దేశీయ విద్యార్థులకే కాదు, ఇండియాలో చదువుతున్న ఫారిన్ విద్యార్థులు కూడా హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. తాజాగా కారు సన్ రూఫ్ ఓపెన్ చేసి, దాని పైన కూర్చొని ఇద్దరు విదేశీ విద్యార్థులు ముద్దులు, హగ్గులతో పాటు అసభ్య పనులు చేస్తూ కనిపించారు. ఈ తతంగాన్ని రోడ్డు మీద వెళ్తున్న ప్రయాణీకులు కెమెరాలో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు సదరు విద్యార్ధుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పంజాబ్ లోని లూథియానాలో జరిగినట్లు తెలుస్తోంది.
విదేశీ విద్యార్థలు ముద్దూ, ముచ్చట వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో ఓ యువతి, యువకుడు సన్ రూఫ్ తెరిచి పైన ఒకరికొకరు ఎదురెదురు కూర్చున్నారు. కారు రన్నింగ్ లో ఉండగానే హగ్ చేసుకోవడంతో పాటు ముద్దుల్లో ముగినిపోయారు. ఇంకా మితిమీరి ప్రవర్తించారు. వీరి చేష్టలను చూసి తోటి ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి వారి అసభ్య ప్రవర్తనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో, ప్రజలు ఆ జంటపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక ఈ వీడియోలో ఉన్న విదేశీ విద్యార్ధుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరూ ఉగాండా నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఉన్నత విద్య కోసం పంజాబ్ కు వచ్చారు. లూథియానాలోని BRS నగర్ లాల్ బాగ్ ప్రాంతంలో అద్దెకు తీసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ పీజీ చదవుతున్నారు.
ఇక ఈ వీడియోను చూసి నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఆ జంట చర్యలను అవమానకరంగా అభివర్ణిస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలో ప్రజలు సంస్కృతి, సంప్రదాయానికి విలువనిస్తారు. ఈ రకమైన ప్రవర్తన తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే, ఇలాంటి వీడియో బయటకు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో పలు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ మెట్రోతో పాటు ఇతర బహిరంగ ప్రదేశాలలో జంటలకు సంబంధించి పలు వీడియోలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ మెట్రోలో పెరుగుతున్న ఇలాంటి సంఘటనలతో DMRC హెచ్చరిక జారీ చేసింది. అయినప్పటికీ, చాలా మంది వాటిని పట్టించుకోవడం లేదు. వీధుల్లో, మాల్స్ లో, మెట్రోలో, బహిరంగ ప్రదేశంలో ప్రదర్శించడం సరైనది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయడం ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తుందంటున్నారు. అంతేకాదు, ఇతరులకు నెగెటివ్ మెసేజ్ పాస్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఇలాంటి వీడియోలను చూడటం వల్ల పిల్లలు, టీనేజర్లు కూడా చెడిపోయే అవకాశం ఉదంటున్నారు.
Read Also: ఒకే వ్యక్తికి 1638 క్రెడిట్ కార్డులు.. అన్నీ పనిచేసేవే, గిన్నీస్ రికార్డుకు ఎక్కేశాడుగా!