్డబుల్ డివైజ్‌ల కలర్ వేరియంట్‌లు లీక్ అయ్యాయి. ఈ రెండు Xiaomi Mix Fold 4, Mix Flip ఫోల్డబుల్ ఫోన్‌లకు సంబంధించి ఒక చైనీస్ టిప్‌స్టర్ ఒక అప్‌డేట్ అందించారు. ఈ వారం ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల డిజైన్‌ను కంపెనీ ఆవిష్కరించే అవకాశం ఉందని తెలిపాడు.

చైనాకి చెందిన ప్రసిద్ధ టిప్‌స్టర్ పాండా ఈజ్ వెరీ బాల్డ్ ప్రకారం.. కంపెనీ మిక్స్ ఫోల్డ్ 4ని వైట్, బ్లాక్, బ్లూ, బ్లాక్ కెవ్లర్ వేరియంట్‌లలో మార్కెట్‌లో లాంచ్ చేసే అవకాశం ఉందని తెలిపాడు. షియోమి మిక్స్ ఫ్లిప్ గురించి చెప్తూ.. ఈ ఫోన్‌ను వైట్, పర్పుల్, బ్లాక్ వంటి కలర్ వేరియంట్‌లలో లాంచ్ చేయవచ్చని టిప్‌స్టర్ చెప్పాడు. ఈ ఫోన్‌లో గరిష్టంగా 16 GB RAM + 1TB వరకు స్టోరేజ్ ఉంటుందని టిప్‌స్టర్ చెప్పాడు. అయితే వాటి విడుదల తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు.


Also Read: అబ్బబ్బ ఇదేమి ఆఫర్రా బాబు.. ఏకంగా రూ.40,000 డిస్కౌంటా.. ఇలాంటిది మళ్లీ రాదు..!

కానీ చైనీస్ మైక్రోబ్లాగింగ్ సైట్‌లో టిప్‌స్టర్ పోస్ట్ చేసిన లీక్ ఈ స్మార్ట్‌ఫోన్లను జూలై 19న ప్రారంభించవచ్చని తెలుస్తోంది. ఈ రెండు Xiaomi Mix Fold 4, Mix Flip ఫోల్డబుల్ ఫోన్‌లలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌ను అందించినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో 67W ఫ్లాష్ ఛార్జింగ్ ఉంటుందని సమాచారం. మిక్స్ ఫోల్డ్ 4 ఫోన్ టూ-వే శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్‌తో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్ IPX8 వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌తో వచ్చే ఛాన్స్ ఉంది.

కంపెనీ మిక్స్ ఫోల్డ్ 4లో వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుందని చెప్పబడింది. అలాగే మిక్స్ ఫ్లిప్ ఫోన్‌ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,700mAh బ్యాటరీతో అందించబడుతుందని తెలుస్తోంది. ఇది లైకా ఇమేజింగ్ మద్దతును పొందుతుందని సమాచారం. తద్వారా ఇది మంచి ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించవచ్చు. దీనితో పాటు 60 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాను ఇందులో అందిచే ఛాన్స ఉంది.

Tags

Related News

OnePlus 24GB RAM Discount: వన్ ప్లస్ 24GB RAM ఫోన్‌పై భారీ తగ్గింపు.. రూ.33000 వరకు డిస్కౌంట్

Youtube Ad free: యూట్యూబ్‌లో యాడ్స్ తో విసిగిపోయారా?.. ఈ సింపుల్ ట్రిక్ తో ఉచితంగా యాడ్స్ బ్లాక్ చేయండి

iPhone 16 vs Pixel 10: రెండూ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు.. ఏది బెస్ట్?

itel ZENO 20: రూ.5999కే స్మార్ట్ ఫోన్.. 5,000mAh భారీ బ్యాటరీతో ఐటెల్ జెనో 20 లాంచ్

New Realme Smartphone: మార్కెట్లో ఎప్పుడూ లేని బ్యాటరీ పవర్! రాబోతున్న రియల్‌మీ బిగ్ సర్‌ప్రైజ్

Google Pixel 10 Pro Fold vs Galaxy Z Fold 7: ఏ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ లో ఏది బెటర్?

Big Stories

×