MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా జట్టుకు తన కెప్టెన్సీలో అనేక ట్రోఫీలు అందించి చరిత్ర సృష్టించాడు ధోని. టీమిండియా కెప్టెన్ గా ధోని ఎంపికైన తర్వాత, జట్టు స్వరూపమే మారిపోయింది. అలాంటి మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం ముంబైలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ముంబై ఇండియన్స్ జెర్సీ ధరించి ధోని మెరిసిన ఫోటోలు వైరల్ గా మారాయి. కొంతమంది ప్లేయర్లతో కలిసి ధోని ముంబై ఇండియన్స్ జెర్సీ ధరించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీంతో ఈ జెర్సీ పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read: Gautam Gambhir: గంభీర్ మహాముదురు.. ట్రోలింగ్ కు చెక్ పెట్టేందుకు బీరు, బిర్యానీలు పెట్టి మరీ !
మహేంద్రసింగ్ ధోని అలాగే కొంతమంది ప్లేయర్లు ముంబై ఇండియన్స్ జెర్సీలో తాజాగా మెరిశారు. మహేంద్రసింగ్ ధోనితో పాటు ఉన్న వీళ్లంతా యంగ్ ప్లేయర్లు. అయితే స్పెషల్ విషయం ఏంటంటే ఈ ప్లేయర్లందరూ ముంబై ఇండియన్స్ జెర్సీ ధరించి కనిపించారు. స్లైస్ తో పాటు ముంబై ఇండియన్స్ లోగో ఉన్న జెర్సీని మహేంద్ర సింగ్ ధోని.. ధరించాడు. ఈ విషయాన్ని మనం ఫోటోలో స్పష్టంగా చూడవచ్చు. అటు ఈ ఫోటోలో క్రికెట్ జట్టుకు సరిపడా 11 మంది ప్లేయర్లు కూడా ఉన్నారు.
ఇంకేముంది మహేంద్ర సింగ్ ధోనితో కలిసి ముకేశ్ అంబానీ ఏదో ప్లాన్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సమయంలో ధోని కెప్టెన్సీలో ఈ జట్టును బరిలోకి దింపుతాడని కొంతమంది ఈ ఫోటో కింద కామెంట్స్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యాను తొలగించి ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా మహేంద్రసింగ్ ధోనిని నియమిస్తారని మరికొంతమంది అంటున్నారు. అంతేకాదు వచ్చే సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ కు హెడ్ కోచ్ గా మహేంద్రసింగ్ ధోని, బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ముంబై ఇండియన్స్ జెర్సీలో మహేంద్రసింగ్ ధోని కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Also Read: Inzamam-ul-Haq: రోహిత్ శర్మ ఓ ముసలోడు, పందిలాగా ఉంటాడు…అందుకే కెప్టెన్సీ పీకిపారేశారు !
ముంబై ఇండియన్స్ జెర్సీలో మహేంద్ర సింగ్ ధోని కనిపించడంతో చెన్నైసూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ముంబై ఇండియన్స్ లోకి ధోని వెళుతున్నాడా ? అనే టెన్షన్ లో ఉన్నారు ఫ్యాన్స్.
MS Dhoni in a Mumbai Indians jersey? 👀
📸: Arjun Vaidya | Instagram#MSDhoni #MumbaiIndians pic.twitter.com/U4pmcmDIPF
— Circle of Cricket (@circleofcricket) October 7, 2025