Smartphone Tips: వేసవి అనగానే మస్తు ఎండలు, పొగమంచు గాలి, ఉక్కపోత గుర్తొస్తాయి. వడగాలులు మనకు తట్టుకోవడమే కష్టంగా ఉంటే, మన దగ్గరనున్న డివైస్ మొబైల్ ఫోన్ పరిస్థితి ఇంకాస్త విషమంగా మారుతుంది. ఉష్ణోగ్రతలు 35°C మించగానే, మొబైల్ ఫోన్ వాడకంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. బ్యాటరీ వేడెక్కడం, ఫోన్ పనితీరు మందగించడం, హార్డ్‌వేర్ డ్యామేజ్, తీవ్ర పరిస్థితుల్లో పేలుడు ప్రమాదం కూడా సంభవించవచ్చు. చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇలాంటి సమయంలో వేసవి వేడిని తట్టుకొని మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎలా సురక్షితంగా ఉంచుకోవాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. నేరుగా ఎండలో ఫోన్ ఉంచొద్దు
మీ ఫోన్‌ను కారు డాష్‌బోర్డ్‌పై, బీచ్ టవల్‌పై లేదా కిటికీ దగ్గర ఎండలో వదిలేయొద్దు. ఎండలో ఫోన్ ఉష్ణోగ్రత 45°C దాటితే, అది సాధారణంగా పనిచేసే రేంజ్ (0°C నుంచి 35°C) కంటే ఎక్కువ అవుతుంది. షేడ్‌లో ఉంచండి, లేదా బ్యాగ్‌లో దాచండి. ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల లిథియం-ఐయాన్ బ్యాటరీ వేడెక్కుతుంది. ఇది “థర్మల్ రన్‌వే” అనే స్థితికి దారితీస్తుంది. బ్యాటరీ ఎక్కువ వేడిని ఉత్పత్తి చేసి, ఉబ్బడం, లీక్ అవడం లేదా అరుదైన సందర్భాల్లో పేలడం జరగవచ్చు. 2019లో కారులో ఎండలో వదిలేసిన ఫోన్ వేడెక్కి మంటలు చెలరేగిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
2. వేడిలో ఓవర్‌చార్జింగ్ చేయొద్దు
కారులో లేదా వేడి ఉపరితలంపై ఫోన్ చార్జ్ చేయొద్దు. చల్లని, గాలి ఆడే చోట చార్జ్ చేయండి. చార్జింగ్ సమయంలో గేమ్‌లు ఆడటం లేదా వీడియోలు చూడటం మానండి. చార్జింగ్ సమయంలో ఫోన్ వేడెక్కుతుంది. ఇప్పటికే ఎండ ఉంటే, బ్యాటరీ అతిగా వేడెక్కి పేలుడు ప్రమాదం పెరుగుతుంది. 2020లో చైనాలో ఒక ఫోన్, వేడి వాతావరణంలో చార్జింగ్ సమయంలో పేలిందని వార్తలు వచ్చాయి. దెబ్బతిన్న లేదా నకిలీ బ్యాటరీలు ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతాయి.
3. సరైన కేస్ ఉపయోగించండి
వేసవిలో గాలి ఆడే కేస్‌లను ఉపయోగించండి. మందమైన, వేడిని బంధించే కేస్‌లను తొలగించండి. చార్జింగ్ లేదా గేమింగ్ సమయంలో కేస్ తీసేయడం మంచిది. వేడిని బంధించే కేస్‌లు ఫోన్ ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఇది బ్యాటరీపై ఒత్తిడిని తెస్తుంది. 2018లో ఒక సంఘటనలో, మందమైన కేస్‌లో ఉన్న ఫోన్ వేడెక్కి మంటలు చెలరేగాయి. ఇలాంటి సందర్భాలు బ్యాటరీ పేలుడుకు దారితీయవచ్చు.
Read Also: AkshayaTritiyaOffers: అక్షయ తృతీయ 2025 స్పెషల్..ఫోన్‌పే …
4. బ్యాటరీ ఆరోగ్యాన్ని పరిశీలించండి
ఫోన్ ఉష్ణోగ్రతను అప్పుడప్పుడూ చెక్ చేయండి. చాలా ఫోన్‌లలో బిల్ట్-ఇన్ సెన్సార్‌లు ఉంటాయి. గేమ్‌లు లేదా నావిగేషన్ యాప్‌లను ఎక్కువసేపు వాడొద్దు. ఫోన్ వేడిగా అనిపిస్తే, స్విచ్ ఆఫ్ చేసి చల్లబరచండి. గేమ్‌ల వంటి హై-పెర్ఫార్మెన్స్ యాప్‌లు బ్యాటరీ, ప్రాసెసర్‌ను వేడెక్కిస్తాయి. ఫోన్ ఉష్ణోగ్రత 60°C దాటితే, బ్యాటరీ థర్మల్ రన్‌వే స్థితికి చేరుకుంటుంది. 2016లో శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7 రీకాల్ విషయంలో ఇలాంటి సమస్యలే కారణమయ్యాయి.
5. సరైన స్థలంలో ఫోన్
ఫోన్‌ను కారు గ్లోవ్ కంపార్ట్‌మెంట్, బ్యాగ్ లేదా జేబులో ఎక్కువసేపు ఉంచొద్దు. చల్లని, పొడి ప్రదేశంలో (30°C కంటే తక్కువ) ఉంచండి. గాలి ఆడని చోట ఫోన్ వేడెక్కుతుంది. 2018లో భారత్‌లో ఒక కారులో ఫోన్‌ను ఎక్కువసేపు26 గెలాక్సీ నోట్ 9 వేడెక్కి పేలిన సంఘటన జరిగింది.
6. అసలు చార్జర్‌లు వాడండి
కంపెనీ ఇచ్చిన చార్జర్‌లు, కేబుల్స్ మాత్రమే వాడండి. నకిలీ చార్జర్‌లు ఓవర్‌చార్జింగ్ లేదా షార్ట్-సర్క్యూట్‌కు దారితీస్తాయి. బ్యాటరీ లేదా చార్జింగ్ పోర్ట్ దెబ్బతిన్నట్టు కనిపిస్తే, వెంటనే రిపేర్ చేయించండి. నకిలీ చార్జర్‌లలో సేఫ్టీ ఫీచర్‌లు ఉండవు, ఇవి బ్యాటరీని వేడెక్కిస్తాయి. 2020లో చైనాలో ఒక ఫోన్, నకిలీ చార్జర్ వల్ల వేడెక్కి పేలిన సంఘటన నమోదైంది.
7. నీటితో చల్లబరచొద్దు
ఫోన్ వేడెక్కితే, ఫ్రిజ్‌లో లేదా నీటి దగ్గర ఉంచొద్దు. ఇది లోపల తేమ చేరి షార్ట్-సర్క్యూట్‌కు దారితీస్తుంది. స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. తేమ వల్ల బ్యాటరీ షార్ట్-సర్క్యూట్ అయి, వేడి వాతావరణంలో స్పార్క్‌లు లేదా పేలుడు జరగవచ్చు.