OTT Movie : దెయ్యాలు ఉన్నాయో లేవో తెలియదు గానీ, దెయ్యాల సినిమాలు మాత్రం ఆడియన్స్ ని భయపెడుతున్నాయి. కొన్ని సినిమాలను చూసి ప్యాంట్లు తడుపుకుని పరుగులు పెడుతున్నారు. అలా భయపెట్టే సినిమాలు గతంలో కూడా వచ్చాయి. ‘ఈవిల్ డెడ్ ‘ సినిమా ఇప్పటికీ ఒక సంచలనమే. అప్పట్లో ఈ సినిమాని ఒంటరిగా చూసి బయటికి వస్తే బహుమతులు కూడా ఇచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా అదే కోవలోకి వస్తుంది. ఈ సినిమా పేరు ‘కాన్జురింగ్’ . ఇది వరకే ఎనిమిది పార్ట్ లు వచ్చి ఆడియన్స్ ని గజగజ వణికించింది. ఇప్పుడు తొమ్మిదవ పార్ట్ తో వచ్చి బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టింది. ఈ సినిమా థియేటర్లలో 4000 వేల కోట్లకు పైగా వసూలు చేసింది. దీనిని నిజ జీవిత దెయ్యం సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ధైర్యం ఉంటే రాత్రి పూట ఒంటరిగా చూడటానికి ట్రై చేయండి. ఈ సినిమా ఎక్కడ ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘ది కన్జురింగ్: లాస్ట్ రైట్స్’ (The Conjuring: Last Rites) 2025లో వచ్చిన హారర్ థ్రిల్లర్ సినిమా. దీనికి మైఖేల్ చావెస్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్యాట్రిక్ , మియా టామ్లిన్,బెన్ హార్డీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 సెప్టెంబర్ 5 న థియేటర్లలో విడుదలైంది. 2025 అక్టోబర్ 7 నుంచి prime Videoలో అందుబాటులోకి వచ్చింది.
Read Also : భార్య పక్కనుండగా మరో అమ్మాయితో… తండ్రి కళ్ళ ముందే ఆ పని… అవార్డుల పంట పండేంతగా ఏముందంటే?
ఎడ్, లోరెన్ అనే జంట ప్రశాంతంగా 1964లో ప్రశంతమైన జీవితం గడుపుతుంటారు. అయితే ఉన్నట్టుండి ఒక భయంకరమైన దెయ్యం అద్దంలో నుంచి వచ్చి వీళ్ళను వెంటాడుతుంది. ఒక భయంకరమైన ఎక్సార్సిజమ్ తో వాళ్ళు దానిని కట్టడి చేస్తారు. కట్ చేస్తే స్టోరీ 1980కి వెళ్తుంది. ఇక్కడ స్మర్ల్ అనే ఫ్యామిలీలో విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. రాత్రిళ్లు ఇవి మరింత భయకరంగా, ఫ్యామిలీ మీద దెయ్యాలు దాడులు కూడా చేస్తుంటాయి. దీంతో స్మర్ల్ ఫ్యామిలీ చాలా భయపడిపోతుంది. ఎడ్, లోరెన్ అనే జంట ఈ దెయ్యాన్ని తీసేందుకు ఎక్సార్సిజమ్ చేస్తారు. ఇక్కడ దెయ్యం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. వీళ్ళ ఎక్సార్సిజమ్ కంటే, దాని శక్తి బలంగా ఉంటుంది. దీంతో మొదటి ప్రయత్నం ఫైల్ అవుతుంది.
స్మర్ల్ ఫ్యామిలిలో సమస్యలు ఇంకా పెరుగుతాయి. ఈ ఫ్యామిలీ మీద దెయ్యం మరింత రెచ్చిపోతుంది. ఈ సమయంలో లోరెన్ ఒక చర్చ్ ఫాదర్ సహాయం తీసుకుని, మళ్ళీ ఎక్సార్సిజమ్ చేస్తాడు. ఇక్కడ మళ్ళీ భయంకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ దెయ్యం విచిత్రమైన వాయిస్‌లో మాట్లాడి, ఇంట్లో వాళ్ళనే కాకుండా, ఆడియన్స్ ని కూడా పరుగులు పెట్టిస్తుంది. చివరికి ఆ జంట దెయ్యాన్ని కంట్రోల్ చేస్తారా ? ఈ దెయ్యం స్మర్ల్ ఫ్యామిలిని ఎందుకు టార్గెట్ చేసింది? లోరెన్ ఎక్సార్సిజమ్ వల్ల మరిన్ని సమస్యలు వస్తాయా ? అనే విషయాలను, ఈ హారర్ సినిమాని చూసి తెలుసుకోండి.