BigTV English
Advertisement

PuriSethupathi : మాస్టర్ పీసా.? అప్పుడే డిసైడ్ చేశారా.? ముందు సినిమా సరిగ్గా తీయండి.

PuriSethupathi : మాస్టర్ పీసా.? అప్పుడే డిసైడ్ చేశారా.? ముందు సినిమా సరిగ్గా తీయండి.

PuriSethupathi : ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ల ప్రస్తావన వస్తే పూరీ జగన్నాథ్ పేరు వినిపించేది. కానీ ఇప్పుడు పూరి కెరీర్లో హిట్ సినిమా చూసి చాలా రోజులైంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలిపోతున్నాయి. ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సినిమా టెంపర్. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఇకపోతే ఆ సినిమాకి కథ వక్కంతం వంశీ అందించాడు. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ కెరియర్ పూర్తిగా చేసిన ప్రతి సినిమా హిట్ అవుతూ వచ్చింది. కానీ పూరి జగన్నాథ్ కెరీర్ మాత్రం ఆ తరువాత వరుసగా డిజాస్టర్లు పడుతూ ఇస్మార్ట్ శంకర్ సినిమా కొంత ఉపశమనం కలిగించింది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. వెంటనే విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు పూరి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.


లైగర్ తెచ్చిన భారీ నష్టాలు

విజయ్ దేవరకొండ చేసిన లైగర్ సినిమా మినిమం కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఆ సినిమా వలన భారీ నష్టాలు ఎదుర్కొన్నారు. ఇకపోతే కొంతమంది పూరి జగన్నాథ్ ఇంటిముందు ధర్నాకు దిగే పరిస్థితి కూడా వచ్చింది. వీటన్నిటి మధ్యలో కూడా డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చాడు పూరి. ఇక ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఒక ఆల్మోస్ట్ పూరి జగన్నాథ్ పని అయిపోయింది అనుకునే టైంలో, విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం విజయసేతుపతి ఎంచుకుని స్క్రిప్ట్స్ అని చెప్పాలి. ఈ సినిమాలో టబు కూడా కీలకపాత్రలో కనిపిస్తుంది.


పూరి సేతుపతి సినిమాలో మరో కీలక నటుడు

ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి టబు తో పాటు పవర్ హౌస్ పెర్ఫార్మర్ దునియా విజయ్ దీనిలో నటించబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు పూరి కనెక్ట్స్ బ్యానర్. అయితే ఈ నటుడుని రివిల్ చేయడానికి అంటే ముందు ఈ మాస్టర్ పీస్ సినిమాలో పవర్ఫుల్ పర్ఫార్మర్ నటించబోతున్నారు అని అనౌన్స్ చేసినప్పుడు, ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మాస్టర్ పీస్ అని మీరే డిసైడ్ చేసేస్తారా.? ముందు సినిమా సరిగ్గా తీయండి అది మాస్టర్ పీస్ ఆ.? కాదా.? అని మేము డిసైడ్ చేస్తాం. లైగర్ సినిమాకి, డబుల్ ఇస్మార్ట్ సినిమాకి ఇలానే నమ్మకాలు పెట్టుకున్నాం నిరాశ పడటం అంటూ కొంతమంది ప్రేక్షకులు తమ బాధలను వ్యక్తం చేస్తున్నారు.

 

 

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×