YouTube monetization rules 2027: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రముఖ వీడియో ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ నిబంధనలలో కీలక మార్పులు రాబోతున్నాయి. వచ్చే ఏడాది నుంచి యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడం మరింత కష్టతరం కానుంది.కేవలం సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఉంటే సరిపోదని.. వ్యూస్, వాచ్ టైమ్ మరింత కీలకం కానున్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. క్రియేటర్లను షాక్‌కు గురి చేస్తున్న ఈ కొత్త అప్ డేట్ విశేషాలు , రాబోయే రోజుల్లో రానున్న మార్పుల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్‌లో వీడియోలు చేస్తూ డబ్బు సంపాదించాలనుకునే.. వారికి యూట్యూబ్ ఎప్పుడూ ముందుంటుంది.అయితే.. రోజురోజుకూ పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకొని యూట్యూబ్ తన నిబంధనలను కఠినతరం చేస్తోంది. ముఖ్యంగా 2027 నాటికి యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ నిబంధనలలో తెస్తున్న మార్పులు క్రియేటర్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న రూల్స్‌తో పోలిస్తే ఇకపై ఛానెల్‌ను మానిటైజ్ చేసుకోవడం లేదా ఆదాయాన్ని నిలబెట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. కేవలం సబ్‌స్క్రైబర్ల సంఖ్యను నమ్ముకుని వీడియోలు చేసే రోజులు పోయి, డైరెక్ట్ వ్యూస్ ఆధారంగా సంపాదన ఉండేలా రూల్స్ మారుతున్నాయి.
సాధారణంగా కొత్త క్రియేటర్లు.. లాంగ్ వీడియోల ద్వారా యాడ్ రెవెన్యూ పొందాలంటే.. గతంలో కొన్ని నిర్దిష్టమైన వాచ్ టైమ్ ఉంటే సరి పోయేది. కానీ తాజా అప్‌డేట్ ప్రకారం.. ఈ నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి. అలాగే షార్ట్స్ ద్వారా సంపాదించాలనుకునే వారికి కూడా వ్యూస్ టార్గెట్లు భారీగా పెరగనున్నాయి. దీని వల్ల కొత్త యూట్యూబర్లు మానిటైజేషన్ సాధించాలంటే.. చాలా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. సబ్‌స్క్రైబర్ల సంఖ్య 1,000 అలాగే ఉన్నప్పటికీ, వాచ్ టైమ్, వ్యూస్ టార్గెట్లు పెరగడం చిన్న క్రియేటర్లకు పెద్ద సవాల్‌గా మారింది.
వ్యూస్‌కి ప్రాధాన్యత ఎందుకు పెరుగుతోంది?
ఇప్పటి వరకు చాలా మంది ఛానెల్‌కు వేలల్లో సబ్‌స్క్రైబర్లు ఉన్నప్పటికీ, వీడియోలకు సరైన వ్యూస్ రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. అయితే 2027 నాటికి యూట్యూబ్ అల్గారిథమ్ పూర్తిగా వ్యూస్ , ఆడియెన్స్ రిటెన్షన్‌పై ఫోకస్ చేయనుంది. అంటే మీ ఛానెల్‌కు ఎంత మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు అనేది కాకుండా.. మీరు అప్‌లోడ్ చేసే ప్రతీ వీడియోను ఎంత మంది చూస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు అనేదే మీ సంపాదనను నిర్ణయిస్తుంది. ఏ ఛానెల్ అయితే నిరంతరం ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుందో, వాటికే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది.
Also Read: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ డేట్స్ వచ్చేసాయ్..షాపింగ్‌కు రెడీ అయిపోండి!
ఈ కఠినమైన నిబంధనల కారణంగా నాణ్యమైన, ట్రెండింగ్ కంటెంట్ అందించే వారికి మాత్రమే ప్లాట్‌ఫారమ్‌లో మనుగడ ఉంటుందని యూట్యూబ్ స్పష్టం చేస్తోంది. కేవలం వ్యూస్ కోసం కాకుండా ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా వీడియోలను రూపొందించడంపై క్రియేటర్లు దృష్టి పెట్టాలి. ఇప్పటికే మోనిటైజ్ అయిన పాత ఛానెళ్లకు కూడా ఎంగేజ్‌మెంట్ రూల్స్ వర్తిస్తాయి కాబట్టి.. ఎప్పటికప్పుడు కంటెంట్‌లో మార్పులు చేసుకోవడం చాలా అవసరం.
మొత్తానికి.. రాబోయే రోజుల్లో యూట్యూబ్‌లో రాణించాలంటే సబ్ స్క్రైబర్ల సంఖ్యతో.. సంబంధం లేకుండా వ్యూస్ , కంటెంట్ క్వాలిటీ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించనున్నాయి. కొత్త రూల్స్ అమలయ్యేలోపు మీ ఛానెల్ గ్రోత్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిది.