BigTV English

‎Zarina Wahab -Prabhas: ప్రభాస్ బాలీవుడ్ హీరోల మాదిరి కాదు.. ప్రశంసలు కురిపించిన నటి!

‎Zarina Wahab -Prabhas: ప్రభాస్ బాలీవుడ్ హీరోల మాదిరి కాదు.. ప్రశంసలు కురిపించిన నటి!

‎Zarina Wahab -Prabhas: పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చేతినిండా అరడజనుకు పైగా పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఎక్కువ ఇండియా సినిమాలు చేస్తున్న హీరోల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు ప్రభాస్. వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు ప్రభాస్. ఇకపోతే ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో రాజాసాబ్ సినిమా కూడా ఒకటి.


ప్రభాస్ సరసన ముగ్గురు..

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఎప్పట్నుంచో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హారర్ కామెడీగా తెరకెక్కుతున్న రాజాసాబ్(Raaja Saab) మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్(nidhi Agarwal), మాళవిక మోహనన్, రిద్ది కుమార్ లు హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఇది ఇలా ఉంటే డార్లింగ్ ప్రభాస్ తో కలిసి పని చేసిన హీరో హీరోయిన్లు, నటీనటులు ప్రభాస్ గురించి ఆయన మర్యాద గురించి గొప్పతనం గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటారు.

ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా..

గతంలో చాలామంది ప్రభాస్ మంచితనం గురించి గొప్పగా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఒక సీనియర్ నటి ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ ప్రభాస్ ని పొగడ్తలతో ముంచెత్తారు. ఆమె మరెవరో కాదు సీనియర్ హీరోయిన్ జరీనా(jareena). ఈమె ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ సినిమాలో గ్రాండ్ మదర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనతో కలిసి పనిచేసిన తర్వాత ఆయన గొప్పతనం గురించి తెలిసొచ్చింది. నిజంగా ఇలాంటి మంచి వ్యక్తులు ఉంటారా అని నాకు అనిపించింది.


బాలీవుడ్ హీరోలు ఇలా కాదు

‎బాలీవుడ్(Bollywood )లో హీరోలు అలా కాదు. సినిమా షూటింగ్ అయిపోయినప్పుడు మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు వెంటనే వెళ్లి క్యారవ్యాన్ లో కూర్చుంటారు. కానీ ప్రభాస్ మాత్రం తన షూటింగ్ అయిపోయి నా షూటింగ్ ఉన్నా కూడా అక్కడే కూర్చుని అందరినీ సరదాగా మాట్లాడిస్తూ ఉంటారు. బ్రేక్ వచ్చినా కూడా అక్కడి నుంచి వెళ్లరు. అప్పుడు ప్రభాస్ ని చూసినప్పుడు ఇంత మంచి వ్యక్తులు కూడా ఉంటారా అని నాకు అనిపించింది ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అని చెప్పుకొచ్చింది హీరోయిన్ జరీనా. అలాగే ప్రభాస్ లాంటి హీరోలను చూసి బాలీవుడ్ హీరోలు చాలా నేర్చుకోవాలి అని ఆమె చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఈ సీనియర్ నటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె వ్యాఖ్యలపై స్పందించిన ప్రభాస్ అభిమానులు డార్లింగ్ మంచితనం అంటే అలాగే ఉంటుంది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానున్న విషయం తెలిసిందే.

Also Read: Brahmakalasha song: కాంతార1 బ్రహ్మకలశ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్..పూనకాలు తెప్పిస్తోందిగా!

Related News

Tollywood hero: మిడ్ రేంజ్ హీరో కి దెబ్బ మీద దెబ్బ, వాయిదా పడ్డ మరో ప్రాజెక్ట్

Pawan Kalyan : మూడు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, మరోసారి పీపుల్ మీడియాలో

Deepika Padukone: ఛీ.. డబ్బుల కోసం ఇంత దిగజారతావా.. దీపికాపై నెటిజన్స్‌ ఫైర్‌

Kantara Chapter 2 : కాంతార ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్… సీక్వెల్ ఇప్పట్లో లేనట్లే

Bunny Vasu : త్రివిక్రమ్ ప్రాజెక్టు గురించి మాట్లాడకండి, వాళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుకోవాలి

AA22xA6 : అట్లీ అల్లు అర్జున్ సినిమాపై నోరు విప్పలేదు, తెలివిగా ప్రశ్నను దాటేశారు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ కాంబో రిపీట్‌… దర్శకుడు య‌దు వంశీతో నిహారిక మ‌రో మూవీ

Big Stories

×