BigTV English

Jyothika: తెలుగులో రీఎంట్రీకి సిద్ధమయిన జ్యోతిక.. ఏకంగా మెగాస్టార్ సినిమాలో..

Jyothika: తెలుగులో రీఎంట్రీకి సిద్ధమయిన జ్యోతిక.. ఏకంగా మెగాస్టార్ సినిమాలో..

Jyothika: ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలిగిపోయిన చాలామంది పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్‌లో బిజీ అయిపోయారు. కానీ ఈరోజుల్లో అలాంటి స్టార్ హీరోయిన్లకు కూడా సినిమాల్లో మళ్లీ రీఎంట్రీ ఇచ్చే స్కోప్ లభించింది. అలనాటి సీనియర్ హీరోయిన్లను కేవలం తల్లి పాత్రలకు మాత్రమే పరిమితం చేయకుండా వారికోసం స్పెషల్ క్యారెక్టర్స్ సిద్ధం చేస్తున్నారు మేకర్స్. అందుకే చాలామంది నటీమణులు మళ్లీ సినిమాల్లో అడుగుపెట్టడానికి, సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ఇష్టపడుతున్నారు. అందులో సూర్య సతీమణి జ్యోతిక కూడా ఒకరు. ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో దూసుకుపోతున్న జ్యోతిక.. తెలుగులో కూడా రీఎంట్రీకి సిద్ధమయినట్టు తెలుస్తోంది.


టాలీవుడ్‌లోకి రీఎంట్రీ

ఒకప్పుడు కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోయింది జ్యోతిక. అదే సమయంలో తన కో స్టార్ సూర్యతో ప్రేమలో పడి తనను పెళ్లి కూడా చేసుకుంది. పెళ్లి తర్వాత ఫ్యామిలీ కోసం సినిమాలకు దూరమయ్యింది. పెళ్లి, పిల్లలు అంటూ దాదాపు పదేళ్లకు పైగా వెండితెరకు పూర్తిగా దూరమయిపోయింది జ్యోతిక. కానీ ఒకప్పుడు తను క్రియేట్ చేసుకున్న స్టార్‌డమ్ వల్ల ఇప్పటికీ తను ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. అందుకే మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత పలు తమిళ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించిన జ్యోతిక.. ఆ తర్వాత ఏకంగా బాలీవుడ్ బాటపట్టింది. ఇప్పుడు ఏకంగా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయినట్టు తెలుస్తోంది.


తెలుగులో సినిమాలు

సూర్య, జ్యోతిక (Jyothika).. వీరిద్దరికీ టాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉంది. సూర్యను ఏకంగా తెలుగు హీరోలతో సమానంగా ప్రేమిస్తారు ప్రేక్షకులు. అయినా తను నేరుగా ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. కానీ జ్యోతిక మాత్రం తన కెరీర్ మొదట్లో ‘షాక్’, ‘ఠాగూర్’ వంటి తెలుగు సినిమాల్లో నటించింది. అలా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ తెలుగు తెరపై కనిపించలేదు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత కోలీవుడ్, బాలీవుడ్‌లోనే పూర్తిగా బిజీ అయిన ఈ సీనియర్ నటి.. ఇప్పుడు తెలుగులో కూడా మళ్లీ తన మ్యాజిక్ చూపించడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. అది కూడా మళ్లీ మెగాస్టార్‌తోనే జోడీకట్టనుందని సమాచారం.

Also Read: రెట్రో సునామీ మొదలయ్యింది.. విడుదల ముందే రికార్డులు.. సూర్య విశ్వరూపం.!

ఎగ్జైటింగ్ అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. సీనియర్ హీరో వెంకటేశ్‌తో కలిసి చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్‌బస్టర్ కొట్టాడు అనిల్. ఇప్పుడు చిరంజీవితో కూడా అదే రేంజ్‌లో హిట్ కొడతాడని ప్రేక్షకులు నమ్ముతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం పూర్తి కాగా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఇదే సమయంలో అనిల్, చిరు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీలో జ్యోతిక హీరోయిన్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఠాగూర్’ తర్వాత ఇన్నేళ్లకు చిరు, జ్యోతికను కలిసి ఒకే స్క్రీన్‌పై చూడడం ప్రేక్షకులు ఎగ్జైటింగ్‌గా ఫీలవుతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×